– హైదరాబాద్ లో దొంగలు, మరొక్కరు దోమలు సంతోషంగా ఉన్నారు
– ఎన్నికల్లో కత్తి వాడికి ఇచ్చి పోరాటం మనము చేయాలి ఎలా
– బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్: పిర్జాదిగూడ నాయకులకు అభినందనలు. మన ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర యేండ్ల కాలం అయింది. ఎన్నికల్లో అడ్డగోలుగా అనేక హామీలు ఇచ్చారు. పెద్ద పెద్ద మాటలు చెప్పి అడ్డం పొడుగు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. మీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రజలు కాంగ్రెస్ మాటలు నమ్మలేదు. ఒక్క సీటు కూడా వాళ్ళకు ఇవ్వలేదు
గ్రామాల్లో అమాయక ప్రజలు నమ్మి మోసపోయారు. అత్తకు 4000 కోడలుకు 2500ఇస్తాం అన్నారు ఆషాఢం సేల్ లెక్క అడ్డగోలు హామీలు ఇచ్చుకుంటూ పోయారు. అయ్యా ముఖ్యమంత్రి గారు.. మీరు ఇస్తామన్న స్కూటీ లు ఎక్కడ ,మీరు ఇస్తామన్న మహిళలకు 2500ఎక్కడ అని అడిగితే.. ఎంత కండలు తిరిగిన మొగోడు అయిన మూడు నెలల్లో పిల్లలు పుట్టించరు కదా అంటాడు ముఖ్యమంత్రి. అయ్యా ముఖ్యమంత్రి మూడు నెలలు కాలేదు….30నెలలు అయింది .మరి ముప్పై నెలలు అయినా పుట్టకపోతే ఏం అంటారు.
ఆడ పిల్ల పుడితే 13వేలు ,మగ పిలగాడు పుడితే 12వేలు ఇచ్చి తల్లి బిడ్డను ఇంటిదగ్గర దించి వచ్చేలా అనాడు మన కేసీఆర్ సంక్షేమ పథకాలు అందించారు. ఇవాళ ముఖ్యమంత్రి వచ్చి రెండున్నర యేండ్లు అయింది. అనేక కార్యక్రమాలు రద్దయ్యాయి. హైదరాబాద్ లో ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే ఇద్దరే ఇద్దరు సంతోషంగా ఉన్నారు. ఒక్కరు దొంగలు, మరొక్కరు దోమలు. హైదరాబాద్ లో ఎక్కడపడితే అక్కడ భూములు కబ్జా లు చేస్తున్నారు.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మరోపక్క ముఖ్యమంత్రి.
నేను అసెంబ్లీ లో చెప్పాను దోమలబాదు ,దోమలగూడ అని పెట్టమని అడిగిన. కేసీఆర్ ను బద్నాం చేసి అప్పులు పాలు చేసి తప్పించుకునే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. తప్పించుకునే పరిస్థితి లేదు,వాళ్ళను కచ్చితంగా నిలదీయాలి. ఉప్పల్ ఫ్లై ఓవర్ భూమి పుట్టినప్పటి నుండి నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రాజెక్ట్. 8 ఏండ్లు అయింది ఎక్కడ పని అక్కడే. మేము కడతాం అంటే లేదు లేదు మేమే కడతాం అన్నారు.
మరో కొత్త కుట్ర జరుగుతుంది. లోక్ సభ,శాసన సభ సీట్లు పెంపు పై కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఒక్కటి చేసేది ఒక్కటి.ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోనే ఉన్నది. అయిన దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.మేము స్థానికంగా ఉన్న మార్కెట్ కమిటీలలో 50శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. శాసన సభ లో కూడా తీర్మానం చేశారు. ఇవాళ దక్షిణాది రాష్ట్రాలకు డి లిమిటేషన్ లో అన్యాయం జరిగితే కేసీఆర్ అధ్యర్యంలో పోరాటం చేస్తాం.కేసీఆర్ స్వయంగా నాయకత్వం వహిస్తారు.
మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మూడుకు మూడు క్లిన్ స్వీప్ చేశారు. మళ్ళీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లో మనమే గెలుస్తాం. ఇక్కడ సెప్టెంబర్ లోనో అక్టోబరు లో ఎన్నికలు అంటున్నారు. వాళ్లను గెలిపిస్తే ఇక్కడకు మళ్ళీ బుల్డోజర్ వస్తుంది. అందుకే బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో కత్తి వాడికి ఇచ్చి పోరాటం మనము చేయాలి ఎలా? అందుకే ఈసారి ఎన్నికల్లో మాకు ఓటు వేయండి మీకు మేము అండగా ఉంటామని చెప్పండి.