– హైదరాబాద్ ప్రెస్ క్లబ్ పాలకమండలి విజ్ఞప్తి
– సానుకూలంగా స్పందించిన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
– మంత్రి దామోదర్ రాజనర్సింహ కి కృతజ్ఞతలు తెలిపిన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ వారోత్సవాన్ని (జూన్ – 2) పురస్కరించుకొని నిమ్స్ ఆసుపత్రిలో సోమాజిగూడ లోని ప్రెస్ క్లబ్ సభ్యులందరికీ ఉచితంగా మాస్టర్ హెల్త్ చెకప్ క్యాంప్ ను నిర్వహించాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎస్. విజయ్ కుమార్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రమేష్ వరికుప్పల, ఉపాధ్యక్షురాలు అరుణ అత్తలూరి లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ కి రాష్ట్ర సచివాలయంలో కలసి వినతి పత్రం సమర్పించారు.
హైదరాబాద్ ప్రెస్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా నిమ్స్ ఆసుపత్రిలో మాస్టర్ హెల్త్ చెకప్ నిర్వహించాలని క్లబ్ పాలకమండలి మంత్రి దామోదర్ రాజనర్సింహ కి చేసిన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే జర్నలిస్టులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
జర్నలిస్టులు రెగ్యులర్ గా తమ హెల్త్ ను చెకప్ చేసుకోవాలని మంత్రి సూచించారు. నిమ్స్ లో హెల్త్ చెకప్ కు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినాను మంత్రి ఆదేశించారు. ప్రెస్ క్లబ్ సభ్యులకు మాస్టర్ చెకప్ క్యాంపు ఏర్పాటుకు సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ కి, ప్రభుత్వానికి ప్రెస్ క్లబ్ పాలకమండలి కృతజ్ఞతలు తెలిపారు.