– పరిశ్రమలు రావడం అంటే కొబ్బరికాయ కొట్టడం కాదు సామీ… ఉన్నవాటిని గౌరవంగా ఉంచడం
– ఏపీకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు కాదు.. ఇన్వెస్టర్లకు “రక్త హోలీ” లేని ప్రశాంతమైన వాతావరణం
“మేము బటన్ నొక్కుతాం.. మీరు ఓట్లు వేయండి” అంటూ సాగిన గత ఐదేళ్ల పాలనలో, పరిశ్రమలు మాత్రం తమ సొంత ‘సెల్ఫ్ ఎగ్జిట్’ బటన్ నొక్కుకుని పొరుగు రాష్ట్రాలకు చెక్కేశాయని ఆర్బీఐ లెక్కలు కుండబద్దలు కొట్టాయి. 16,924 గా ఉన్న పరిశ్రమల సంఖ్య 16,011 కి పడిపోవడం అంటే అది కేవలం అంకెలు తగ్గడం కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లడమే.
913 పరిశ్రమలు మూతపడటంతో సుమారు 91,300 మంది నేరుగా రోడ్డున పడ్డారు. వీరిపై ఆధారపడిన హోటళ్లు, రవాణా, ఇతర అనుబంధ రంగాల్లోని మరో 3 లక్షల మంది జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయి. ఇది ఏదో చిన్న కిరాణా కొట్టు మూసేసిన వ్యవహారం కాదు; వేల కోట్ల పెట్టుబడి, లక్షల మంది నిరుద్యోగుల ఆశలు ఆవిరైపోయిన ఉదంతం.
ఆనాడు ‘వేలు’.. ఈనాడు ‘కాలు’:
నాటి ‘న్యూడ్’ ఎంపీ గోరంట్ల గారు అంతర్జాతీయ సంస్థ ‘కియా’ (KIA) ప్రతినిధిపై వేలు చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఫోటో గుర్తుందిగా? ఆ ఒక్క ఫోటో చాలు, ఏపీకి రావాలంటే ఏ పారిశ్రామికవేత్తకైనా వెన్నులో వణుకు పుట్టించడానికి! “రండి బాబూ.. పెట్టుబడులు పెట్టండి” అని తమిళనాడు, గుజరాత్ ఎర్ర తివాచీ పరుస్తుంటే, మన దగ్గర మాత్రం “జే-ట్యాక్స్” భయంతో ఉన్నవాళ్లు కూడా పెట్టె సర్దుకున్నారు.
“పరిశ్రమలు రావడం అంటే కొబ్బరికాయ కొట్టడం కాదు సామీ… ఉన్నవాటిని గౌరవంగా ఉంచడం కూడా ఒక కళే!” అని ఇప్పుడు అర్థం అవుతోంది.
కట్ చేస్తే.. సీన్ మారింది! పెట్టుబడుల్లో ‘V’ షేప్ రికవరీతో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోనే విజయదరహాసం చేస్తోంది.
నాడు కంపెనీల పలాయనం..నేడు కంపెనీల క్యూ!
అప్పుడు భయపడి పారిపోయిన కంపెనీలు, ఇప్పుడు “వెల్కమ్” బోర్డులు చూసి మళ్ళీ వస్తున్నాయి. ఇదే కదా అసలైన రివర్స్ బదులు స్పీడ్ అంటే?
పరిశ్రమలు రావాలంటే ప్రగల్భాలు పలికే కోడిగుడ్డు ప్రసంగాలు కాదు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ‘గౌరవం’ ముఖ్యం . ఏపీకి కావాల్సింది ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లు కాదు, ఇన్వెస్టర్లకు “రఫ్ఫా రఫ్ఫా భయం”, “రక్త హోలీ” లేని ప్రశాంతమైన వాతావరణం. ఆ 913 కంపెనీలు ఉండి ఉంటే ఈరోజు ఏపీ ముఖచిత్రం మరోలా ఉండేది. ఇప్పటికైనా ఆ ‘శని’ వదిలి రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుండటం శుభపరిణామం!