భారత్ తాత్కాలికంగా యుద్ధాన్ని ఆపింది అని చెప్పదు. ఎందుకంటే చెప్పాల్సింది భారత్ కాదు కాబట్టి!
ఈ వ్యాసం చివరి వరకు చదవండి…
మార్చి 21, 2026 రాత్రి 11:07 గంటలకు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రధాని నరేంద్ర మోదీ కి ఫోన్ చేశారు. ఇది సాధారణ కాల్ కాదు. ఇరాన్ న్యూక్లియర్ సౌకర్యాలపై అమెరికా దాడి చేసిన తర్వాత వెంటనే జరిగిన ఈ సంభాషణలో BRICS దేశాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవాలని, అమెరికా-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం వెంటనే ఆగాలని మోదీజీ స్పష్టంగా చెప్పారు.
ఇరాన్ అధ్యక్షుడు ఈ కాల్ ద్వారా భారత్‌ను తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయాలి – ఇరాన్‌తో మనకు చమురు, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. అమెరికా దాడులు మన ఎనర్జీ ధరలను ప్రభావితం చేస్తాయి. ప్రధాని మోదీ గారు ఈ కాల్‌ను స్వీకరించడం ద్వారా భారత్ తన స్వతంత్ర విదేశీ విధానాన్ని మరోసారి నిరూపించింది.
ఇది ఒకప్పటి భారత్ కాదు. మేము అవతలి పార్టీతో మాట్లాడి మీతో చర్చిస్తాము అని చెప్పే రోజులు పోయాయి. భారత్ ఎవరితో ఎలాంటి చర్చలు, ఏ సందర్భంలో చేయాలో మేము స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటాం అనే విషయాన్ని అంతర్జాతీయ సమాజం గమనిస్తోంది.
ఇందుకు మరో రుజువు.. మార్చి 23న లోక్‌సభలో ప్రధాని మోదీ చేసిన ప్రకటన. మధ్యాహ్నం 2:20 గంటలకు ఆయన “పశ్చిమాసియా నాయకులతో రెండుసార్లు మాట్లాడాను” అని సభలో చెప్పారు. ఇది కేవలం ఒక వాక్యం కాదు. ఇది భారత్ ఎంత త్వరగా, ఎంత జాగ్రత్తగా ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటోందో చూపిస్తుంది.
అదే రోజు మధ్యాహ్నం 4:53 గంటలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. “ఇరాన్‌తో యుద్ధం ముగించడానికి చర్చలు జరుపుతున్నాం కాబట్టి ఎనర్జీ దాడులు వాయిదా వేస్తున్నాం” అని ఆయన అన్నారు. ఇది అమెరికా కూడా యుద్ధం నుంచి వెనక్కి తగ్గుతున్నట్లు సంకేతం. కానీ ఇంకా పూర్తి శాంతి కాదు. ఇలాంటి సమయంలో భారత్ ఏమి చేస్తోంది? దీనికి సమాధానం మార్చి 23 సాయంత్రం 6:53 గంటలకు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ చేసిన దౌత్య కార్యకలాపాల్లో ఉంది.
జైశంకర్ ఒకేసారి ఆరు GCC దేశాల రాయబారులతో – సౌదీ అరేబియా, యూఏఈ, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, కువైట్ – మాట్లాడారు. అంతేకాదు, శ్రీలంక, జర్మనీ రాయబారులతో కూడా చర్చించారు. ఇది ఒక సాధారణ సమావేశం కాదు. పశ్చిమాసియా భద్రతా పరిస్థితిని భారత్ ఎంత శ్రద్ధగా గమనిస్తోందో ఇది రుజువు చేస్తుంది. జైశంకర్ అమెరికా జాతీయ సలహాదారు మార్క్ రుబియోతో కూడా వెస్ట్ ఏషియా సంక్షోభం గురించి చర్చించారు.
ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్‌ను దాదాపు మూసేస్తున్నందువల్ల మనకు చమురు సరఫరా సమస్య ఎదురవుతోందని, దాన్ని ఎలా పరిష్కరించాలో ఆలోచించండి అని చెప్పినట్లు సమాచారం. కాబట్టి జైశంకర్ గారి ఈ ఫ్లర్రీ ఆఫ్ డిప్లమసీ మన ఎనర్జీ భద్రతను కాపాడుకోవడానికి మాత్రమే జరగలేదు, ఇది ప్రపంచ ఆర్ధిక భద్రత మరియు రక్షణ కోసం జరుగుతోంది.
ఇక ఈ సంక్షోభంలో భారత్‌కు మరో బలమైన మద్దతు రష్యా నుంచి వచ్చింది. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఢిల్లీ విదేశీ విధానాన్ని బహిరంగంగా ప్రశంసించారు. “భారత్ తన జాతీయ ఆసక్తులను ముందుగా ఉంచుతూ స్వతంత్ర విదేశీ విధానం అనుసరిస్తోంది. ఇది లోతైన గౌరవానికి అర్హం” అని లావ్రోవ్ గారు అన్నారు. ఇవి కేవలం మాటలు కాదు. లావ్రోవ్ ప్రధాని మోదీ త్వరలో మాస్కోకి వెళ్తారని కూడా ధృవీకరించారు.
