‘రాజధాని ఫైల్స్’ చిత్రంతో అమరావతి రైతుల త్యాగాన్ని, రాజధాని అవసరాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించి ప్రశంసలు అందుకున్న భాను దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మక చిత్రం రానుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు జీవితంలో ముఖ్య సంఘటనలే ప్రధానకథాంశంగా ఒక వినూత్న బయోపిక్ గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది.
సామాన్యుడిగా జీవితం ప్రారంభించి ప్రపంచం మెప్పుపొంది, దార్శనికుడిగా, లోకనాయకుడిగా చంద్రబాబు ఎదిగిన ప్రయాణం దేశంలోని ప్రతీ పౌరుడికీ ఆదర్శప్రాయమని… నిఘంటువులోని ప్రతి అక్షరానికీ ఒక అర్థం – ప్రతి పదానికీ ఒక భావం ఉన్నట్టే ఆయన జీవితంలోని ప్రతి అడుగూ ప్రజాక్షేమం కోసమేనని, ఆయన ప్రతీ ఆలోచన భావితరాల భవిష్యత్తు కోసమేనని ఇలాంటి విజనరీ నాయకుడు, అలుపెరగని పోరాటయోధుడు, నిత్యకృసీవలుడు చంద్రబాబు జీవితంలో జరిగిన ప్రతీఘట్టంలో ఒక ఉద్వేగం, ఒక సంఘర్షణ ఉందని ఆ ఉద్వేగాల సమాహారమే ఈ బయోపిక్ అని భాను చెపుతున్నారు, అందుకే దీనిని పాన్ వరల్డ్ చిత్రంగా అన్ని ప్రపంచభాషల్లోనూ రూపొందిస్తున్నారు. ఇది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రరాజంగా దీనిని చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు.
అత్యంత ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో, భారీ తారాగణంతో తెరకెక్కబోతున్న ఈ చిత్ర టైటిల్, నిర్మాణ సంస్థ వివరాలు, షూటింగ్ విశేషాలు మరియు ఇతర సమాచారం త్వరలోనే దర్శకుడు భాను మీడియాకు తెలియజేయనున్నారు.