– ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే అంతా వృథా
– స్కూల్స్ ముందు చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు
– నేరగాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది
– ఎంత పెద్ద కుటుంబమైనా, రాజకీయ నాయకుడైనా, ఉన్నతాధికారుల కుటుంబమైనా నేను కేర్ చేయను
– ఐసీసీసీ లో స్పందన టీమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
– హాజరైన మంత్రి సీతక్క, ఎంపీ లు వేం నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, డీజీపీ శివధర్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, పోలీస్ ఉన్నతాధికారులు
– స్పందన పోస్టర్ ను విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్: అభివృద్ధి చెందిన దేశాల్లో మహిళలు, పిల్లలకు భద్రత ,రక్షణ కల్పించడం ప్రభుత్వాలు బాధ్యతగా భావిస్తాయి. ఏ దేశాల్లో పిల్లలు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నారో అక్కడ అభివృద్ధి వేగంగా జరుగుతుంది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే మహిళలకు ఓటు హక్కు కల్పించారు.
అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 యేళ్లు పట్టింది. దేశం అభివృద్ధిలో మహిళలను పురుషులతో పాటు తొలి ప్రధాని నెహ్రు సమాన హక్కులు కల్పించారు. దేశ ప్రధానిగా, లోక్ సభ స్పీకర్ గా, రాష్ట్రాల గవర్నర్లు, న్యాయమూర్తులు గా మహిళలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మహిళా విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లతో పాటు స్థానిక సంస్థల్లో కూడా మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చి పరిపాలన లో కాంగ్రెస్ పార్టీ భాగస్వామ్యం చేసింది.
చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం 2013 లోనే బిల్లును కాంగ్రెస్ ఆమోదించింది. ఇప్పటికి కొన్ని విషయాల్లో మహిళలపైన వివక్ష ఉంది. రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే మహిళలకు రక్షణ కల్పించాలి. పిల్లలకు భద్రత ఇవ్వాలని మా ప్రభుత్వం భావించింది. మహిళ ల కోసం షీ టీమ్స్ ను ఏర్పాటు చేసుకున్నాం.అభద్రతకు గురైన మహిళలకు అండగా ఉండాలని స్టాండ్ విత్ హర్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నాం. మరో అడుగు ముందుకు వేసి స్పందన పేరుతో 24గంటల పాటు అందుబాటులో ఉండేలా టీమ్స్ ను ఏర్పాటు చేశాం.
స్పందన ద్వారా తక్షణమే బాదిత మహిళలకు మానసిక భద్రత కల్పిస్తారు. సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుందన్న విశ్వాసాన్ని మా ప్రభుత్వం కల్పిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్న సందేశం ఇవ్వడం కోసం నేను ఈ కార్యక్రమంలో పాల్గొన్నాను. సమస్య వచ్చిన తర్వాత పరిష్కరించడం కాదు. అసలు సమస్యనే రాకుండా చూడాల్సిన సామాజిక బాధ్యత మనపైన ఉంది.
మహిళల బాధలో అండగా నిలబడి ధైర్యాన్ని ఇచ్చే సామాజిక బాధ్యత అందరిపైన ఉంది. ప్రభుత్వ ప్రతి సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్ద పీఠ వేస్తున్నాం. ఇందిరమ్మ ఇళ్లను మహిళలపేరుతో ఇస్తున్నాం. మహిళకు ఆర్థిక స్వాలంభన వచ్చినప్పుడు కుటుంబం సమాజంలో నిలబడుతుంది. మహిళా సాధికారిత ను అమలు చేయడం ముఖ్యం. 67 లక్షల మంది స్వయం సహాయక మహిళా సంఘాలకు 60 వేల కోట్ల రూపాయల బ్యాంక్ రుణాలను అందజేశాం.
రాష్ట్రంలోని కోటీ మంది మహిళలకు సారె పేరుతో ఇందిరమ్మ చీరలు ఇచ్చాం. 28 నెలల్లో మహిళల ఉచిత బస్సు ప్రయాణం కోసం ప్రభుత్వం 10 వేల కోట్లు ఖర్చు చేసింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని పకడ్బందీగా అమలు చేయడం వల్ల ఆడబిడ్డలకు 10 వేల కోట్లు ఆదా చేసుకున్నారు. స్వయం సహాయక సంఘాలకు 1000 బస్సులను కొనిచ్చి ఆర్టీసీకి లీజు ఇప్పించాం. 1000. మెగావాట్ల సోలార్ ఎనర్టీ ప్లాంట్ల ను స్వయం సహాయక మహిళలకు ఇప్పించాం.
