ఇరవయ్యో శతాబ్ది ప్రథమార్ధంలో ప్రపంచ గానానికి సంబంధించి ‘crooning’ ఒక అత్యవసరమైన, ప్రధానమైన మార్పుగా వచ్చింది. దక్షిణ భారత గానంలో పీ.బీ. శ్రీనివాస్ ద్వారా crooning వచ్చింది. భారత దేశానికి తలత్ మహ్మూద్ ద్వారా crooning వచ్చింది. తలత్ ద్వారా వచ్చిన crooning దేశ సినిమా, లలిత, గజల్ గాన పరిణామానికి, ప్రాభవానికి ఎంతో అవసరమైంది.
ఇంగ్లిష్ గానంలో తన crooningతో గాయకుడు బింగ్ క్రాస్బి పెనువిప్లవానికి కారణమయ్యాడు. బింగ్ క్రాస్బి తొలిదశ crooner. బింగ్ క్రాస్బి తొలి crooner అనడం అంత అబద్ధం కాకపోవచ్చు. బింగ్ క్రాస్బి crooning ప్రపంచ గానంలో నిర్ణయాత్మక మార్పుకు ప్రతీక ఐంది.
బింగ్ క్రాస్బి అత్యంత విజయవంతమైన ఇరవయ్యో శతాబ్ది గాయకుడు! 2,500 టైటిల్స్ రికార్డ్ చేశాడు. ఆయనవి 250 మిలిఅన్ రికార్డ్లు అమ్ముడయ్యాయి. 1942లో ‘white christmas’ రికార్డ్ 30 మిలిఅన్లు అమ్ముడుపోయింది.
బింగ్ క్రాస్బి crooningతో పాటు relaxed singing styleను కూడా తీసుకువచ్చాడు. పట్టి పట్టి పాడే విధానానికి భిన్నంగా బింగ్ క్రాస్బి వదులుగా, సరళంగా, సహజంగా ఉండే గాన విధానాన్ని అందించాడు.ఈ relaxed singing style కూడా పీ.బీ. శ్రీనివాస్ ద్వారా మనకు తెలియ వచ్చింది. “వెన్నెల కేల నాపై కోపం…” పాట అందుకు సరైన ఉదాహరణ.
రికార్డ్లు, సినిమా పాటలకన్నా ముందే రేడియో మూలంగా బింగ్ క్రాస్బి ఒక గాయకుడుగా నక్షత్ర స్థాయిని సాధించాడు. ఈ అమేరిక దేశ గాయకుడి జననం 2/5/1904- మరణం 14/10/1977. మలిదశ crooners ఐన Perry Como, Tony Bennett, Frank Sinatra లకు ప్రాతిపదిక, మార్గ దర్శకుడు బింగ్ క్రాస్బి. బింగ్ క్రాస్బి warm, relaxed, intimate singing style ప్రపంచ గాన పరిణామానికి ఊతం ఐంది. ప్రపంచ గానానికి Bing ( బింగ్… ఇది బింగ్ క్రాస్బి ముద్దు పేరు) was a swing and sway.
ఘంటసాల బావిలో తల, బుద్ధి ముడుచుకుని నివాసం చేసిన తెలుగు సంగీత మేధకు ఇదిగో ఇలాంటి అంతర్జాతీయ గానం, గాయకుల గురించి పెద్దగా తెలివిడి రాలేదు. ఘంటసాలకు కూడా జాతీయ, అంతర్జాతీయ గాన అవగాహన లేదు!
మనం 2026లో ఉన్నాం. ఇవాళ ప్రపంచం మన అరిచేతిలో కనిపిస్తోంది. ఇక మన తెలుగుకు కావలసిందల్లా ‘మనో వికాసం’. ఆ మనో వికాసంతో తెలుగు మధ్యతరగతి జాతీయ, అంతర్జాతీయ గానానికి మాలిమి అవాలి. అలా మాలిమి అయితే చక్రవర్తి స్థాయి నుంచి, ఇప్పుడున్న స్థాయి నుంచి తెలుగు పాట నాణ్యమైన జాతీయం, అంతర్జాతీయం అవుతుంది.
మనలో ఇళైయరాజా, ఎ.ఆర్. రహ్మాన్ వంటి వాళ్లు ఎందుకు రాలేదు? విద్యాసాగర్ వంటి వాళ్లకు మనలో ఎందుకు చోటు లేదు? అజ్ఞానంతో, బుద్ధి మాంద్యంతో, మానసిక రోగంతో నన్ను ఆడిబోసుకోవడం వల్ల ఏమీ అవదు. అంతకు మించి నాణ్యతపై అవగాహన సాధించడం అవసరం. అది తెలుగు జాతి స్థాయిని నిర్దేశిస్తుంది.
– రోచిష్మాన్
9444012279