– మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి తుమ్మల
– మార్కెట్ యార్డ్ లలో గత రెండు సంవత్సరాలలో చేపట్టిన పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి తుమ్మల
– గడ్డిఅన్నారం మార్కెట్ లో చేపట్టిన ‘IT’ Interference పై మంత్రికి వివరించిన అధికారులు
– కోహెడ మార్కెట్ పనులకు సంబంధించిన డిజైన్ల రూపకల్పన, టెండర్లను నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకొని ముందుకు వెళ్లాలన్న మంత్రి తుమ్మల
– ప్రయోగాత్మకంగా చేపట్టిన రూప్ టాప్ సొలర్ల నిర్మాణ ప్రగతి పై ఆరాతీసిన మంత్రి తుమ్మల
– ధాన్యం కొనుగోళ్లను సంబంధించి అవసరమైనన్ని టార్పలిన్ లు, తేమ కొలమాని, ఆరబెట్టే యంత్రాలు సిద్ధం చేయాలని ఆదేశించిన మంత్రి తుమ్మల
హైదరాబాద్: మార్కెటింగ్, మార్క్ ఫెడ్ అధికారులతో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు సచివాలయంలో సమగ్ర సమీక్ష నిర్వహించారు. మార్కెటింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నీ వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మార్కెట్ రుసుము వసూళ్లను పారదర్శకంగా మరియు సమర్దవంతంగా చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా రూ 568.50 కోట్లు గత రెండు సంవత్సరాలలో, మార్కెటింగ్ యార్డ్ లలో 630 అభివృద్ధి పనులు ప్రభుత్వం మంజూరు చేసిందని, వీటిలో 128 కోట్లు విలువైన 113 పనులు పూర్తయినట్లు తెలిపారు.
ఈ సందర్భములో మంత్రి మాట్లాడుతూ, ఇంకా కొన్ని చోట్ల జీరో బిజినెస్ జరుగుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వస్తుందని, దీని పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. జీరో బిజినెస్ చేసే ట్రేడర్ల లైసెన్స్లు రద్దు చేయడానికి ఉపేక్షించవద్దని, అదేవిధంగా దీనికి ఎవరైనా అధికారులు సహకరిస్తే క్రమశిక్ష చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.
అభివృద్ధి పనులను వేగవంతంగా చేయాలని, వాటి పురోగతిని రోజు వారి సమీక్షించేటందుకు వీలుగా ఒక డాష్ బోర్డు ను ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశించారు. మార్కెట్ యార్డ్ లకు వచ్చే రైతులకు సౌకర్యం కల్పించే పనులను ప్రాధాన్యత పాతిపదికన చేపట్టాలని అదేవిధంగా, పంట ఉత్పత్తులు రక్షించే విధంగా చేపట్టే పనులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా సూచించారు. మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో ఇంజనీరింగ్ విభాగములో అవసరమైతే మరికొంత మందిని వేరే శాఖల నుండి డిప్యూటేషన్ పై తీసుకొనే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా సెక్రటరీగారిని మంత్రి కోరారు.
గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీలో ‘స్మార్ట్ మార్కెట్ యార్డ్ ‘ సాఫ్ట్ వేర్ ల ద్వారా మార్కెట్ కార్యదర్శులు పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు మంత్రికి తెలిపారు. మంత్రి స్పందిస్తూ ఒక సీజన్ లో అమలు చేసిన తరువాత, ఆశాజనక ఫలితాలు ఉంటే, అన్నీ మార్కెట్ యార్డ్ కమిటీలను “ డిజిటలైజేషన్ చేసి జీరో బిజినెస్ ను ఆరికట్టే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. మార్కెట్ కమిటీల అభివృద్ది, నిర్వహణకు అవసరమైన బడ్జెట్ ల ప్రభుత్వం సమయానికి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కోహెడ పండ్ల మార్కెట్ ను సంబంధించి ఎంపిక చేసిన ప్రదేశంలో సర్వే పూర్తయిందని, పనులను చేపట్టడానికి టెండర్ల ప్రక్రియ త్వరలో చేపట్టనున్నట్లు తెలిపారు.
మార్కెట్ కమిటీ అభివృద్ధి పనులైనా కోహెడ మార్కెట్ పనులైనా, ప్రతీది నిర్ధిష్ట కాలపరిమితి పెట్టుకొని దాని ప్రకారం రోజువారీ, ప్రగతి సమీక్షించుకొంటూ ముందుకు వెళ్తే తప్ప పనులు మనం అనుకొన్న సమయంలో పూర్తికావని కాబట్టి అధికారులు అందరూ ప్రతీ పనికి, ప్రారంభతేది, గడువు తేది నిర్ధారించుకొని ముందుకు వెళ్ళాలని నిర్దేశించారు.
HACA ద్వారా 5 సంవత్సరాల సమగ్ర నిర్వహణలో వ్యవసాయ మార్కెట్ కమిటీల అంతటా విద్యుత్ బిల్లుల తగ్గించడానికి గ్రిడ్ ను అను సందిస్తూ సోలార్ రూప టాప్ ప్యానెల్ ల ద్వారా విద్యుత్పత్తి అవకాశాలను పరిశీలించాలని కోరారు. ఇప్పటికే ఈ దిశలో ప్రయోగాత్మకంగా 4 మార్కెట్ యార్డ్ లలో చేపట్టిన పనుల పురోగతి పై ఆరాతీశారు. దీనికి అధికారులు సమాధానమిస్తూ టెండర్ల ప్రక్రియ పూర్తయిందని జులై చివరి కల్ల సోలార్ ప్యానెళ్ళు నిర్మించి విద్యుత్ ఉత్పాదన చేసే విధంగా చర్యలు తీసుకొన్నట్లు పేర్కొన్నారు.
పంటల కొనుగోళ్లు
గత ఖరీఫ్ లో చేపట్టిన ప్రత్తి కొనుగోళ్లు పూర్తయిందని ప్రస్తుతం మార్కెట్ లలో మిర్చి అధికమొత్తంలో వస్తుందని, రైతులకు మంచి ధర దక్కేటందుకు అన్నీ చర్యలు తీసుకొంటున్నట్లు మార్కెటింగ్ డైరెక్టర్ తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లకు కూడా ప్రభుత్వం ఆరంభించనున్నందున కొనుగోళ్లకు అవసరమైన సామగ్రి అన్నీ కొనుగోళ్ళ కేంద్రాలలో అందుబాటులో ఉంచాలని, ముఖ్యంగా టర్పాలిన్ లు, తేమ శాతం కొలిచే పరికరాలు, క్లీనింగ్ డ్రైయర్లు అవసరమైనన్ని సిద్ధంగా ఉంచాలని కోరారు. మొక్కజొన్న కొనుగోళ్లకు సంబంధించి మార్కఫెడ్ అధికారులు కొనుగోళ్ళ కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం పటిష్ట చర్యలు తీసుకోవాలని, కొనుగోళ్ళ కేంద్రాలకు తీసుకువచ్చే రైతుల ఉత్పత్తులను పరిరక్షించే విధంగా ముందుగా మార్కెట్ యార్డ్ లలో కొనుగోలు సెంటర్ల ఏర్పాటు చేయాలని, అదే విధంగా రైతుల వద్ద నుండే సేకరించే మొక్కజొన్నకు సంబంధించిన మొత్తాన్ని రైతుల ఖాతాలకు విడుదల చేసేటందుకు, గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో నిధులు సమకూరుస్తామని మంత్రి తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో కార్యదర్శి సురేంద్ర మోహన్ తో పాటు మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్కఫెడ్ మానేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.