– జీషన్ ఖాద్రీ స్క్రిప్ట్‌ను తారుమారు చేసి, ఒక నిజమైన హీరోని, విలన్ పాత్రలో ఇరికించారు
1980ల నాటి అవిభాజ్య బీహార్.
ధన్‌బాద్… బొగ్గు గనుల రాజధాని. గాలిలో కూడా గన్‌పౌడర్ వాసన, మాఫియా నెత్తుటి మరకలు కనిపించే రోజులవి..
అది ధన్‌బాద్‌లోని ‘భూలీ’ ప్రాంతం. ఒక బ్రాహ్మణ కుటుంబంలోని యువతి అదృశ్యమైంది..
నిజానికి ముస్లిం గూండాల చేత కిడ్నాప్ చేయబడింది..
ఆ తండ్రి గుండె పగిలింది. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు, అధికారుల కాళ్ళావేళ్లా పడ్డాడు..
కానీ ఖాకీల నిస్సహాయత ఆ తండ్రికి అర్థమైంది..
అక్కడ చట్టం పని చేయదు, ‘బలం’ మాత్రమే మాట్లాడుతుంది..
ఆ తండ్రికి అప్పుడు గుర్తొచ్చిన ఏకైక పేరు..
సూరజ్‌దేవ్ సింగ్.
ఆయనను అందరూ ప్రేమగా, భయంగా పిలుచుకునే పేరు “బాబూ సాహెబ్”..
జరియా నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యే, కోల్ బెల్ట్ రారాజు, తిరుగులేని బాహుబలి!
ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నుండి పొట్టచేతబట్టుకుని, సామాన్యమైన కోల్-కట్టర్ (బొగ్గు కార్మికుడు)గా ధన్బాద్లో అడుగుపెట్టాడు సూరజ్‌దేవ్..
స్వతహాగా పహిల్వాన్ (కుస్తీ వీరుడు)..మొండి ధైర్యం అతన్ని మాజీ పొలిటీషియన్ బి.పి. సిన్హాకు బాడీగార్డ్‌గా మార్చాయి..
ఆ తర్వాత కార్మిక నాయకుడిగా ఎదిగి, రాజకీయాల్లోకి వచ్చి ఒక సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న చరిత్ర ఆయనది..
ఆ తండ్రి వెళ్లి బాబూ సాహెబ్ కాళ్ళ మీద పడ్డాడు. విషయం విన్న సూరజ్‌దేవ్ సింగ్ కళ్ళలో రౌద్రం నిండింది..
“నా ఇలాకాలో ఆడబిడ్డకి అన్యాయం జరుగుతుందా?” అని గర్జించాడు.
మరుసటి రోజు ఉదయం!
వాసేపూర్ (Wasseypur)… నేర సామ్రాజ్యానికి అడ్డాగా చెప్పుకునే ప్రాంతం..
నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ ఒక తెల్ల అంబాసిడర్ కారు దూసుకొచ్చింది..
కారు ఆగింది. బాబూ సాహెబ్ దిగారు. చేతిలో ఒక మైక్ పట్టుకున్నారు. కారుకి ఉన్న లౌడ్ స్పీకర్ ఆన్ అయ్యింది..
వాసేపూర్ వీధులన్నీ దద్దరిల్లేలా ఆయన గొంతు వినిపించింది.
“ఒరేయ్… వినండ్రా! ఆ అమ్మాయిని ఎవరైతే ఎత్తుకొచ్చారో వారికి నా చివరి హెచ్చరిక. రాబోయే 24 గంటలు..కేవలం 24 గంటలు టైమ్ ఇస్తున్నా..
ఆ ఆడబిడ్డ, ఆమె గౌరవానికి చిన్న మచ్చ కూడా రాకుండా క్షేమంగా ఇంటికి చేరాలి. లేదంటే… ఈ వాసేపూర్ అనే ఊరు మ్యాప్‌లో లేకుండా పేల్చేస్తా!”
ఆ హెచ్చరికలో ఉన్న తీవ్రతకు వాసేపూర్ గజగజలాడింది. అది సాధారణ నాయకుడి మాట కాదు, బాబూ సాహెబ్ శాసనం..
ఆశ్చర్యం ఏమిటంటే… ఆయన ఇచ్చిన గడువు ముగియక ముందే, ఆ యువతి క్షేమంగా, సగౌరవంగా తన ఇంటికి చేర్చబడింది. అది సూరజ్‌దేవ్ సింగ్ అంటే ఉన్న భయం! అది ఆయనకున్న పవర్!
దురదృష్టం ఏమిటంటే… చరిత్రను వక్రీకరించారు. “గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్” సినిమాలో ఈ ఉదంతాన్ని పూర్తిగా మార్చేశారు.. ముస్లిం యువతిని కిడ్నాప్ చేసినందుకు సర్దార్ ఖాన్, రమాధీర్ సింగ్‌ను బెదిరించినట్లుగా సీన్ సృష్టించారు..
వాస్తవానికి అక్కడ జరిగింది వేరు, చూపించింది వేరు. ఠాకూర్లను విలన్లుగా చూపించడానికి, వాసేపూర్కు చెందిన ఆ సినిమా రచయిత జీషన్ ఖాద్రీ స్క్రిప్ట్‌ను తారుమారు చేసి, ఒక నిజమైన హీరోని, విలన్ పాత్రలో ఇరికించారు..
దీన్నే నేరేటివ్ బిల్డింగ్ అంటారు..
హిందీ సినిమాలు.. సీరియళ్ళు..OTT ప్లాట్ఫార్మ్స్ లో ఇలా హిందువులను విలన్లగానూ.. ముస్లిమ్స్ ను హీరోలు గానూ చూపడం వాళ్లకు అత్యంత సాధారణ విషయాలు..