ఈ దేశంలో ఏ పార్టీకి, ఏ సంస్థకు దేశం కోసం, జాతి కోసం, హిందుత్వం కోసం, అభివృద్ధి కోసం, సిద్ధాంతం కోసం జీవితాంతం పనిచేసే లక్షలాదిమంది కార్యకర్తల గణం కలిగిన పార్టీ బిజెపి నే ఇంక ఏ పార్టీ కూడా లేదు. దానికి అండదండగా ఉండేందుకు మాతృ సంస్థలు ఎలాగు ఉన్నాయి.
హిందుత్వమే ఈ ప్రపంచానికి దిక్సూచి అని నినదించిన రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద లాంటి ఎందరో మహామహులు జన్మించిన ప్రాంతం పశ్చిమ బెంగాల్.. ఈ భరతఖండమంత ఐకమత్యంగా ఉండాలని ఒక దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, ప్రత్యేక ప్రతిపథులు లాంటి చట్టాలు ఉండకూడదని.. అలాంటి వాటికి వ్యతిరేకంగా ఉద్యమించిన మహామహులు పుట్టిన రాష్ట్రం పశ్చిమబెంగాల్. (వారే డాక్టర్ శ్రీ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జన సంఘ్ పార్టీ స్థాపకులు)
ఆ కోవలోకే నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఖుదిరామ్ బోస్, రవీంద్రనాథ్ ఠాగూర్, బిధిన్ చంద్రరాయి, లాంటి ఉద్యమకారులు, జన్మించిన ప్రాంతం పశ్చిమబెంగాల్. స్వాతంత్రం కోసం యువతను ఉర్రూతలూగించిన వందేమాతరం గీతం రచయిత పశ్చిమబెంగాల్ నుండే.
దేశానికి ఇంత చారిత్రకత కలిగిన రాష్ట్రం ఈరోజు ఎటువంటి అభివృద్ధికి నోచుకోక.. కేవలం వ్యక్తి రాజకీయ స్వార్థం కోసం రాష్ట్రంలో అధికారాన్ని చెలాయిస్తూ పరాయి దేశానికి పాట పాడుతానంటే, నోరు మూసుకొని కూర్చోవడానికి ఈ దేశ ప్రజలు చేవచచ్చిన వారు కాదు.. దేశాన్ని పరిపాలించేది అకుంఠిత దీక్ష, ప్రజాస్వామ్య బద్ధం కలిగిన బలమైన నాయకత్వం.
గతంలో పశ్చిమ బెంగాల్ దేశంలోకెల్లా ఎక్కువ పరిశ్రమలు కలిగి పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రం కానీ పాలించిన కమ్యూనిస్టులు, టీఎంసీ పార్టీ పారిశ్రామికవేత్తలు భయపెట్టి 6886 పరిశ్రమలను తరిమి వేసిన చరిత్ర పై పార్టీలది.ఇప్పటివరకు పాలించిన పార్టీలు ప్రజలకు కేవలం ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారమే మహాభాగ్యంగా భావించమని అలవాటు చేసినారు.
కనుకనే వారు ఇప్పటివరకు ప్రభుత్వా నికి అండ,దండగా ఉంటున్నారు కావున వారికి ఇప్పటివరకు పరిపాలిస్తున్న టీఎంసీ పార్టీ కి వత్తాసు పలుకుతూ వస్తున్నారు. మమత బెనర్జీ మహిళా నాయకత్వం స్వార్థ చింతన లేనట్టుగా కట్టు, బొట్టు, నడక, ఆహ భావాలు, వ్యవహార శైలి,సాధారణ వాహనం,సాధారణ జీవితం గడిపేది మహిళా లోకానికి కొంతవరకు నచ్చింది. ఇప్పుడిప్పుడే వారికి బ్రమలు తోలుగుతున్నాయి.
ఆ రాష్ట్ర పరిస్థితిని గమనించిన బిజెపి పార్టీ ప్రస్తుతం టిఎంసి ఇస్తున్న అన్ని పథకాల కంటే మిన్నగా ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.( బిజెపి మేనిఫెస్టో క్రింద ఉన్నది దయచేసి చూసుకోండి) కానీ బిజెపి అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాన్ని ఏ విధంగా అన్ని రంగాలలో ఆర్థికంగా బలపడేందుకు ఏమి చేయాలో తెలుసు. ఏ రాష్ట్రమైనా పారిశ్రామికంగా ముందుకు పోకపోతే ఆ రాష్ట్రానికి ఎదుగుదల ఉండదు అనేది జగ మెరిగిన సత్యం.
అందరూ అనుకున్నట్లుగా పశ్చిమబెంగాల్లో ముస్లిమ్స్ రాష్ట్రమంతా ప్రభావితంగా లేరు 60 నియోజకవర్గాలలో మాత్రం వారిదే పై చేయి ఆ జిల్లాలు నాలుగు ఐదు ఉంటాయి. కానీ గణాంకాలు చూస్తే 2021 లో బీజేపీ ఓడిపోవడానికి ముస్లిం ఓట్లు మాత్రమే కారణం కాదు. చాలా నియోజకవర్గాలలో హిందువులే బిజెపిని ఓడించారు. మరి ముస్లింలు గుంప గుత్తుగా టీఎంసీ పార్టీకి వంత పాడుతున్నారని తెలిసినప్పటికీ కూడా హిందువులలో చైతన్యం లేక ఆమెకే సపోర్ట్ చేస్తూ గెలిపిస్తూ వచ్చారు.
అందరి నమ్మకం ఏమిటంటే హిందువులలో చైతన్య వచ్చింది దేశం మొత్తం ఎన్ డి ఏ పరిపాలన బాగుంది మన రాష్ట్రం కూడా అదే విధంగా చేసుకుందామని మెజారిటీ ప్రజలలో చైతన్యం వచ్చినట్టుగా అనిపిస్తుంది. (జిల్లాల వారీగా ముస్లిం ఓట్లు హిందువుల ఓట్లు పట్టిక తరువాత మీకు పంపే విశ్లేషనలో చూడండి)
దానికి నేను చూసిన ఉదాహరణలు కొన్ని నేషనల్ చానల్స్ వారు ప్రజల్లోకి వెళ్లి మైక్ పెట్టి మీరు ఎవరికి ఓటు వేస్తారు పరివర్తన జరగాలా అని అంటే 50% పైనే జరగాలని కోరుకుంటున్నారు.
టిఎంసి గుండాల భయం వల్ల 40%, 50% మంది ఎవరికి చెప్పకుండా మనం ఎందుకు బయటపడాలి చేసే పని చేస్తే సరిపోతుంది అనే అభిప్రాయంతో చెప్పకుండా పోతున్న సంఘటనలు చానల్స్ లో మనకు కనబడుతున్నాయి.మరి ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా బిజెపికి గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని అనిపిస్తుంది.
– కరణం భాస్కర్
(రాష్ట్ర బిజెపి సీనియర్ నాయకులు)
7386128877