ప్రభుత్వ ఆఫీసుల్లో ఇందిరమ్మ క్యాంటీన్లను స్వయం సహాయక మహిళలతో ఏర్పాటు చేయించాం. అన్ని జిల్లాల్లో స్వయం సహాయక మహిళా సంఘాలకు భవనాలు ఏర్పాటు చేశాం. నారాయణ పేటలో స్వయం సహాయక మహిళా సంఘాలతో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించాం. 26 వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహరణను మహిళా సంఘాలకే అప్పగించాం. 26 లక్షల ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల స్కూల్ యూనిఫామ్ లు కుట్టే బాధ్యతను స్వయం సహాయక మహిళలకు ఇచ్చాం. హైటెక్ సిటీ దగ్గర 1000 కోట్ల విలువ చేసే మూడున్నర ఎకరాల్లో మహిళా శక్తి స్టాల్స్ ను ఏర్పాటు చేశాం.
అమెజాన్ తో ఒప్పందం చేసుకుని ఆడబిడ్డల తయారు చేసే ఉత్పత్తులను అమ్మే విధంగా చేశాం. 2034 నాటికి వన్ ట్రిలియన్ , 20247 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ గా చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా పెట్టుకుంది. ఇది జరగాలంటే మహిళలకు భద్రత ఉండాలి. సమాజం నిలబడాలంటే మహిళలు తమ కాళ్లపైన తాము నిలబడాలి. ఎంత ఆర్థిక ప్రగతి సాధించినా పిల్లలు సరైన దారిలో నడవకపోతే అంతా వృథా.
పంజాబ్ లాంటి రాష్ట్రంలో మన కళ్ల ముందే డ్రగ్స్ వల్ల యువత నిర్వీర్యం అయింది. వ్యసనాలబారి న పడి ఆ రాష్ట్రం కోలుకోని స్థితిలో ఉంది. స్కూల్స్ ముందు చిన్న చిన్న దుకాణాల్లో గంజాయి అమ్ముతున్నారు. మత్తుకు బానిసలైన వారు, గంజాయి తీసుకుంటున్న వారే ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలపైన అకృత్యాలకు పాల్పడుతున్నారు. ఈగల్ ఫోర్స్ ను మా ప్రభుత్వం తీసుకువచ్చి డ్రగ్స్ పైన కఠినంగా వ్యవహారిస్తోంది. ఎంత పెద్ద వారు ఉన్నా, సెలబ్రేటీల్స్ ఉన్నా , ప్రజా ప్రతినిధులు ఉన్నా వదలకుండా అరెస్టు చేస్తున్నాం.
ఇటీవల డ్రగ్స్ కేసులో ప్రజాప్రతినిధులను కూడా అరెస్టు చేశాం. గంజాయి, డ్రగ్స్, మద్యం బానిసల వల్ల జరిగే క్రైమ్స్ పైన పీస్ కమిటీ సభ్యులు దృష్టి పెట్టాలి. మతకల్లోలాలకే కాకుండా పీస్ కమిటీలను విస్తరించాలి. పాఠశాలల్లో చేరే సమయంలో డ్రగ్స్ తీసుకోమని సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. డ్రగ్స్ , గంజాయి పైన మాట్లాడాల్సిన అవసరం ఇప్పుడు ఉంది. డ్రగ్స్ పునరావాస కేంద్రాలను కూడా పెంచుతున్నాం. బాధ్యతను నిర్వహించకపోతే సమాజానికి అన్యాయం చేసినవాళ్లం అవుతాం.
మత్తును వదిలించాల్సిన అవసరం ఉంది. ఎంత వారున్నా, సెలబ్రేటీస్స్ ఉన్నా ప్రజల మధ్య శిక్షిస్తే సందేశాన్ని ఇచ్చి వాళ్లం అవుతాం. భయం, బాధ్యత లేనప్పుడు విచ్చలవిడితనం వస్తుంది. దీన్ని ప్రభుత్వం సహించదు.
నేరగాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది.. ఎంత పెద్ద కుటుంబమైనా, రాజకీయ నాయకుడైనా, ఉన్నతాధికారుల కుటుంబమైనా నేను కేర్ చేయను. డ్రగ్స్ ను నియంత్రించాల్సిందే. తెలంగాణ రాష్ట్రం అంటే మహిళల రక్షణ కు పర్యాయ పదం గా తీర్చిదిద్దాం.