రజనీకాంత్‌తో అణ్ణామలై చేతులుకలుపుతారా?
అణ్ణామలై మళ్లీ తమిళ్ష్ నాడు బీ.జె.పీ. అధ్యక్షుడు కానున్నారా? తమిళ్ష్ నాడు విషయంగా బీ.జె.పీ. అధిష్టానం చేసిన పెను తప్పును ఇకనైనా సరి చేసుకోకునుందా?
‘విజయ్ క్రైస్తవ పాలన మొదలయింది తమిళ్ష్ నాడులో’ అని స్పష్టంగా తెలియవస్తోంది. పాలన పరంగా విజయ్ దాదాపుగా క్రియా రాహిత్యంతో ఉన్నారని తెలియవస్తోంది. పాలన ఆదవ్ అర్జున్ చేతుల్లో ఉందని చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధానాధికారులుగా నియమితమైన వారిలో నేర చరితులు ఉండడం గమనార్హం. పాలన విషయం అవగాహనా రాహిత్యంతో విజయ్ పూర్తిగా విఫలం కానున్నారా?
విజయ్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కూల్చెయ్యచ్చు కాదు ఇప్పుడైనా కూల్చెయ్యచ్చు… ఇప్పుడే కూల్చేస్తే అది విజయ్‌కు లాభిస్తుంది. కనుక విజయ్ను ఒక విఫలమైన ముఖ్యమంత్రిగా ప్రజల ముందు నిలబెట్టి అప్పుడు కూల్చేస్తారా?
ఈ ఎన్నికలు ద్రావిడత్వంను చంపేశాయి. అది శుభ పరిణామం. తమిళ్షనాడులో అణ్ణామలై అధ్యక్షతన బీ.జె.పీ. ఒక బలమైన శక్తిగా ఎదగడం లేదా అణ్ణామలై సొంతంగా ఒక బలమైన శక్తిగా ఎదగడం తమిళ్ష్ నాడుకు, తమిళ్ష్ నాడు హిందువులకు ఎంతో అవసరం. పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి?
రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడికి సమర్పించాక అణ్ణామలై తిరిగి వస్తూండగా ప్రత్యేకమైన ఆహ్వానం మేరకు అమిత్ షాను కలిశారు అణ్ణామలై! అమిత్ షా ఏం చెయ్యనున్నారు?
అణామలై అధ్యక్షతన గత ఎన్నికల్లో ఏ పొత్తూ లేకుండా పోటీ చేసుంటే 15 సీట్లైనా వచ్చుండేవి. అవి విజయ్‌కు తగ్గి ఉండేవి; విజయ్ ముఖ్యమంత్రి అవకాశం వచ్చుండేది కాదేమో? డీ.ఎమ్.కె.పై పెను వ్యతిరేకతను ప్రజల్లో అణ్ణామలై సాధించగలిగారు కానీ బీ.జె.పీ. ఎ.ఐ.ఎ.డీ.ఎమ్.కె.తో పొత్తు పెట్టుకోవడం,అణ్ణామలై దూరం అవడం బీ.జె.పీ.ని చంపేశాయి. డీ.ఎమ్.కె. వ్యతిరేకతలో బీ.జె.పీ.కి రావాల్సిన భాగం కూడా విజయ్‌కు వెళ్లిపోయింది.
ప్రస్తుత పరిస్థితిలో బీ.జె.పీ.ని తమిళ్ష్ నాడులో బతికించగలిగేది ఒక్క అణ్ణామలై మాత్రమే. తమిళ్ష్ నాడులోని బీ.జె.పీ.లో పాత బూజుకు అణ్ణామలై ఇష్టం లేదు. ఆ బూజు పార్టీకి హాని. ముఖ్యంగా నయనార్ నాగేంద్రన్ పూర్తిగా పనికిరాని సరుకు.
అణ్ణామలై రాజీనామ సమర్పించిన సందర్భంలో నాగేంద్రన్ను అధిష్టానం దిల్లీకి పిలిచింది. బీ.జె.పీ. అధిష్టానం ఏం చేయనుంది? అధిష్టానం ఈ వరకే తమిళ్ష్ నాడులో పార్టీని చేజేతులారా చంపేసింది అన్నది జరిగిన పరిణామాల ద్వారా రూఢీ అయింది.
బీ.జె.పీ. పగ్గాలు ఇప్పుడు అణ్ణామలైకు ఇవ్వడం ఒక్కటే అధిష్టానం చెయ్యాల్సిన పని. లేదా అణ్ణామలై బీ.జె.పీ. పార్టీ నుంచి బయటకు వచ్చి హిందూత్వంతో, జాతీయతా చింతనతో విజయ్‌కు ప్రత్యామ్నాయంగా పరిణమించాలి. బీ.జె.పీ. పార్టీ తోనో, లేదా సొంతంగానో అణ్ణామలై రాష్ట్రంలో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి తమిళ్ష్ నాడును క్రైస్తవ మాఫియాకు బలి కాకుండా కాపాడుకోవాలి.
రజనీకాంత్… అణ్ణామలై తదుపరి కార్యాచరణలో ప్రముఖమైన స్థానం తీసుకోను న్నారు రజనీకాంత్. ఈ వరకే అణ్ణామలై, రజనీకాంత్ మధ్య పలు దఫాలుగా సంప్రదింపులు జరిగాయి. రజనీకాంత్ మద్దతుతోనో, రజనీకాంత్‌ను కలుపుకునో
అణ్ణామలై పని చెయ్యనున్నారని కూడా తెలియవస్తోంది.
“మక్కళ్ సేవై కళ్షగమ్” (ప్రజా సేవ పార్టీ)పేరుతో రజనీకాంత్ ఒక పార్టీని లోగడ రిజిస్టర్ చేశారు. ఆ “మక్కళ్ సేవై కళ్షగమ్” ను అణ్ణామలైకు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.
రజనీకాంత్ వెన్నుదన్నుతో అణ్ణామలై క్రియాశీలకత్వంతో తమిళ్ష్ నాడులో వాంఛనీయమైన కార్యాచరణలు జరగబోతున్నాయి. తమిళ్ష్ నాడులో రానున్న రోజుల్లో అణ్ణామలై కీలకం కానున్నారు.
- రోచిష్మాన్
9444012279