దేశంలో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాలను 50% వరకు పెంచాలని ప్రతిపాదనలు వస్తున్న నేపథ్యంలో, మనం ఒక ముఖ్యమైన ప్రశ్నను మనమే మనకు అడగాలి. ఇది నిజంగా ప్రజల ప్రయోజనానికేనా ? లేక ప్రజా ధనంపై మరింత భారం పడబోతోందా ? వాస్తవ పరిస్థితి ఏమిటి? అందరూ ఆలోచించాల్సిన విషయం ఇప్పటికే దేశంలో ఉన్న ఎంపి, ఎమ్మెల్యేల కోసం ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి.
వారి జీతాలు,
అలవెన్సులు,
ఉచిత ప్రయాణాలు,
గన్మెన్లు,
కార్యాలయ సిబ్బంది,
నివాస సౌకర్యాలు,
ఇంకా పదవీ విరమణ
తర్వాత జీవితాంతం
పెన్షన్లు
ఇవన్నీ ప్రజల పన్ను డబ్బుతోనే సాగుతున్నాయి.
ఇప్పుడు ఈ సంఖ్యలను 50% పెంచితే:
▪️ ఖర్చులు కూడా అదే రీతిలో భారీగా పెరుగుతాయి..
▪️ పరిపాలనా వ్యవస్థ మరింత భారంగా మారుతుంది..
▪️ ప్రజలపై పరోక్షంగా పన్నుల భారం పెరిగే అవకాశముంది..
మరొక కోణం కూడా ఉంది. కొంతమంది అంటారు జనాభా పెరిగింది కాబట్టి ప్రతినిధుల సంఖ్య పెరగాలి అని. అవును, ఇది కొంతవరకు సత్యమే.
కానీ నా ప్రశ్న:
సంఖ్య పెంచడం వల్ల పరిపాలన నాణ్యత పెరుగుతుందా? లేక కేవలం ఖర్చులే పెరుగుతాయా?
ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది:
ఇప్పటి వరకు ఉన్న ప్రజా ప్రతినిధులు తమ బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నారా? అభివృద్ధి, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనలో మెరుగుదల వచ్చిందా? లేక ఇంకా వ్యవస్థలో లోపాలే ఎక్కువగా ఉన్నాయా?
సంఖ్య కంటే నాణ్యత ముఖ్యం
ప్రజలకు అవసరం:
మంచి నాయకులు
బాధ్యతాయుత
పాలన పారదర్శక వ్యవస్థ
కానీ కేవలం సీట్లు పెంచడం ద్వారా ఇవి వస్తాయనే గ్యారంటీ లేదు.
ముగింపు
ప్రజల డబ్బు విలువైనది. ప్రతి రూపాయి జాగ్రత్తగా వినియోగించాలి.
ప్రతినిధుల సంఖ్య పెంపు వంటి నిర్ణయాలు తీసుకునే ముందు….అది దేశానికి నిజంగా లాభమా?లేక భారం పెంచే చర్యనా ? అనే విషయాన్ని లోతుగా పరిశీలించాలి.
– రవీంద్ర తీగల
9849 55 1248.