ఉక్కు సంకల్పం ఉన్న ఆ నాయకుడి ట్రాక్ రికార్డ్: ప్రపంచ స్థాయి దిగ్గజం ఆర్సెలర్ మిట్టల్‌ను తీసుకువచ్చి ఉత్తరాంధ్ర తలరాతను మారుస్తున్నారు.
రాయలసీమ (ఓర్వకల్లు)లో జైరాజ్ ఇస్పాత్ స్టీల్ ప్లాంట్‌కు 2018లో శంకుస్థాపన చేసి, మొన్న అక్టోబర్ 2024లో దానిని సాకారం చేశారు.
రాష్ట్రం మొత్తం ఆశ వదిలేసి, గుదిబండ అయిందనుకున్న ఆంధ్రుల హక్కు – విశాఖ ఉక్కును నిలబెట్టడం కోసం అర్ధరాత్రి దాటాక, తెల్లవారుజామున 2.30 గంటలకు కేంద్ర మంత్రి కుమారస్వామిని వెంటబెట్టుకుని ఆర్థిక శాఖ మంత్రి వద్దకు వెళ్లి, విన్నవించి, రాష్ట్రం తరపున కూడా సాయం అందించి, ప్లాంట్‌ను నిలబెట్టి తిరిగి లాభాల బాట పట్టించారు:
ఆ మూడే కాదు.. విభజన హామీగా కాంగ్రెస్ చెప్పిన కడప స్టీల్ ప్లాంట్ కుదరదని కేంద్రం చేతులెత్తేసినా, రాయలసీమ స్టీల్ ప్లాంట్ కోసం 2018లోనే శంకుస్థాపన చేశారు.
అదే కడపలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అని వైఎస్ రాజశేఖరరెడ్డి అంతకు ముందే శంకుస్థాపన చేశారు. అయితే, ఆ భూములు తనకిచ్చింది ఇందుకేనన్నట్లుగా గాలి జనార్దన్ రెడ్డి వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టేశాడు.
చంద్రబాబు నిర్ణయించిన స్థలాన్ని మార్చి, పేరు మార్చి జగన్ రెండు సార్లు శంకుస్థాపన చేసి, సర్కస్ లెక్కన వినోదం పంచాడు.
కానీ మన ఉక్కు మనిషి చంద్రబాబు నాయుడు అదే కడపలో నాలుగో స్టీల్ ప్లాంట్ కోసం ఇదే వారం APIIC ద్వారా జిందాల్ స్టీల్ ప్లాంట్ కోసం 1100 ఎకరాల బదలాయింపు చేసి, ₹55 కోట్లు కట్టి సేల్ డీడ్ పూర్తి చేశారు. ఏప్రిల్ 2029 కల్లా మొదటి దశ ప్లాంట్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
సొంత గడపలో చేతగాని వాడై, పులివెందులలో కూడా డిపాజిట్ కోల్పోయి, ‘మావిగన్’ అంటూ తన ఫ్యాక్షన్ గన్ కల్చర్ పేరుతో మూడు జిల్లాలకు ఏదో పొడుస్తానని జగన్ నవ్వులపాలయ్యాడు.
కానీ గడపలోని అసమర్థ తండ్రీకొడుకుల ఆశలను తీరుస్తారు ఈ ఉక్కు మనిషి! అది కూడా మా ఘనతే అని సిగ్గులేకుండా రేపు జగన్ చెప్పుకున్నా.. రాజనీతి తప్పని నాయుడు నాలుగో ఉక్కు ప్లాంట్‌ను సాధ్యం చేసి చూపిస్తారు.
-చాకిరేవు