– రాబోయే రోజుల్లో కృతిమ మేధ కంపెనీకి డబ్బిచ్చి ప్రమోట్ చేసుకొంటేనే బిజినెస్
( వాసిరెడ్డి అమర్నాధ్)
కరోనా రెండో వేవ్ కాలం నాటి కథ !
“ఆక్సిజన్ సిలిండర్ ల కొరత” అనే వార్తను సృష్టించారు !
ముంబై ఢిల్లీ లాంటి నగరాల్లో డబ్బున్న మారాజులు టోకు మొత్తంలో మాట్లాడుకొని మూడు నాలుగు నెలలకు హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకొని, పక్కన ఒక ఆక్సిజన్ సిలిండర్ రిజర్వ్ లో పెట్టుకొని పడుకొన్నారు .
దీనితో నిజంగానే ఆక్సిజన్ సీలిండెర్స్ కొరత వచ్చింది .ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ 90 కి తగ్గినవారికి ఆక్సిజన్ అందక పోయారు .
ముందు జాగ్రత్త చర్యగా హాస్పిటల్ బెడ్స్ బుక్ చేసుకొని చేరిన వారిలో చాలా మంది భయానికి పోయారు .
అదీ జనాల పానిక్ ఫలితం .
రెండు రోజులుగా హైదరాబాద్ లో పెట్రోల్ బ్యాంకు ల ముందు పొడవాటి క్యూ లు .
ట్యాంక్ ఫుల్ చేస్తే జీవితాంతం శాశ్వతంగా నడుపు కొనే వీలుందా ?
కొంతమంది అయితే డబ్బాల్లో పట్టుకొని పోతున్నారు . పెట్రోల్ /డీజిల్ బాంబు లాంటిది .
ఇంట్లో పెట్టుకొంటే కాలి బూడిదై పోతాము అన్న ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలా ?
చర్చలు మొదలయ్యాయి .. పెద్దగా పురోగతి లేక పోయినా ఏదో ఒకటి తేలుస్తారు . పెట్రోల్ కొనకుండా మనం బతకలేము . అమ్మ కుండా గల్ఫ్ దేశాలు బతక లేవు .
కాకపోతే అక్కడ జరిగిన నష్టానికి పైసా కు పైసా మన దగ్గర నుండి రాబడుతారు .
పెట్రోల్ ధరలు పెరిగే టప్పటికి ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్స్ కు డిమాండ్ పెరుగుతుంది .
మెంటల్ మహానుభావుడు ట్రంప్ ను గిచ్చి పెట్టింది .. ఇజ్రాయెల్ ఒక్కటే కాదని నా డౌట్ అనుమానం . ఎంతో కొంత మేర ఎలక్ట్రిక్ వెహికల్స్ లాబీ ఉంది .
లాక్ డౌనా ? పిండా కూడా ?
కరోనా కలం లో రెండు సార్లు వచ్చింది .
మీడియా / సొషల్ మీడియా మాత్రం యాభై సార్లు పెట్టేసింది .
ఇక జన్మ లో లాక్ డౌన్ రాదు .
కాకపోతే పెట్రోల్ కు రేషన్ పెడుతారు . ఒక వాహనానికి .. నెలకు ఇంత అని .. అలాగే వంట గ్యాస్ కు కూడా ఒక ఇంటికి ఇంత అని .
అంతం కాదిది .. ఆరంభం !
ప్రపంచ వ్యాపితంగా కొన్నేళ్లకు డిజిటల్ డిక్టేటర్షిప్ వస్తుంది .
ఇప్పటికే డిజిటల్ ప్రెమెంట్స్ వచ్చేసాయి .
గూగుల్ కారణంగా నువ్వు ఎక్కడికి పోయినా అన్నీ ట్రేస్ అవుట్ చెయ్యొచ్చు .
కొన్నేళ్లకు కృత్రిమ మేధ… నీ దినచర్యను ఇలా లిస్ట్ అవుట్ చేస్తుంది .
పొద్దునే అయిదింటికి నిద్ర లేచాడు . ఏడింటికి ఆఫీస్ కు బయలుదేరాడు . మొత్తం 20 కిలోమీటర్స్ . ఇదిగో ఈ రూట్ లో .. 40 నిముషాలు . మధ్యాహ్నం లంచ్ ఇక్కడ్నుంచి ఫుడ్ ఆర్డర్ .. ఇలా
అంతేనా ?
ఎంత కొనాలి ? ఏమి కొనాలి ? ఇలా వచ్చేస్తాయి ..
డిజిటల్ id లేకుండా ఏమీ కొనలేరు .. తిన లేరు .
నీ బతుకు మొత్తం ప్రభుత్వం చేతిలో .. కృతిమ మేధ చేతిలో ..
జనాలు ఇప్పటికే ఆలోచించడం మాని … ప్రతి దాన్ని కృతిమ మేధను అడుగుతున్నారు .
ప్రస్తుతానికి అయితే ఉచితం .
హైదరాబాద్ లో మంచి స్కూల్స్ ఏవి ? అని గూగుల్ ని అడిగితే అది లిస్ట్ అవుట్ చేస్తుంది .
ఎలా ?
దానికి డబ్బిచ్చి ప్రమోట్ చేసుకొనే వారి పేర్లు మాత్రం చూపుతుంది .
ఇది ఇప్పటికే వుంది .
ఇక రాబోయే రోజుల్లో కృతిమ మేధ కంపెనీకి డబ్బిచ్చి ప్రమోట్ చేసుకొంటేనే బిజినెస్ .
లేకపోతే అవుట్.
ప్రతి బిజినెస్ లో వాడు పార్టనర్ అయిపోతాడు .. పైసా పెట్టుబడి లేకుండా ..
మన బతుకు మన చేతుల్లో ఉండదు .
ఎవడో ఎక్కడో కూర్చుని జనాల దిన చర్యను ప్రోగ్రాం చేస్తాడు .
హొప్స్పిటల్స్ రంగంలో పెట్టుబడి పెట్టిన ఒక విదేశీ ఈక్విటీ కంపెనీ రాబొయ్యే సంవత్సరం .. భారతదేశంలో .. కాన్సర్ .. బిపి .. షుగర్ .. ఇంత వేగంగా పెరగాలి అని ప్రోగ్రాం చేస్తుంది.
జనాలు ఎలా ఆలోచించాలి ?
ఏమి ఆలోచించాలి ?
ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ?
ఏ సినిమా హిట్ కావాలి ?
ఎవరికి ఓటు వెయ్యాలి ?
ఇలా మొత్తం .. ఎక్కడో దూరాన డిసైడ్ అయిపోతుంది.
మైండ్ మానేజ్మెంట్ అన్న మాట .
ఆడించేవాడెవ్వడో .. నువ్వు మాత్రం నిమిత్తమాతృడివి .
కృతిమ మేధ యుగంలో సహజ మేధ కనుమరుగవుతుంది .
ఈ పోస్ట్ రాసింది AI ..
అంటే అమర్నాథ్ ఇంటలిజెన్స్ .
{ అంత వీజీ కాదు .. ఇంకో సారి చదవండి .. ఫుల్ క్లారిటీ కావాలంటే }