- ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్టా మొత్తం అవినీతి బాగోతం
- మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
హైదరాబాద్: ఇందిరమ్మ రాజ్యంలో రైతులు కష్టాలు పడుతున్నారు.
రాష్ట్రంలో ధాన్యం కొనే పరిస్థితి లేదు. రైతుల మరణాలపై సీఎం రేవంత్ రెడ్డి అవహేళనగా మాట్లాడారు. మరణించిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. మహారాష్ట్రలో అగ్ని ప్రమాదం సంఘటన వద్దకు వెళ్ళి కాంగ్రెస్ సీఎం నవ్వితే అధిష్టానం వెంటనే సీఎంను మార్చింది. రేవంత్ రెడ్డి చర్యలు కాంగ్రెస్ అధిష్ఠానంకు కనపడటం లేదా?
మూడు టర్మ్ లు రైతు బంధు ఎగ్గొట్టారు. కేసీఆర్ నిర్ణయాలతోనే వరి పంట దిగుబడి పెరిగింది. ఐకేపీ సెంటర్లు ఫోటోలు దిగి కొబ్బరికాయలు కొట్టడానికి పనికి వస్తున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్టా మొత్తం అవినీతి బాగోతం.
మంత్రి కాగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి పౌర సరఫరాల శాఖలో అవినీతికి పాల్పడ్డారు రాష్ట్రంలో నీటి కష్టాలు,మోటార్ల కష్టాలు మొదలయ్యాయి. మోటార్లకు మీటర్లు పెడితే ఒప్పుకోమని నాడు కేసీఆర్ అన్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆర్డీఎస్ స్కీం లో చేరి మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి వ్యవసాయంపైఅవగాహన లేదు.
కోదండరెడ్డి రైతులకు మూడు గంటలు కరెంటు చాలు అని ఎట్లా అంటారు?. గతంలో ఆమెరికాలో రేవంత్ రెడ్డి మూడు గంటలు కరెంటు చాలు అని మాట్లాడారు. 3 లక్షల కోట్ల అప్పులు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అందాల పోటీలు పెట్టింది. ఢిల్లీకి కప్పం కడుతున్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తుతోంది. రాష్ట్రంలో యూరియా కొరతను ప్రభుత్వం తీర్చాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార మాటలు బంద్ చేయాలి.