హైదరాబాద్: రాజమండ్రి నగరానికి చెందిన తెలంగాణ సీఎల్పీ ఉద్యోగి, రచయిత శ్రీపాద శ్రీనివాస్ మార్చి 26వ తేదీ మధ్యాహ్నం హైదరాబాద్ రవీంద్రభారతిలో వివేకానంద “స్ఫూర్తి రత్న ” పురస్కారం అందుకోనున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ సాంస్కృతిక సంస్థలైన
వైద్యుల గ్లోబల్ ఫౌండేషన్, వసుంధర విజ్ఞాన వికాస మండలి సంయుక్తంగా వివిధ రంగాలలోని ప్రతిభా వంతులకు “ స్ఫూర్తి రత్న ”పురస్కారాలను అందిస్తోంది.ఇందులో భాగం సాహిత్య రంగంలో ఔత్సాహిక రచయిత శ్రీపాద శ్రీనివాస్ కు ఈ అవార్డును ప్రకటించారు.
శ్రీనివాస్ పలు కథలు, కథానికలు రాశారు. వీటిలో అనేక తన స్వరంతోనే ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రం నుండి వినిపించారు. అలాగే రాజకీయ, సామాజిక చైతన్యంతో పుస్తకాలు రచించి అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కళాభిమానుల నుంచి ప్రశంసలు పొందారు.శ్రీపాద శ్రీనివాస్ అవార్డు అందుకోనున్న శుభ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, శ్రేయోభిలాషులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.