– కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను అన్నపూర్ణ గా మార్చింది కేసీఆర్ కదా?
– కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదని రేవంత్ అంటాడు
– మంత్రి శ్రీధర్ బాబు ఏమో మూసి నది వరకు కాళేశ్వరం నీరు వస్తుంది అంటారు
– మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
– భూపాలపల్లి జయశంకర్ జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇతర బిఆర్ఎస్ నాయకులు బృందం.
భూపాలపల్లి జయశంకర్ జిల్లా : ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి మేడిగడ్డ ప్రాజెక్టు పర్యటన వెనుక ఉన్న ఆంతర్యం ఎంటో ప్రజలకు తెలపాలి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేక ఆరోపణలు చేసి, గద్దె ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సంవత్సరాల్లో లేని ప్రేమ ఇప్పుడు ఎందుకు వచ్చింది?. రేవంత్ రెడ్డికి కేసీఆర్ మీటింగ్ అంటే వెన్నులో వణుకు పడుతుంది.
గతంలో కూడా కేసీఆర్ నల్గొండ మీటింగ్ పెడితే బయంతో ఆ రోజు రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టిండు. ఇప్పుడు జగిత్యాల మీటింగ్ అంటే మేడిగడ్డ ప్రాజెక్ట్ మీద రివ్యూ అని మీటింగ్ పెట్టి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక మేడిగడ్డ కాదు అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంపు హౌస్ లు, 203 కిలోమీటర్ల టన్నెల్లు, 1531 కిలోమీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల ప్రేషర్ మైన్లు, 530 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేసే వ్యవస్థ. 141 టిఎంసిల స్టోరేజ్ కెపాసిటీ, 240 టిఎంసిల నీటి ఉపయోగమే కాళేశ్వరం.
ప్రాజెక్ట్ మీద కుట్ర చేసి కేసీఆర్ ని బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే ఇన్ని రోజులు కాలయాపన. మేడిగడ్డ నుండి నీటిని నిల్వ చేయకుండా కిందకు పంపింది కాంగ్రెస్ నాయకుల ఇసుక రవాణా గురించి అని స్పష్టంగా అర్థం అవుతుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో SRSP శ్రీరాం ప్రాజెక్ట్ కు మహారాష్ట్ర నుండి చుక్క నీరు రాకుండా మహారాష్ట్రలో అక్రమంగా 10 ప్రాజెక్టులు కడితే తెలంగాణ ఎడారిగా మారింది నిజం కాదా?
అదే కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను అన్నపూర్ణ గా మార్చింది కేసీఆర్ కదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికి రాదని రేవంత్ అంటాడు. ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు ఏమో మూసి నది వరకు కాళేశ్వరం నీరు వస్తుంది అంటారు. మేడిగడ్డలో ఒక్క పిల్లర్ కుంగతే రెండు రోజులు NDSA వచ్చి హడావుడి చేసింది. కుంగిపోయిన మేడిగడ్డ పిల్లర్ పనులు తామే స్వయంగా స్వంత ఖర్చులతో పూర్తి చేస్తాము అని యల్ & టీ కంపెనీ వారు ముందుకు వస్తే పట్టించుకోలేదు.
కేసీఆర్ జగిత్యాల సభను విజయవంతం కావోద్దు అనే దురుద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తాడు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే తెలంగాణ ఎగిరేది బిఆర్ఎస్ జండానే
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు తాటికొండ రాజయ్య, ప్రభుత్వ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఆరురి రమేష్, దాసరి మనోహర్, శంకర్ నాయక్, ఎంపి మాలోత్ కవిత, మాజీ జెడ్పి ఛైర్మన్లు గండ్ర జ్యోతి లక్ష్మి, జక్కు శ్రీ హర్షిణి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు