– పూర్వ ఉద్యోగ సంఘాల జాక్ చైర్మన్ దేవీప్రసాద్
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాను, ఆరు నెలల్లో పీఆర్సీ అమలు చేస్తామని హామీ ఇచ్చి ముప్పై నెలలు దాటినా ఎలాంటి స్పందన లేకపోవడం దుర్మార్గం.
అధికారంలోకి రావడానికి మేనిఫెస్టో లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఉద్యోగులు గత రెండు ఏండ్లుగా ప్రభుత్వానికి నివేదించినా ఫలితం కనిపించడం లేదని ఆవేదన తో ఉద్యోగులు రాష్ట్ర సచివాలయం నుండి గ్రామ సచివాలయం వరకు ఆందోళన కు దిగారు. దీనికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే. దేశంలోనే 5 డి ఏ లు బకాయి పడ్డ ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రమే.
రిటైర్ అయిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించక పోవడం వల్ల 86 మంది చనిపోయారు. వేలాది మంది నిత్యం కోర్టుల చుట్టూ, సచివాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయినా మానవత్వం లేకుండా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆందోళనలు తీవ్ర రూపం దాల్చి పరిపాలన స్తంభించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. వెంటనే ఉద్యోగ సంఘాల తో చర్చలు జరిపి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పీఆర్సీ ప్రకటించాలి. డి ఏ లు విడుదల చేయాలి. పెన్షనర్స్ బకాయిలు వెంటనే చెల్లించాలి. సీపీఎస్ రద్దు చేయాలి. ఉద్యోగుల ఆందోళనకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్న.