- శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనా చారి
- లోక్ భవన్ లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ను కలిసిన బీ ఆర్ ఎస్ నేతలు మండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి… సహకార సంఘాల చైర్మన్లు
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా సహకార సంఘాల్లో నామినేటెడ్ వ్యక్తులను నియమించాలని చూస్తోంది. ఇది సహకార సంఘాల చట్టానికి విరుద్ధం.
2020లో గెలిచిన చైర్మన్లు 2025 వరకు పదవి కాలం ఉంది ఆ తర్వాత వారిని కొనసాగించింది. ఎన్నికలు జరపకుండా వారికి అనుకూలంగా ఉన్న వారిని నామినేట్ చేయాలని చూస్తోంది.
ఈ అంశంపై గవర్నర్కు వినతి పత్రం అందజేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్న లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్తామని గవర్నర్ హామీ ఇచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వ చర్యలు చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయి. సహకార సంఘాల ఎన్నికలు జరపకుండా కుట్రపూరితంగా నామినేటెడ్ వ్యక్తుల నియమిస్తోంది. ఇది చట్ట విరుద్ధం.