– టివికె క్యాబినెట్లో టీడీపీ నేతకు స్థానం
– టిడిపి స్కూల్ నుంచి టివికె క్యాబినెట్ వరకూ ..
– రాజకీయ వ్యూహకర్త స్థాయి నుండి.. తమిళనాడు కేబినెట్ లో కీలక మంత్రి వరకు సాగిన కమ్మ మహిళ ప్రస్థానం
టిడిపి స్కూల్ నుంచి టివికె క్యాబినెట్ వరకూ ..టిడిపి స్కూలు నుంచి యూనివర్శిటీకి విస్తరించిన రాజకీయ పాఠశాల. ఇక్కడ సిలబస్ అర్ధం చేసుకుంటే, ఏ పార్టీలో అయినా ఈజీగా బతికేయవచ్చు. అలాంటి స్కూలులో విద్యార్ధులయిన కేసీఆర్, రేవంత్రెడ్డి లాంటి వాళ్లు ముఖ్యమంత్రులయ్యారు. ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సంఖ్యకయితే లెక్కలేదు. ఆ జాబితాలో తాజాగా ఇప్పుడు ఒక మహిళా రత్నం కూడా చేరింది. మొన్నటి వరకూ టీడీపీలో సోషల్మీడియా బాధ్యతలు నిర్వర్తించిన కీర్తన అనే మహిళ.. ఇప్పుడు తమిళనాడు విజయ్ క్యాబినెట్లో కీలకమంత్రిగా ప్రమాణం చేశారు. కమ్మ కులానికి చెందిన కీర్తన.. ఎన్నికల ముందు కూటమి ప్రకటించిన సూపర్సిక్స్ పథకాలను జనంలోకి వెళ్లేందుకు కృషి చేశారు.
ముఖ్యమంత్రి విజయ్ మంత్రివర్గంలో 30 ఏళ్ల యువ ఎమ్మెల్యే ఎస్. కీర్తన మంత్రిగా ప్రమాణం చేశారు. కేవలం 30 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి విజయ్ కేబినెట్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆమె కమ్మ కులస్తురాలు. ఆధునిక రాజకీయాల్లో యువత పాత్రకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.
చదువు పూర్తయ్యాక డేటా అనలిటిక్స్, స్టాటిస్టిక్స్పై ఉన్న పట్టుతో ఆమె ‘షోటైమ్ కన్సల్టింగ్’ సంస్థలో పొలిటికల్ కన్సల్టెంట్గా చేరారు. 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ విజయానికి అవసరమైన డిజిటల్ వ్యూహాలను రూపొందించడంలో ఆమె కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ‘సూపర్ సిక్స్’ వంటి పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, డేటా విశ్లేషణ ద్వారా నియోజకవర్గాల వారీగా ప్రచారాన్ని నడిపించడంలో ఆమె చాకచక్యం ప్రదర్శించారు.
ఈ వృత్తిపరమైన అనుభవమే ఆమెను తమిళనాడు రాజకీయాల్లో విజయ్ స్థాపించిన ‘తమిళ వెట్రి కళగం’ (TVK) పార్టీకి దగ్గర చేసింది. పార్టీకి కేవలం సినీ గ్లామర్ మాత్రమే సరిపోదని, శాస్త్రీయమైన ఎన్నికల వ్యూహాలు అవసరమని గుర్తించిన విజయ్, కీర్తనలోని నైపుణ్యాన్ని గుర్తించి ఆమెకు శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం కల్పించారు.
తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించిన కీర్తన, ఇప్పుడు మంత్రిగా సరికొత్త బాధ్యతను స్వీకరించబోతున్నారు. రాజకీయాలంటే కేవలం వారసత్వం లేదా సుదీర్ఘ అనుభవం మాత్రమే కాదు. పక్కా ప్రణాళిక మరియు ప్రజల నాడిని పట్టుకునే నైపుణ్యం ఉంటే యువత కూడా అత్యున్నత శిఖరాలను అధిరోహించగలరని ఆమె నిరూపించారు. ఒక సాధారణ వ్యూహకర్తగా మొదలైన ఆమె ప్రస్థానం, నేడు తమిళనాడు ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరడం విశేషం.”కంగ్రాట్స్” కీర్తన! ఈవిడ తెలుగులో ప్రమాణం చేసింది. గ్రేట్ లేడీ
సేకరణ::శివరామకృష్ణ “సూర్యదేవర”