– ఓటుకు నోటు దొంగ ఈ రోజు పతివ్రత పోజు కొడుతున్నారు
– మేము సోనియాను మెచ్చుకున్న రోజు ఇదే రేవంత్ బలిదేవత అన్నాడు
– సోనియా తెలంగాణ ఇచ్చిందని నువ్వనుకుంటే తెలంగాణ రాష్ట్రం లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశావ్ ?
– రాహుల్ ఖాళీ చేసిన వయనాడ్ సీటును ప్రియాంక కు ఎందుకు ఇచ్చారు ?
– వేరే వాళ్ళు దొరక లేదా?
– సోనియా ,రాహుల్ ,ప్రియాంక ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ?
– నిరుద్యోగులు ఏమైనా ఫర్వా లేదా ?
– దమ్ముంటే టీ డి ఆర్ లు ,హిల్ట్ పాలసి ల మీద కూడా విచారణ వెయ్
– రేవంత్ రెడ్డి ని మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా ?
– ఎల్ అండ్ టీ ని బ్లాక్ మెయిల్ చేసింది రేవంత్ రెడ్డే
– రైతు కిచ్చిన హామీలు నెరవేర్చని వాడు రైతు ను రాజు చేస్తాడా?
– రేవంత్ కు మించిన ఔరంగ జేబు బుద్ది ఇంకెవరికైనా ఉంటుందా ?
– ఢిల్లీ ఏ ఐ సదస్సు ను కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది ?
– రేవంత్ మాట్లాడుతుండగానే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు నిరసన తెలిపారు?
– రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ మంత్రి, బి ఆర్ ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఆగ్రహం
హైదరాబాద్: కుక్క తోక వంకర అనే సామెత ను తన వక్ర బుద్దితో ఈ బూతుల సీఎం మరో సారి చాటుకున్నారు. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపే తప్ప తెలుపు కాదు అన్నట్టు తన బుద్ది మారదని రేవంత్ రెడ్డి మరో సారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారు. మా కాంగ్రెస్ తాతలు నేతులు తాగిండ్రు మా మూతుల వాసన చూడమని అన్నట్టు ఉంది ఒరిజినల్ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి.
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపమంటే రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపినట్టు ఉంది రేవంత్ రెడ్డి తీరు. గవర్నర్ ప్రసంగం ఓ విజన్ డాక్యుమెంట్ లా ఉందని సీఎం చెబుతున్నారు. అందులో ఏం విజన్ ఉందో భూతద్దం వెతికినా కనిపించలేదు. ఢిల్లీ ఏ ఐ సదస్సు గురించి గొప్పగా చెప్పారు .ఆ సదస్సును కాంగ్రెస్ ఎందుకు వ్యతిరేకించింది ? రేవంత్ మాట్లాడుతుండగానే యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు నిరసన తెలిపారు?
గవర్నర్ ప్రసంగం చర్చలో మీ పాలసిలను ప్రధాన ప్రతిపక్షంగా తప్పుబడితే అది రాజకీయం ఎట్లా అవుతుంది. మేము అధికారం లో ఉండగా కాంగ్రెస్ గవర్నర్ ప్రసంగం చర్చలో ఏ రాజకీయ చర్చలు చేయలేదా ? కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఇచ్చిన గ్యారంటీలు డిక్లరేషన్ల గురించి నిలదీస్తే జీర్ణించుకోలేక మారీచుడు సుబాహుడు అనే అరిగి పోయిన గ్రామ్ ఫోన్ రికార్డు లా మెట్ట వేదాంతం వల్లె వేశాడు.
ప్రజలకు గ్యారంటీల పేరు చెప్పి మాయ చేసి ఓట్లు దండుకున్న రేవంత్ రెడ్డి ని మించిన మారీచుడు ఇంకెవరైనా ఉంటారా ? పేదల పాలిట దయ్యంగా మారిన హైడ్రా ను దేవత గా చూపించే ప్రయత్నం చేశారు.
