తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలను రగిలిస్తుంటే, అది తన రాజకీయ భవితవ్యంపై వేటు వేసే సుదర్శన చక్రంలా మారుతుందని జగన్ జడుసుకుంటున్నారు.
ఎన్ని కుప్పిగంతులు వేస్తూ.. ఎలా పెడబొబ్బలు పెడుతున్నాడో కోట్లాది హిందువులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
గతంలో తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించుకుని భేటీ అయిన సుబ్రహ్మణ్య స్వామి గారితో, ఆ స్నేహాన్ని అక్షరాలా నిలబెట్టుకుంటున్నట్లున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ను సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టు తలుపు తట్టడం చూస్తుంటే.. “క్రింది స్థాయి వారు దొరికినా, పైవారు.. పైగా కావాల్సిన తనవారు దొరక్కుండా చూసే” అద్భుతమైన వ్యూహంలా కనిపిస్తోంది.
కల్తీ మీద చర్చలు ఆపాలి, విచారణలు వద్దు అంటూ కోర్టుకెళ్లడం వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఎవరిని రక్షించడానికో అందరికీ అర్థమవుతూనే ఉంది. లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని సిట్ రిపోర్టులు వచ్చాక, వైవీ సుబ్బారెడ్డి కూడా స్వయంగా కల్తీని అంగీకరించాక, చర్చ జరగకుండా నోళ్లు మూయించాలని చూడటం ప్రజాస్వామ్యంలో విడ్డూరం.
సుబ్రహ్మణ్య స్వామి గారి పిటిషన్ ప్రధాన ఉద్దేశం విచారణను నీరుగార్చడం లేదా కనీసం కాలయాపన చేయడమే. గతంలో జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు “ధర్మ సూక్తులు” గురించి మాట్లాడిన స్వామి గారు, ఇప్పుడు అదే ధర్మానికి ముడిపడిన లడ్డూ వ్యవహారంలో దోషులను పట్టుకోకుండా అడ్డుపడుతున్నారా? అనే అనుమానం కలగక మానదు. కల్తీ జరిగిందని తేలితే బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాల్సింది పోయి, విచారణా కమిషన్లే వద్దని అనడం “కాపాడే చేయి” ఎవరిదో స్పష్టం చేస్తోంది.
తిరుమల పవిత్రతను కాపాడటం కంటే, కల్తీదారులను కాపాడటమే ఈ ‘లిటిగెంట్’ కి ముఖ్యం అయిపోయింది. వైకాపా నాయకులు ఈ పిటిషన్ వెనుక ఆనందంగా ఊపిరి పీల్చుకోవచ్చు కానీ, సామాన్య భక్తుడు మాత్రం “స్వామి ద్రోహులు ఎప్పుడు దొరుకుతారు?” అని ఎదురుచూస్తూనే ఉంటాడు.
కోర్టులో కేసులు వేయొచ్చు కానీ, కోట్లాది మంది భక్తుల మనస్సులో ఉన్న అనుమానాలను ఏ పిటిషన్ తుడిచివేయలేదు.
ఓం నమో వేంకటేశాయ!