– పద్మారావు నగర్ బీఆర్ఎస్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్
హైదరాబాద్: ముషీరాబాద్ చౌరస్తా లో ఉన్న శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఆధ్వర్యంలో జరిగే రాములవారి కల్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ పద్మారావు నగర్ ఇంచార్జి గుర్రం పవన్ కుమార్ గౌడ్ వెల్లడించారు. బుధవారం ఆలయం వద్ద జరుగుతున్న ఏర్పాట్ల ను బీఆర్ఎస్ పార్టీ నాయకులు, దాతలతో కలిసి సమీక్షించారు.
భక్తులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు గత మూడు సంవత్సరాలు గా స్వామి వారి కళ్యాణం ఆలయం అరుబయట నిర్వహించడం జరుగుతున్న మాదిరిగానే, MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచన మేరకు, ఈ సంవత్సరం కూడా మరింత ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు పవన్ కుమార్ గౌడ్ వివరించారు.
పలువురు దాతలు సహాయం తో కల్యాణ వేదిక, పెళ్లి మండపం, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని పవన్ కుమార్ గౌడ్ తెలిపారు…. భక్తులు కళ్యాణన్ని విక్షిచందుకు LED స్క్రీన్ లు ఏర్పాట్లు చేస్తున్నట్లు, భక్తుల సౌకర్యం కోసం వాటర్ వర్క్స్ అధికారులు 5వేల వాటర్ ప్యాకెట్లను అందజెస్తున్నారని వివరించారు.
కల్యాణానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ ను మరలించడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని అన్ని శాఖల అధికారులకు పవన్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.. కార్యక్రమం లో డివిజన్ అధ్యక్షులు రాజు, ఏసురి మహేష్, ఆలయ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, శివ ముదిరాజ్, ముక్క శ్రీనివాస్, మహేందర్ గౌడ్, గోవింద్, వెంకట్ శ్రీనివాస్ యాదవ్ ఆలయ అర్చకులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.