– అవున్నిజమే…. ఉత్తరాదిలో నియోజకవర్గాలు దక్షిణాది కంటే ఎక్కువ పెరుగుతున్నాయ్
– ప్రస్తుతం కూడా దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే లోకసభ సీట్లు ఎక్కువున్నాయ్ – మరప్పుడు ఈ సంఖ్యను నిర్ణయించినప్పుడు రాని అభ్యంతరం..ఆక్షేపణ.. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నది.!?
– అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబెడుతున్నదనా?
– రేవంత్ రెడ్డి, స్టాలిన్ వగైరాలు కొన్నిటికి సమాధానం చెప్పాలి
ఇప్పుడు దేశవ్యాప్తంగా జరిగే లోకసభ/అసెంబ్లీ “నియోజకవర్గాల పునర్విభజన”(Delimitation)తో ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల కంటే ఎంతో సీట్ల సంఖ్య పెరగి దక్షిణాది రాష్ట్రాలు ఎంతో నష్టపోతాయని పిచ్చ రచ్చ చేస్తున్న రేవంత్ రెడ్డి, స్టాలిన్ వగైరాలు కొన్నిటికి సమాధానాలు చెప్పాలి…
* నిజమే. ఉత్తరాది రాష్ట్రాల్లో దక్షిణాది రాష్ట్రాల కంటే జనాభా అధికం కనుక ఇక్కడి కంటే అక్కడ స్థానాలు ఎక్కువ పెరుగుతాయ్.. ఔను నిజమే…
అందులో సందేహం లేదు..అది నూటికి నూరు శాతం సత్యం…
అయితే ఇప్పుడే కాదు… స్వాతంత్ర్య భారతదేశం ఏర్పడింది మొదలు ఈ అంతరం వున్నదే. అదేదో ఇవ్వాళ్ల ఇది కొత్తగా పుట్టుకురాలేదు.. అలా ప్రస్తుతం కూడా దక్షిణాది కంటే ఉత్తరాదిలోనే లోకసభ సీట్లు ఎక్కువున్నాయ్ కదా.! మరప్పుడు ఈ సంఖ్యను నిర్ణయించినప్పుడు రాని అభ్యంతరం… ఆక్షేపణ.. ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నది…!?
ఓహో అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం వెలగబెడుతున్నదనా…!?
ఇకలాగే మరి అప్పట్లో, కాంగ్రెస్ పార్టీ జమానలో నియోజకవర్గాల “పునర్విభజన” జరిపినప్పుడు ఆఁ అంతరాన్ని ఎందుకు పూడ్చలేదు.!? ఎందుకా ప్రయత్నం చేయలేదో…!! అదేదో ఇప్పుడు కేంద్రంలో BJP ఆధ్వర్యంలో ప్రభుత్వం వున్నప్పుడే ఉత్తర & దక్షిణ అంతరం అనేది గుర్తొచ్చిందా..!? మరప్పుడు ఇదే ఈ ఇంగితం ఏమైంది..!? అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తేనేమో ఇదన్యాయమని చెప్పడానికి ఎవ్వడికీ నోరు పెగల్లేదు మరి…!!
కుల జనాభా నిష్పత్తిని బట్టి ఆఁ ఆఁ కులాలకు రిజర్వేషన్లు ఉండాలని లెక్కలు చెప్పే మేధావులు… అదే ఇప్పుడు మరదే జనాభాను బట్టి నియోజకవర్గాలు వుండకూడదు అని వాదించడం లోని తర్కం/Logic ఏంటో మరి..!? ఎందుకీ రెండు నాల్కల ధోరణి? ఎందుకీ ద్వందనీతి? రిజర్వేషన్ల దగ్గరికి వచ్చేసరికేమో జనాభా ప్రాతిపదిక కావాలి.. కానదే నియోజకవర్గాలకి దగ్గరికి వచ్చేసరికి మాత్రంఅదన్యాయం..
వాహ్… క్యా బాత్ హై…!! దీన్నే “చావుతెలివి” అంటారు…
ఇక్కడ ఇక ఇంకో అతి ముఖ్యమైన విషయం ఓసారి గుర్తుకు తెచ్చుకోవాలి. దక్షిణాది రాష్టాల్లో కంటే ఉత్తరాది రాష్ట్రాల్లోని వారే అత్యధికంగా సైన్యంలో చేరి, దేశాన్ని రక్షిస్తున్నారు. దానితోనే ఇక్కడ దక్షిణాది వాళ్ళం నిశ్చింతగా… నిర్భయంగా వుంటున్నాం. ఆఁ ఉత్తరాదివారి త్యాగాల మూలంగానే మన కళ్లకు కునుకు ఉంటున్నది.
అదే ఉత్తరాదిలో నలుగురు సంతానాన్ని కనే తల్లిదండ్రులు. అందులో ఒకర్ని దేశాన్ని రక్షించేందుకు సైన్యంలోకి పంపితే, మరొకర్ని తమ కులవృత్తుల్లోకి… మరొకరిని చదువుల్లోకి… మరొకర్ని కుటుంబాన్ని చూసుకోడానికి ఇలా ఒక్కొక్కర్ని ఒక బాధ్యత కోసం కంటున్నారు.
ఇకదే ఇక్కడ మనం కనేది ఒక్కరినే… ఆఁ వాణ్ని కూడా IIT చదువుకోసమో… అమెరికా పంపడానికో కంటాం… ఇక మరొక్కణ్ణి కంటే కూడా వాడిని పంపేది ఏ NEET కే… ఇక వాడు కూడా మనను వృద్దాప్యంలో చూసుకోడు… ఇక మరి దేశం గురించి వాడేం ఆలోచన చేస్తాడు…!?
ఇక దేశ రక్షణ కోసం ఒకణ్ణి కందాం అనే ఆలోచన… ఇంగితం… మన దక్షిణాది వాడికి అసలు వుందా…!! వుంటేనా…?? లేదు అస్సల్లేదు… అదేదో ఉత్తరాది వాళ్ళు సైన్యంలోకి పోవడానికి… దక్షిణాది వాళ్ళం IIT/అమెరికా కోసం అనే మురికికూపాల్లో మగ్గుతున్న సంకుచితపు ఆలోచనలు మనవి.
ఇలాంటి మనం ఉత్తరాది వాళ్లకు నియోజకవర్గాలు పెరుతుగుతున్నాయని రచ్చ చేయడంలో అర్థం లేదు. వాళ్ళకులా కనకుండా మనను ఆపుతున్నది ఎవరు…!? నువ్వూ కను… ఇక మరదే మరకగాళ్ళు ఇక్కడ దక్షిణాదిలో కూడా డజన్లకు డజన్లు కంటున్నారు కదా మరి..! మరి నువ్వెందుకు కనవ్… ఇన్ని నీతులు చెప్పే రేవంత్ రెడ్డి కన్నది ఒకే ఒక బిడ్డను… అదే అక్కడ బీహార్లో వీళ్ళ దోస్త్ లల్లూ ప్రసాద్ యాదవ్ డజన్ మందిని కన్నాడు.
– హేజీబు శ్రీనివాసరావు
న్యాయవాది
(సుప్రీంకోర్టు మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్)