తమిళ్ష్నాడు అసెంబ్లీ ఎన్నికల పోరు తీవ్రమైంది; ప్రచారం ఉద్ధృతం అయింది. ఎన్.డీ.ఎ. ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు వివృతమూ, విస్తృతమూ అవుతున్నాయి. అమిత్ షా చేసిన పెను ప్రయత్నాలు ఫలించి డీ.ఎమ్.కె. ప్రభుత్వ పతనం, ఎన్.డీ.ఎ. గెలుపు సాధ్యమయ్యే స్థితి ఏర్పడినట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్.డీ.ఎ. కి 130-140 స్థానాలు రావచ్చు అని ఊహిస్తున్నారు.
తమిళ్ష్నాడులో ఇక ఎన్.డీ.ఏ. ప్రభుత్వం ఏర్పడడం ఒక చారిత్రిక అవసరం. మరోసారీ డీ.ఎమ్.కె. వస్తే అధికారం, పాలన పరోక్షంగా క్రైస్తవ మాఫియా చేతుల్లోకి వెళ్లిపోతుంది. ఎన్.డీ.ఎ.కు స్పష్టమైన మెజారిటీ రాకపోతే డీ.ఎమ్.కె.తో విజయ్ కలిసిపోయి ఒక పరోక్ష మిషనరీ ప్రభుత్వం ఏర్పడుతుంది తమిళ్ష్నాడులో.
తమిళ్ష్నాడులో హిందువులకు భద్రత, జీవనం సరిగ్గా ఉండాలంటే, క్రైస్తవ మాఫియా పాలన తప్పిపోవాలంటే బీ.జే.పీ., ఎ.ఐ.ఎ. డీ. ఎమ్.కె. కలిసి పనిచెయ్యాలి. ఆ పనిలో భాగంగా అణ్ణామలై నుండి పార్టీ అధ్యక్ష పదవి నయనార్ నాగేంద్రన్ కు వెళ్లింది. అణ్ణామలై పనిచెయ్యకుంటే తమిళ్ష్నాడు బీ.జే.పీ. తీవ్రంగా బలహీనమౌతుంది అని, మరొకటని గత ఏడాది అణ్ణామలై నుండి బీ.జే.పీ. అధ్యక్ష పదవి నాగేంద్రన్ కు వెళ్లినప్పుడు పలు మాటలు, పలు వాదనలు వినిపించాయి.
5/4/2025న నేను అణ్ణామలై కేంద్రంగానే, అణ్ణామలై ప్రచారం ప్రాముఖ్యతతోనే తమిళ్ష్నాడు బీ.జే.పీ. ఎన్నికల వ్యూహం ఉండబోతోందని ‘మహానాడు’లో రాశాను. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతోంది. (నేను రాసిన వ్యాసం లింక్: https://www.facebook.com/share/p/1CSxdGhnEM/ ) నిన్నటి నుంచీ అణ్ణామలై ప్రధానంగా తమిళ్ష్నాడు ఎన్.డీ.ఎ. ప్రచారం ఉద్ధృతం అయింది. సత్పరిణామం ఇది.
డబ్బు… డబ్బు… డబ్బు… డీ.ఎమ్. కె. ప్రధాన ఆయుధం డబ్బు. ఎన్నికల్లో గెలిచేందుకు డీ.ఎమ్.కె.కు ప్రధాన ఆయుధం డబ్బు. ఓటరుకు డీ.ఎమ్.కె. ఆశచూపిస్తున్న డబ్బు భయాన్ని కలిగిస్తోంది అని పరిశీలకులు ఆందోళన చెందుతున్నారు. డీ.ఎమ్.కె. మరో ఆయుధం మీడియా. తమిళ్ష్నాడులో డీ.ఎమ్.కె. మీడిఅ విస్తృతమైన అపాయకరమైన ప్రభావాన్ని చూపించగలదు! తమిళ్ష్నాడులో డీ.ఎమ్.కె. మీడియా ఉన్నట్టు ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి సొంత మీడిఅ లేదు.
తమిళ్ష్నాడు ఓటర్ల చేతుల్లో ఆ రాష్ట్ర భవిష్యత్ ఉంది. మత మిషనరీలకు బలైపోవడమా? తెప్పరిల్లడమా? జవాబు హిందూ ఓటర్ల చేతిలోనే ఉంది. హిందూ ఓటరు జవాబుదారీతనంతో ఓటు వేయాలి. తమిళ్ష్నాడు ఎన్నికల విషయంలోనూ, పథక రచనలోనూ అమిత్ షా చాల ప్రభావవంతంగా, సరిగ్గా, గొప్పగా పనిచేశారు. గట్టిగా తొమ్మిది రోజులు ఉన్నాయి. సరైన ప్రణాళికతో అణ్ణామలై తీవ్రమైన క్రీయాశీలకమయ్యారు. ఇదీ సరైన వ్యూహమే.
తమిళ్ష్నాడులో ఈ ఎన్నికల్లో ఎన్.డీ.ఎ. గెలవకపోతే రాష్ట్రం, రాష్ట్రంలోని హిందువులు కోలుకోలేని దెబ్బతింటారు. హిందువులు ఏకీకృతమై రాష్ట్రాన్ని దక్కించుకోవడం తప్పనిసరి.
– రోచిష్మాన్
9444012279