ప్రపంచం మల్టీపోలార్ దిశగా మారుతున్న ఈ సమయంలో భారత్ ఒక ముఖ్యమైన రాజకీయ, ఆర్థిక శక్తిగా ఎదుగుతోందని రష్యా చెప్పింది. భారత్ స్ట్రాటజిక్ ఆటానమీ అంటే స్వతంత్ర నిర్ణయాలు కేవలం విధానం కాదు, అది ఒక బలం అని లావ్రోవ్ పేర్కొన్నారు. రష్యా-భారత్ భాగస్వామ్యం నమ్మకం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంది. ఇది ఇప్పుడు ప్రపంచ సహకారానికి ఒక మోడల్‌గా మారుతోంది.
ఈ అన్ని సంఘటనలను కలిపి చూస్తే ఒక స్పష్టమైన లక్ష్యం కనిపిస్తుంది. యుద్ధాలు, దాడులు, డిప్లమసీ – ఇవన్నీ మధ్యలో భారత్ తన స్థానాన్ని ఎలా కాపాడుకుంటోంది? మన దేశం ఎవరివైపు వాలకుండా, అందరితో సమాన దూరం పాటిస్తూ తన ఆసక్తులను రక్షించుకుంటోంది. ఇరాన్‌తో మాట్లాడటం ద్వారా శాంతి సందేశం ఇవ్వడం, అమెరికా, GCC దేశాలతో చర్చలు జరపడం ద్వారా ఎనర్జీ సరఫరాను సురక్షితం చేయడం, రష్యాతో సంబంధాలు బలోపేతం చేయడం – ఇది ఒక సమగ్ర వ్యూహం. మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండాలంటే పశ్చిమాసియా శాంతి అవసరం. చమురు ధరలు పెరగకుండా ఉండాలంటే ఈ దౌత్యం కొనసాగాలి.
ఇంకా లోతుగా ఆలోచిస్తే, ఈ సంక్షోభం భారత్‌కు ఒక అవకాశం కూడా. BRICSలో స్వతంత్ర పాత్ర పోషించాలని ఇరాన్ చెప్పడం ద్వారా మనం ఆ గ్రూప్‌ను మరింత బలపరచవచ్చు. అమెరికా దాడులు వాయిదా పడటం మంచి సంకేతం కానీ, పూర్తి శాంతి కోసం మనం మధ్యవర్తిగా పని చేయాల్సి ఉంటుంది.
జైశంకర్ ఆరు GCC రాయబారులతో సమావేశం ద్వారా గల్ఫ్ దేశాలతో మన సంబంధాలు మరింత బలపడ్డాయి. ఇవి మనకు ఇన్వెస్ట్మెంట్లు, టెక్నాలజీ, చమురును తక్కువ ధరకు ఇస్తాయి. రష్యా ప్రశంసలు మన స్ట్రాటజిక్ ఆటానమీని ప్రపంచం గుర్తించినట్లుగా చూడాలి. మోదీ మాస్కో విజిట్ త్వరలో జరగడం ద్వారా రక్షణ, ఎనర్జీ, ట్రేడ్ ఒప్పందాలు మరింత ముందుకు వస్తాయి.
ఈ ఘటనలన్నీ ఒకే వారంలో జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మార్చి 21 నుంచి 23 వరకు ఒక రోజు వ్యవధిలో ఇన్ని కాల్స్, ప్రకటనలు, సమావేశాలు జరగడం భారత్ దౌత్య యంత్రాంగం ఎంత వేగంగా, ఎంత సమర్థంగా పని చేస్తోందో చూపిస్తుంది. మనలాంటివాళ్లు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే – యుద్ధాలు దూరంగా ఉన్నట్లు అనిపించినా, అవి మన జీవితాలను ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో ప్రధాని మోదీ గారి నాయకత్వం, జైశంకర్ దౌత్యం మన దేశాన్ని సురక్షితంగా నడిపిస్తున్నాయి. రష్యా లాంటి దేశాలు మన స్వతంత్రతను ప్రశంసించడం మన గర్వకారణం.
ఇక ముందు ఏమవుతుంది? ట్రంప్ చర్చలు ఎంతవరకు వెళ్తాయి, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఎప్పుడు తెరుచుకుంటుంది, మోదీ గారి మాస్కో విజిట్‌లో ఏ ఒప్పందాలు వస్తాయి – ఇవన్నీ మన భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కానీ ఒక విషయం ఖాయం. భారత్ ఇకపై ఎవరి ఒత్తిడికీ లొంగదు.
తన జాతీయ ఆసక్తులను, ఎనర్జీ భద్రతను, ఆర్థిక వికాసాన్ని కాపాడుకుంటూ స్వతంత్రంగా నడుస్తుంది. ఇది కేవలం ఒక వార్త కాదు, ఇది మన దేశం ఎదుగుతున్న బలానికి నిదర్శనం. సామాన్య ప్రజలు ఈ దౌత్య విజయాలను అర్థం చేసుకుని, మన దేశం గురించి గర్వపడాలి. ఈ సంక్షోభం మనకు ఒక పాఠం కూడా – శాంతి, సమతుల్యత, స్వతంత్ర నిర్ణయాలే ఏ దేశానికైనా బలం.
