– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
– ఈ నెల 14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్వీ బృందాల పర్యటన
– మూసీ తీర ప్రాంతాల్లో పర్యటించనున్న 50 బృందాలు
– ప్రజలను కలిసి అన్ని అంశాలు వివరించనున్న బీఆర్ఎస్వీ బృందాలు
– తెలంగాణ భవన్ లో జెండా ఊపి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాటను ప్రారంభించిన మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
హైదరాబాద్: ప్రభుత్వం మూసీ సుందరీకరణ చేస్తే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఆ పేరిట విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదు. మూసీ తీరాన ప్రజలు భయాందోళనల్లో ఉన్నారు. అధికారం ఉంది కదా అని హాస్టల్ ప్రభుత్వం ఇష్టారీతిన వ్యవహరిస్తామంటే కుదరదు. బీఆర్ఎస్వీ బృందాలు ప్రజల్లోకి వెళ్లి వాస్తవ పరిస్థితులు, ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను వివరిస్తాయి. అందరితో కలిసి పోరాటం ఉధృతం చేస్తాం. ప్రభుత్వం దిగివచ్చే వరకు మా పోరాటం కొనసాగుతుంది. అవసరమైతే లక్షలాది మందితో ప్రభుత్వ చర్యలను అడ్డుకుంటాం.