చిన్న చిన్న సంతోషాలు కూడా డబ్బు ఖర్చు పెడితేనే దొరుకుతాయి అనే ఆలోచన కొంతమంది జీవిస్తున్నారు.
నీకు నచ్చిన దేవుడిని మనసులో పూజించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
నీ పక్కనే ఉన్న వాళ్లతో పది నిమిషాలు ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడటానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇంట్లో వండుకున్న భోజనాన్ని ఇంట్లో వాళ్లతో కలిసి కూర్చొని తినడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఇంట్లో పెంచుకున్న మొక్కలతో ఒక గంట కాలక్షేపం చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది?
ఒక మంచి పుస్తకం చదవడానికి ఎంత ఖర్చు అవుతుంది?
భర్తతో / భార్యతో, అమ్మతో / నాన్నతో ప్రేమగా ఉండడానికి ఎంత ఖర్చు అవుతుంది?
సాటి మనిషిని “ఎలా ఉన్నారు?” అని ఆప్యాయంగా అడగడానికి ఎంత ఖర్చు అవుతుంది?
చిన్నప్పటి స్నేహితులు గుర్తొస్తే, వాళ్లను పలకరించడానికి ఎంత ఖర్చు అవుతుంది?
మన దగ్గర ఉన్న దాంట్లోంచి, తిండి లేనివాళ్లకు కొంచెం తిండి పెట్టడానికి ఎంత ఖర్చు అవుతుంది?
పైసా ఖర్చు లేకుండానే ఎన్నో సంతోషాలు, సరదాలు, మనసుకు ప్రశాంతతనిచ్చే పనులు చేయొచ్చు.
ఇంకెన్నో ఉన్నాయి…
అన్నిటికీ డబ్బే అవసరం లేదు.
డబ్బుతోనే పని లేదు.
డబ్బు అవసరం నీకు ఎప్పుడంటే..
నీ స్థాయి కంటే, నీ స్థాయిని దాటి లగ్జరీగా బతకాలి అనుకున్నప్పుడే… అంతే..
– వల్లూరి సూర్యప్రకాష్
బ్యాంక్ కాలనీ –1, కరీంనగర్