యుద్ధం అంటే బాంబులు అనుకుంటున్నారా?
కాదు.
ఇది స్ట్రాటజీ అనే స్లో పాయిజన్.
అమెరికా బాంబర్లు ఆకాశంలో తిరుగుతున్నాయి.
“ఇరాన్ ఆకాశం మా కంట్రోల్లో ఉంది”అని ట్రంప్ అరుస్తున్నాడు.
కానీ…
కింద గ్రౌండ్ లో టెల్ అవీవ్ మీద మిసైళ్ళ వర్షం కురుస్తోంది.
అసలు లెక్క ఇక్కడ ఉంది.
ఐరన్ డోమ్ కొట్టే ఒక్క మిసైల్ ధర ₹50 కోట్లు.
ఇరాన్ పంపే డ్రోన్ ధర ₹20 లక్షలు మాత్రమే.
అమెరికా గాలిలో యుద్ధం చేస్తోంది.
ఇరాన్ గణితంతో యుద్ధం చేస్తోంది.
ట్రాప్ 1: పీక మీద కత్తి
దుబాయ్.
దోహా.
కువైట్.
వీళ్లందరి పీక మీద ఇరాన్ కత్తి పెట్టింది.
దుబాయ్‌లో బాంబు పడితే భయం ఒక్క నగరంలో ఆగదు.
ప్రపంచానికి వ్యాపిస్తుంది.
ఇన్వెస్టర్లు భయపడతారు.టూరిస్టులు పారిపోతారు.
వెంటనే గల్ఫ్ షేకులు ట్రంప్ కాలర్ పట్టుకుంటారు.
“మా ఆస్తులు పోతున్నాయి… యుద్ధం ఆపు!”
ట్రాప్ 2: హర్ముజ్ గొంతు
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బటన్…హర్ముజ్ జలసంధి.
ఇక్కడే ప్రపంచ ఆయిల్ శ్వాసిస్తుంది.
ఇరాన్ అక్కడ గొంతు నొక్కి పట్టుకుంది.
సౌదీ ఆయిల్ ఆగింది. ఖతర్ గ్యాస్ ఆగింది.రోజుకు వేల కోట్ల నష్టం.
200 షిప్పులు.. వేల మంది సైలర్లుసముద్రంలోనే ఇరుక్కున్నారు.
ప్రపంచ మార్కెట్లు గడగడలాడుతున్నాయి.
ట్రాప్ 3: డ్రోన్ గణితం
ఒక డ్రోన్ ధర ₹20 లక్షలు.
దాన్ని కూల్చే ఇంటర్‌సెప్టర్ ధర ₹40 కోట్లు.
ఇరాన్ వందల డ్రోన్లు పంపుతుంది.
అమెరికా మిత్రదేశాలు వేల కోట్లని గాలిలో తగలేస్తున్నాయి.
యుద్ధం ఇక్కడ బాంబుల పోటీ కాదు.బ్యాంక్ బ్యాలెన్స్ పోటీ.
ఇరాన్ మిసైళ్ళతో కొడుతోంది అనుకుంటున్నారు…
కాదు.
ప్రపంచ మార్కెట్ నాడిని నొక్కుతోంది.
ట్రాప్ 4: పర్వత ఉచ్చు
ఇరాన్ ఎడారి కాదు.అది పర్వతాల చక్రవ్యూహం.
లోపలికి వెళ్లడం సులువు.
బయటపడటం…అమెరికా తాతకి కూడా తెలియని ఆట.
జాగ్రోస్ పర్వతాలు. లోయలు. మండుతున్న ఎడారులు.
గ్రౌండ్ ఇన్వేషన్ అంటే ఆర్మీకి నరకద్వారం.
అందుకే ట్రంప్ మొదట గర్జించాడు.
“ఇరాన్‌లోకి దిగుతాం.”
ఇప్పుడు…
మౌనం.
ట్రాప్ 5: నీడల యుద్ధం
ఇజ్రాయిల్‌ను బిజీగా ఉంచడానికి హిజ్బుల్లాను రంగంలోకి దించారు.
లెబనాన్ ఫ్రంట్ తెరుచుకుంది.
ఇజ్రాయిల్ అక్కడ బిజీ.
ఇరాన్ meanwhile గల్ఫ్ దేశాల గొంతు నొక్కుతోంది.
యుద్ధం ఒకే దిశలో లేదు.
ఐదు దిశల్లో మండుతోంది.
చివరి నిజం
బలవంతుడు బలహీనుడిని జయిస్తాడు.
కానీ…
బలహీనుడు బుద్ధితో గెలుస్తాడు.
అమెరికా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. పొగరు ఉంది.
కానీ…
ఇరాన్ దగ్గర ఆట ఉంది.
అమెరికా యుద్ధం చేయడానికి వచ్చింది.
కానీ ఇప్పుడు బయటపడటానికి మార్గం వెతుకుతోంది.
తీర్పు
ట్రంప్ ది WWF మాస్.
ఇరాన్ ది చెస్ క్లాస్.
అగ్రరాజ్యం ఇప్పుడు యుద్ధం చేయడం లేదు.
ఇరాన్ వేసిన ఉక్కు ఉచ్చులో నెమ్మదిగా ఊపిరాడక తడబడుతోంది.
– కె.సర్వారాయుడు