హైడ్రా రూల్స్ సీఎం కు నచ్చిన వారికి ఒకలా లేనోళ్లకు ఇంకోలా అనేది ప్రజలందరికీ తెలుసు. ఇకపై మేము కూడా సీఎం ద్వంద్వ ప్రమాణాల పై అసెంబ్లీ లో వీడియో లు చూపిస్తాం .స్పీకర్ అనుమతించాలి. మురుగు నీరును శుద్ధి చేసేందుకు ఎస్టీపీ లను నాలాల పై కాకుండా ఎక్కడ కడుతారు? సీఎం కు ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదు. మెట్రో విస్తరణ కు అడ్డుపడింది ..ఎల్ అండ్ టీ ని బ్లాక్ మెయిల్ చేసింది .రేవంత్ రెడ్డే .ఉల్టా చోర్ కొత్వాల్ ఢాంటే అన్నట్టు ఉంది ఆయన తీరు. రాయదుర్గం నుంచి శంషాబాద్ కు మేము రూపొందించిన మెట్రో ప్రాజెక్టు ను ఎందుకు రద్దు చేశారు ?
తొక్కుకుంటూ సీఎం పదవి కి వచ్చా అని రేవంత్ రెడ్డే స్వయంగా ఎన్నో సార్లు చెప్పారు రేవంత్ కు మించిన ఔరంగ జేబు బుద్ది ఇంకెవరికైనా ఉంటుందా ? కేంద్రం చెబితే మెట్రో స్వాధీనం చేసుకున్నానని చెబుతున్న రేవంత్, ఇన్ని సార్లు ఢిల్లీ కి పోయి మెట్రో విస్తరణ ఎందుకు సాధించలేక పోయారు? ఓ ఆర్ ఆర్ ను ప్రైవేటు సంస్థ కు అప్పగించడం మీద అవగాహన లేని మాటలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ,బీజేపీ పాలిత రాష్ట్రాలు రహదారులను ప్రైవేటు అప్పగించిన విషయం ఈ అజ్ఞాని కి తెలియనట్టుంది.
వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కానోడు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు.నీ మనసు ప్యూర్ గా లేనప్పుడు క్యూర్ ,ప్యూర్ ,రేర్ అని ఎంత మాట్లాడినా ఏం లాభం రేవంత్? చిత్తశుద్ధి లేని శివ పూజ నీది రేవంత్. నర్మెట్ట లో ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ కేసీఆర్ ఘనత అయితే తానేదో పొడిచినట్టు రేవంత్ బిల్డప్ ఇచ్చుకుంటున్నారు.
సన్న బియ్యం అనేది కేసీఆర్ ఆలోచన . మొదట హాస్టళ్లలో అమలు చేశారు. మేము కూడా ఇస్తామని మేనిఫెస్టో లో పెట్టాం. కుటుంబం లో ఎంత మంది ఉన్నా ప్రతి ఒకరికీ ఆరు కిలోలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. రైతు కిచ్చిన హామీలు నెరవేర్చని వాడు రైతు ను రాజు చేస్తాడా? హామీలను ఎగ్గొట్టి ఈ రోజు అసెంబ్లీ లో రైతులకు ఏదో చేశామని అబద్దాలు మాట్లాడుతున్నాడు. రైతు ద్రోహి రేవంత్.
వైట్ కాలర్ ,బ్లూ కాలర్ ఉద్యోగాలు కల్పించడం కాదు. వైట్ కాలర్ ,బ్లూ కాలర్ నేరాలకు పాల్పడటం నీ నైజం. మేము సోనియా ను మెచ్చుకున్న రోజు ఇదే రేవంత్ బలిదేవత అన్నాడు. సోనియా తెలంగాణ ఇచ్చిందని నువ్వనుకుంటే తెలంగాణ రాష్ట్రం లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎందుకు పోటీ చేశావ్? వరి ఎంతైనా పండించొచ్చు కొంటాం అని చెప్పి, ఈ రోజు పంట మార్పిడి పేరుతో ధాన్యం కొనుగోళ్ల ను ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీ ఆర్ ఎస్ చింపిన విస్తరి కాదు .తెలంగాణ కు శ్రీరామ రక్ష.
సోషల్ మీడియా లో లైకులు షేర్ లకు సీఎంఓ నుంచి డబ్బులిచ్చి ఫేక్ అకౌంట్లు నడుపుతున్న నీవా బీ ఆర్ ఎస్ సోషల్ మీడియా ను విమర్శించేది? మెస్సీ మ్యాచ్ తో రాష్ట్రానికి ఒరిగిందేమి లేదు. నీ సొంత ప్రచార ఆర్భాటానికి తప్ప ఎందుకు పనికి రాలేదు. హైదరాబాద్ లో నిరంతరాయంగా కరెంటు ఉండటం కేసీఆర్ ఘనత తప్ప నీ ఘనత ఎక్కడ ఉంది రేవంత్? తెలంగాణ ఉద్యమం లో యువత బలి దానాలకు నీ లాంటి తెలంగాణ ద్రోహి తీరే కారణం రేవంత్. రాహుల్ గాంధీ ఖాళీ చేసిన వయనాడ్ సీటును ప్రియాంక కు ఎందుకు ఇచ్చారు ?వేరే వాళ్ళు దొరక లేదా?