మార్చి 23న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ “ఇరాన్‌తో యుద్ధం ముగించడానికి చర్చలు జరుపుతున్నాం కాబట్టి కొన్ని దాడులు వాయిదా వేస్తున్నాం” అని స్పష్టంగా చెప్పారు. ఇదే రోజు ప్రధాని మోదీ గారు లోక్‌సభలో “పశ్చిమాసియా నాయకులతో రెండుసార్లు మాట్లాడాను” అని చెప్పడం, విదేశీ మంత్రి జైశంకర్ అమెరికా, GCC దేశాలు, శ్రీలంక, జర్మనీతో చర్చలు జరపడం – ఇవన్నీ ఒకే రోజు జరగడం వల్ల ప్రపంచ ఒత్తిడి పెరిగి ఉండవచ్చు అని అనిపిస్తుంది.
రష్యా విదేశాంగ మంత్రి లావ్రోవ్ భారత్ స్వతంత్ర విదేశీ విధానాన్ని ప్రశంసించి, మోదీ మాస్కో విజిట్ త్వరలో జరుగుతుందని చెప్పడం కూడా ఈ దౌత్యానికి బలం ఇచ్చింది. అంటే భారత్ చేసిన చర్చలు యుద్ధం ఆపడానికి ప్రధాన కారణంగా చూడకపోయినా, ప్రపంచంలో శాంతి కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు ఖచ్చితంగా ఒక భాగం కావచ్చు. భారత్ ఎవరి వైపు వాలకుండా అందరితో మాట్లాడి ఎనర్జీ భద్రత కాపాడుకుంటోంది. ఇది యుద్ధం తాత్కాలికంగా ఆగడానికి సహాయపడి ఉండవచ్చు.
అమెరికా మీడియా (బ్లూమ్‌బర్గ్, సిఎన్ఎన్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఆక్సియోస్ వంటి పత్రికలు) స్పష్టంగా చెప్పినట్లు – టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్ ఇరాన్, అమెరికా నాయకులతో మాట్లాడారు. ఒమన్ విదేశాంగ మంత్రి బద్ర్ అల్ బుసైది స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ తెరవడం కోసం రెండు వైపులా సందేశాలు పంపారు. ఇంకా సౌదీ, ఈజిప్ట్, భారత్ వంటి దేశాలు కూడా ఈ బ్యాక్‌ఛానెల్ ద్వారా సహాయం చేశాయి. ఈ దేశాలు యుద్ధం మరింత పెరగకుండా ఆపాలని, చమురు సరఫరా సాఫీగా ఉండాలని గత రెండు వారాలుగా గొప్పగా పని చేశాయి.
ఇవన్నీ కలిసి ట్రంప్ కి ఒత్తిడి తెచ్చి, ఆయన “చర్చలు జరుగుతున్నాయి” అని చెప్పి దాడులు ఆపేశారని వార్తలు చెప్తున్నాయి. అయితే, టర్కి, ఒమన్ దేశాలు చెబితే వినే పరిస్థితిలో ట్రంప్ ఉన్నాడా? పిచ్చోడి చేతిలో రాయిలా, ఎప్పడు ఏమి మాట్లాడుతాడో తెలియని ట్రంప్ ఈ రెండు దేశాల మాట విన్నాడంటే సందేహమే. పానకంలో పుడకలాగా పాకిస్తాన్ మధ్యలో దూరి.. మా దేశం నుండే చర్చలకు నాంది పలికింది అని చెప్పటం అతి పెద్ద హాస్యం అన్నట్లు.
ఇది భారత విజయం అని భారత్ ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే భారత్ ఇది నేనే చేశాను అనే డిప్లొమసీ నడపట్లేదు. గుర్తింపు కోసం పాకులాడే దేశం కాదు అని ఇప్పటికే చాలాసార్లు రుజువు చేసింది. కానీ, మా అవసరం ఉంది అనగానే ఏమాత్రం సంకోచించకుండా సహాయం చేస్తుంది.
అయితే, అంతర్జాతీయ సమాజానికి మాత్రం ఇది స్పష్టంగా తెలుసు. ఎందుకంటే ఖతార్, అమెరికా మరియు సౌదీ దేశాలకు చెందిన నేతలు, రక్షణ రంగ నిపుణులు నేరుగా మీడియా ముందు భారత్ మాత్రమే యుద్ధం ఆపగలదు అని పలు సందర్భాల్లో పేర్కొన్నారు అనే వార్తను ఇప్పటికే షేర్ చేసాను. ఈ విషయంపై కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఏదో ఒక పాడ్ కాస్ట్ లో ఒక నేత భారతే వలనే అనే ఈ విషయం బయటపెడతాడు.
భారత్ మాతాకి జై
– పతంజలి వడ్లమూడి