– నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
– మా తల్లిదండ్రులను హౌస్ అరెస్టు చేశారు
– సమ్మక్క,సారక్క గద్దెల వద్ద భక్తులపై లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు?
– సమ్మక్క గద్దెలు ఉన్న 4 ఎకరాల 16 గుంటల్లో 50 శాతం మాది
– జమ్మికుంట ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
– ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
హైదరాబాద్: వీణవంక నేను పుట్టి పెరిగిన గ్రామం. తాత, ముత్తాతల నుంచి సమ్మక్క,సారక్క జాతర అక్కడ మేము దానం చేసిన స్థలం లో జరుగుతోంది. సమ్మక్క గద్దెలను నా స్వంత డబ్బులు 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేశాను. హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ నుంచి నేను వీణవంకకు వెళ్తుంటే నన్ను ఎందుకు అడ్డుకున్నారు? మా తల్లిదండ్రులను హౌస్ అరెస్టు చేశారు.
మేము నలుగురం మాత్రమే సమ్మక్క గద్దెల వద్దకు వెళ్ళాము. నా మైనర్ బిడ్డను పోలీసులు గుంజుకుని వెళ్లారు.
రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కరీంనగర్ సీపీ నన్ను ఇబ్బందులు పెట్టారు. నేను ముస్లింలను తిట్టానని కాంగ్రెస్ వాళ్లు నాపైన అసత్య ప్రచారం చేస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు ఇబ్బందులు పడే విధంగా పోలీసులు వ్యవహరించారు. నన్ను అడ్డుకున్న పోలీసులను సస్పెండ్ చేయాలి.లేదా నాకు క్షమాపణ చెప్పాలి. నేను కరీంనగర్ సీపీ మత మార్పిడులకు పాల్పడుతున్నారని అన్నానని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా.
ఈ కేసును సిఐడికి ఇస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. నన్ను ఇబ్బందులు పెట్టిన పోలీసులను పిలిచి సీఐడీ వాళ్ళు విచారణ చేశారు. నేను 50 మందితో వెళ్లినట్లు నిరూపిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. సిఐడిని పోలీసులు తప్పుదోవ పట్టిస్తున్నారు. అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్ ను బయటకు తీయాలి.
పోలీసులతో కుమ్మక్కు అయ్యి సిఐడి విచారణ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ ఏం ఇస్తే అదే చేస్తారా? కరీంనగర్ సీపీ, హుజూరాబాద్ సీపీ చేసిన తప్పులకు వంద తప్పులు పోలీసు శాఖ చేస్తోంది. వచ్చే మూడు ఏళ్ళల్లో బిఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది. ఎవరిని విడిచిపెట్టేది లేదు. కరీంనగర్ సీపీ,హుజురాబాద్ ఏసీపీ,జమ్మికుంట సిఐను సస్పెండ్ చేసే వరకు పోరాటం చేస్తాను.
హుజురాబాద్ నియోజకవర్గంలో పోలీసులు ఏజెంట్లను పెట్టుకుని వసూళ్లు చేస్తున్నారు.త్వరలో ఆధారాలతో బయటపెడతాను. ల్యాండ్ ఎండోమెంట్ కు సంబంధించినది అని ఎమ్మార్వో రిపోర్ట్ ఇచ్చినందుకు వెంటనే ఆయన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడుకునే ఉదేశ్యం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా? నా నియోజకవర్గంలో జమ్మికుంట మున్సిపాలిటీకి ముస్లింని వైస్ ఛైర్మన్ చేశాము. హుజురాబాద్ మున్సిపాలిటీలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఖలీద్ కు ఎందుకు వైస్ ఛైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు.
జమ్మికుంట ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి. వీణవంకలో సమ్మక్క,సారక్క గద్దెల వద్ద భక్తులపై లాఠీ ఛార్జ్ ఎందుకు చేశారు? భక్తులను ఎందుకు కొట్టారో పోలీసులు సమాధానం చెప్పాలి. వీణవంక మండలంలో ఉన్న ప్రజలను సీఐడీ విచారణకు పిలిస్తే నిజం ఏమిటో తెలుస్తుంది. సమ్మక్క జాతర ఒక వ్యక్తి కోసం నిర్వహిస్తున్నారా లేక ప్రజల కోసం నిర్వహిస్తున్నారా?
సమ్మక్క గద్దెలు ఉన్న 4 ఎకరాల 16 గుంటల్లో 50 శాతం వాళ్ళది. 50 శాతం మాది. మేము ఎప్పుడో ఎండోమెంట్ కు రాసి ఇచ్చాము. హుండీలో వచ్చిన భక్తుల డబ్బులు ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేశారు. రాజకీయాలకు పోలీసులు బలి కావద్దని కోరుతున్నా. డీజీపీ వెంటనే ముగ్గురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి.
డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దు: ఎమ్మెల్యే గంగుల కమలాకర్
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టుల పర్వం నడుస్తోంది. అభివృద్ధిని మరచి అక్రమ కేసుల పై దృష్టి పెడుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఇబ్బందులు పెడుతున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలను దోషులుగా చూస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యేగా వీణవంక సమ్మక్క సారక్క జాతర లో ప్రోటోకాల్ అడిగారు. ప్రోటోకాల్ ఉల్లంఘించడమే కాక పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు నిరాధార ఆరోపణలు చేశారు.
సీపీ మత మార్పిడులకు పాల్పడుతున్నారని పాడి కౌశిక్ రెడ్డి ఎక్కడా అనలేదు. ఐపీఎస్ అధికారుల సంఘం చేసిన స్టేట్మెంట్ ను అపుడే కౌశిక్ రెడ్డి ఖండించారు. ఈ కేసును సీఐడీకి ఎందుకు ఇస్తున్నారు? ఈ కేసులో స్కాం ఉందా ?దొంగతనం చేశారా ? తవ్వి తీసేందుకు ఏముంది ? మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను ఎందుకు కస్టడీ కావాలని ఎందుకు అడుగుతున్నారు? సిఐడి విచారణ పారదర్శకంగా జరగాలి. ఎవరి మీద పాడి కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తున్నారో వారితో కలిసి సీఐడీ విచారణ చేస్తే న్యాయం ఎలా జరుగుతోంది? డీజీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించవద్దు.