సోనియా గాంధీ ,రాహుల్ గాంధీ ,ప్రియాంక గాంధీ ..ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు ?నిరుద్యోగులు ఏమైనా ఫర్వా లేదా ? ఏడాది లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎనభై వేల ఉద్యోగాలు ఇచామని బొంకుతున్నారు. అసెంబ్లీ లో ప్రకటించిన జాబ్ కేలండర్ కు దిక్కు లేదు. కోచింగ్ సెంటర్ల లో నెలల తరబడి వ్యయ ప్రయాసలకోరుస్తున్న నిరుద్యోగులకు భరోసా ఇవ్వాల్సింది పోయి కాకమ్మ కథలు చెబుతున్నారు.ముందుంది నిరుద్యోగుల చేతిలో నీకు మొసళ్ల పండగ.
అప్పుల పై రకరకాల మాటలతో ప్రజలను గందరగోళ పరుస్తున్నారు. BRS ప్రభుత్వం చేసిన 4.17 కోట్లు మాత్రమే. కేంద్రం తెలంగాణ అప్పుల పై పార్లమెంటు లో ఎన్ని సార్లు నిజాలు చెప్పినా సీఎం ఆవే కట్టు కథలు చెబుతున్నారు. రెండేళ్లలోనే 3 లక్షల 47 వేల కోట్ల పైనే అప్పులు తెచ్చామని సీఎం స్వయంగా చెప్పారు. ఈ లెక్కన ఐదేళ్లలో 8 లక్షల అప్పులు దాటుతాయి. అప్పుల పై మాట్లాడే నైతిక హక్కు ఉందా ?
ఆర్టీసీ కి అపాయింటెడ్ డే ఇవ్వడం చేత కాని వాడు ఆడ రాక మద్దెల ఓడు అనే రీతిలో మాట్లాడుతున్నాడు. దేశంలోనే తెలంగాణ రైతులకు ఎక్కువ అప్పులు ఉన్నాయని ఒప్పుకున్నారు. పాత చింత కాయ పచ్చడిలా పాడిందే పాడరా అన్నట్టు, పనికి రాని విషయాలు తప్ప ప్రజలకు పనికి వచ్చే విషయం ఒక్కటి ఈ అబద్దాల కోరు నుంచి రాలేదు. ఓటుకు నోటు దొంగ ఈ రోజు పతివ్రత పోజు కొడుతున్నారు
మతి తప్పి అసహనం తో అసెంబ్లీ ని అనాగరిక భాషతో భ్రష్టు పట్టించిన ఈ సీఎం కు తెలంగాణ ప్రజలే తగిన బుద్ది చెబుతారు. ఇలాంటి చిచోరా సీఎం ను ఏం చేసినా తప్పు లేదు. అసెంబ్లీ నిబంధనలకు వ్యతిరేకంగా కేసీఆర్ ,కే టీ ఆర్ వీడియోలు రేవంత్ రెడ్డి చూపించారు. రేవంత్ రెడ్డి అపుడేమి మాట్లాడారో, ఇపుడేమి చేస్తున్నారో రుజువు చేయడానికి మా దగ్గర కూడా వీడియో లు ఉన్నాయి .వాటిని చూపడానికి స్పీకర్ అనుమతిస్తారా ?
సీఎం కు ఓ రూలు .మాకో రూలా ? కాంగ్రెస్ , బీజేపీ పాలిత రాష్ట్రాలు రహదారులను ప్రైవేటు అప్పగించిన విషయం ఈ అజ్ఞాని కి తెలియనట్టుంది
వీధి దీపాలు కూడా సరిగా పెట్టడం చేత కానోడు విజన్ 2047 గురించి మాట్లాడుతున్నారు. విచారణలు చేయడానికి మేము లేఖలు రాయడం ఎందుకు ?దమ్ముంటే టీ డి ఆర్ లు ,హిల్ట్ పాలసి ల మీద కూడా వెయ్.ఆర్టీసీ కి అపాయింటెడ్ డే ఇవ్వడం చేత కాని వాడు ఆడ రాక మద్దెల ఓడు అనే రీతిలో మాట్లాడుతున్నాడు. దేశంలోనే తెలంగాణ రైతులకు ఎక్కువ అప్పులు ఉన్నాయని ఒప్పుకున్నారు.