– కాంగ్రెస్ తెచ్చినా చట్టాన్నే వెక్కిరించిన సీఎం
– స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు
– స్పీకర్ పదవికి కళంకం తెచ్చారు
– దానం నాగేందర్ అఫిడవిట్ ఫైల్ చేసి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు
– ఒక వ్యక్తి ఒకే సారి రెండు, మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి
– సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి బీఎస్పీలో చేరితే యూపీలో ఎమ్మెల్యేపై వేటు వేశారు
-. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేయబోతున్నాము
– రాజ్యాంగంలో 10 వ షెడ్యుల్ ఎందుకు?
– మాజీ ఎంపీ బోయిన పల్లి వినోద్ కుమార్
హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో తీర్పు ఇచ్చారు. కేసును క్లోజ్ చేస్తున్నట్లు సుప్రీం కోర్టు చెప్పింది. స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వడం లేదని మా తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. 48 గంటల్లో తీర్పు కాపీ లను ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించిం. ది. స్పీకర్ తీర్పు కాపీల కోసం ఎదురు చూస్తున్నాం
మేము రెండు సంవత్సరాల క్రితం పిటీషన్ వేస్తే స్పీకర్ ఇప్పుడు తీర్పు ఇచ్చారు. ఫిరాయింపు నిరోధక చట్టం అనేది 53 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ హయం లో 1985 లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ లో పెట్టారు. ఫిరాయింపుల చట్టానికి తూట్లు పొడుస్తున్నారు
1/3 వంతు సభ్యులు వేరే పార్టీలోకి వెళ్తే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టంలో పెట్టారు. 2003 లో వాజ్ పాయ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2/3 వ వంతు సభ్యులు పార్టీ మారితే వారిపై అనర్హత వేటు ఉండదని చట్టం చేశారు. రాజీవ్ గాంధీ ,కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టాన్ని రేవంత్ రెడ్డి చంపేశారు
దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ తిరుగుతున్నారు. తెలంగాణ లో రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తీర్పు చెప్పినా రాహుల్ స్పందించడం లేదు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారు. రాజ్యాంగంలో 10 వ షెడ్యుల్ ఎందుకు? జాతీయ జెండాను అపహాస్యం చేశారు.
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జెండా కప్పితే అది జాతీయ జెండా అని అన్నారు. కడియం శ్రీహరి,దానం నాగేందర్ ఇద్దరిపై అనర్హత వేటు పడుతుందని అందరూ భావించారు. ఉప ఎన్నికలు వస్తే గెలవలేరని దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇచ్చారు. దానం నాగేందర్ అఫిడవిట్ ఫైల్ చేసి కాంగ్రెస్ బీఫామ్ పై పోటీ చేశారు. ఒక వ్యక్తి ఒకే సారి రెండు, మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా అనేది కేంద్ర ఎన్నికల సంఘం చెప్పాలి
ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీ బీఫామ్ పై లోక్ సభకు పోటీ చేస్తే పార్టీ మారలేదని ఎట్లా చెప్తారు? స్పీకర్ పదవికి కళంకం తెచ్చారు.
ప్రజలు వీళ్లకు బుద్ది చెప్పడం ఖాయం. ఎమర్జెన్సీ పెట్టినందుకు ఇందిరాగాంధీని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలు ఓడించారు. రాజ్యాంగం పట్టుకుని తిరగడానికి రాహుల్ గాంధీ ఆనర్హుడు. దీనిపై రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు?
స్పీకర్ తీర్పును కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకోవాలి. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కు లేఖ రాస్తాము. ఒక వ్యక్తి ఒకే స్థానం నుంచి మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా.? సమాజ్ వాదీ పార్టీ నుంచి గెలిచి బీఎస్పీలో చేరితే యూపీలో ఎమ్మెల్యేపై వేటు వేశారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో పిటీషన్ ఫైల్ చేయబోతున్నాము
ప్రెస్ మీట్ లో బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ ,పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి లలితా రెడ్డి పాల్గొన్నారు.