– నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు 1800 కోట్లు పంపుతారు
– సివేట్, సరళ, బృందా, బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు
– నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి
– 7 వర్కులు సివేట్ కు 3 వర్కులు, జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారు
– సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ కు,రిజర్వ్ బ్యాంకు కు ఫిర్యాదు చేస్తాము
– టెండర్లలో కుమ్మక్కు అయ్యారు
– టెండర్లలో అవినీతి జరిగింది
– టెండర్లు రద్దు చేయాలి
– బీ ఆర్ ఎస్ ఎల్పీ ఉపనాయకుడు టి హరీశ్ రావు, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: రాష్ట్రంలో హ్యాం రోడ్ల పేరిట 18 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. ఆర్ అండ్ బీ 12 వేల కోట్లు, పంచాయతీ రాజ్ శాఖ 6000 కోట్లు పది శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు పెట్టారు. 1800 కోట్లు నేరుగా వస్తాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికలకు ఆ మొత్తాన్ని పంపుతారు.
జలయజ్ఞం కాదు ధనయజ్ఞం జేబులు దండుకుంటున్నారని నాడు తెలుగుదేశం, రేవంత్ రెడ్డి అంతటా చెప్పారు. చాలా పనుల బిల్లులు ఇవ్వడం లేదు. రోడ్లకు గుంతలు పడినా మరమ్మత్తులు చేయడం లేదు. కమిషన్ల కోసం హ్యాం రోడ్ల పేరిట వేల కోట్లు దండుకునేందుకు ప్లాన్ చేశారు.
దేశం మొత్తం జాతీయ రహదారులు సాధారణంగా 20 నుంచి 30 శాతం వరకు టెండర్లు తక్కువ ధరకు వెళ్తాయి. కానీ, ఇప్పుడు 15 నుంచి 20 శాతం అధిక ధరకు వెళ్తున్నాయి.తేడా 50 శాతం వస్తోంది. సీఓటీకి వెళ్లకుండా నేరుగా శాఖాపరమైన కమిటీ ఆమోదించేలా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొబిలైజేషన్ అడ్వాన్సుల విధానాన్ని రద్దు చేసింది.
నాడు జలయజ్ఞంలో 3 శాతం మొబిలైజేషన్ అడ్వాన్సులు ఉంటే, . ఇప్పుడు పది శాతం పెట్టారు. మొత్తం 34 లో ఇప్పటి వరకు తెరిచిన 24 టెండర్ల సాంకేతిక బిడ్లు చూస్తే, దాదాపు 16 టెండర్లలో ఇద్దరు మాత్రమే వేశారు. ముందే రింగ్ అయ్యారు కుమ్మక్కై ముందే మాట్లాడుకొని అధికంగా టెండర్ వేసేలా చేశారు.
పంచాయతీరాజ్ లోని 12 పనులను కూడా ఇప్పటికే మాట్లాడి పంపకాలు చేశారు. ఇప్పటివరకు టెండర్ ధరలో ఐదు శాతం మాత్రమే ఎక్కువకు వెళ్లేలా సీలింగ్ ఉండేది, ఇప్పుడు హ్యాం రోడ్లకు ఎత్తివేయడంతో ఎంత ఎక్కువకు అయినా వేసుకోవచ్చు. హ్యాం రోడ్ల టెండర్లలో పెద్ద కుంభకోణం జరిగింది.
నల్గొండలో రెండు కంపెనీలు మాత్రమే టెండర్లు వేశాయి. నల్గొండ జిల్లా టెండర్లు మూడు బృందా కంపెనీకి, ఒకటి వేరే కంపెనీకి ఇచ్చారు. రాష్ట్రం మొత్తం 34 టెండర్లలో 24 టెండర్లలో 16 టెండర్లు ఇద్దరు మాత్రమే వేశారు.టెండర్లలో కుమ్మక్కు అయ్యారు. సివేట్, సరళ, బృందా,
బి.వి.ఎస్.ఆర్ కంపెనీలు కుమ్మక్కు అయ్యాయి.
పంచాయతీ రాజ్ శాఖలో 7 వర్కులు సివేట్ కు 3 వర్కులు, జె ఇన్ఫ్రా కంపెనీకి, చెరో ఒక టెండర్ సివేట్,బృందాకు ఇచ్చారు. రాష్ట్రంలో టెండర్ యక్సెస్ కు 5 శాతం సీలింగ్ ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత యక్సెస్ ఎత్తివేశారు. టెండర్లలో అవినీతి జరిగింది. టెండర్లు రద్దు చేయాలి దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపించాలి
దీనిపై సెంట్రల్ విజిలెన్స్ కమీషన్ కు,రిజర్వ్ బ్యాంకు కు ఫిర్యాదు చేస్తాము. అన్ని విచారణ సంస్ధలకు ఫిర్యాదు చేస్తాము
టెండర్లలో పాలు పంచుకున్న అధికారులు, కాంట్రాక్టర్లపై మా ప్రభుత్వం రాగానే చర్యలు తీసుకుంటాము. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే టెండర్లు రద్దు చేయాలి. పారదర్శంగా నిర్వహించాలి. సీఓటీ అనుమతి, ఐదు శాతం సీలింగ్ తప్పనిసరి చేయాలి, మొబిలైజేషన్ అడ్వాన్సులు రద్దు చేయాలి. సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తిచే విచారణ చేయాలి.
పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ పద్దులు చర్చకు వచ్చినపుడు బీఆర్ఎస్ తరపున మరిన్ని ఆధారాలు బయటపెడతాం, హైకోర్టు విచారణకు పట్టుబడతాం. సింగరేణి శ్రీరాంపూర్ టెండర్ వ్యవహారాన్ని మేము బయటపెట్టిన తర్వాత లెస్ కు పోయింది