ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి … మనకు ఒక అపురూపమైన బహుమతి

ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి జయంతి..
‘ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి ఒక మహా గాయని, మహా కళాకారిణి’ అని ఇప్పుడు చెప్పడం తేనె మధురమైనది, తెమ్మెర గొప్పది, హిమలయాలు మంచు కొండలు, సంస్కృతం గొప్ప భాష, కర్ణాటక సంగీతం గొప్పది అని చెప్పడమే ఔతుంది.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి దక్షిణ భారతదేశ స్త్రీ కాబట్టి ఆమెను స్మరించుకోవడం ప్రతి దక్షిణభారత దేశ వ్యక్తి తాను వ్యక్తిని అన్న సంగతిని స్మరించుకోవడం ఔతుంది.
‘భారత రత్న’ పురస్కారాన్ని పొందిన తొలి సినిమా నటి, తొలి గాయని ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి. నాలుగే నాలుగు సినిమాల్లో మాత్రమే ఆమె నటించారు. ఆమె ఒక నాట్యకళాకారిణి, ఒక వీణా వాదనకారిణి కూడా. ఒక దశ తరువాత సుబ్బులక్ష్మి ఒక గాయనిగా మాత్రమే స్థిరపడ్డారు. గొప్ప గాత్రం, గొప్ప పణితి (గాన విధానం) వీటితో ఆమె మహోన్నతమైన గాయని.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి ఒక మహా కళాకారిణి అని ఇవాళ మనం అనడం పసిపిల్లలు పెద్దలను గమనించి మాట్లాడ్డం వంటిది. ఆ మాటలకు అర్థం, ఆ మాటల విలువ సరిగ్గా తెలియని దశ పసిపిల్లలది. ఆ విధంగా ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గానం కూడా మనలాంటి వాళ్లకు పూర్తిగా అవగతం కానిది. గొప్ప గాత్రం, గొప్ప గానం రెండిటికీ మేలైన మూర్తిమత్వం మాత్రమే కాదు
ఒక మహిళగా ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మేలైన భారతీయతకు సరైన మూర్తిమత్వం.
బ్రాహ్మణ్యం అన్నది పుట్టుక వల్ల రాదు; బ్రాహ్మణ్యం అన్నది ఒక స్థితి’ ఈ సత్యానికి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి కచ్చితమైన మచ్చుతునక. ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మేలైన బ్రాహ్మణ్యాన్ని తనకు తానుగా పొదువుకున్నారు! కులం అన్నది జన్మకు సంబంధించింది కాదు ప్రవర్తన, బుద్ధికి, వ్యక్తిత్వానికి సంబంధించినది అన్న సనాతన వాస్తవానికి ఉన్నతమైన ఆకృతి
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గురించి ఎంతో చెప్పాల్సి ఉన్నా ఒక్క వాక్యంలో చెప్పాలంటే ఏమని చెప్పాలి? ‘తన భక్తి గానం అంత గొప్ప కళాకారిణి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి!’ ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మికి సాటి ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి భక్తిగానం మాత్రమే!
అనుభూతి గానం ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గానం; అందులోనూ ఆమె భక్తి గానం ‘చిచ్ఛక్తి గానం!’ మేలైన భక్తి గానం అంటే శోభాయమానమైన, మెరుగైన, ఉదాత్తమైన గానం. దక్షిణాదిలో rusticity లేని మేలైన భక్తి గానం చేసిన గాయకులు ఇద్దరే. పురుషుల్లో పీ.బీ. శ్రీనివాస్; (ఆయన ముకుందమాల ఇందుకు ఒక సరైన తార్కాణం) మహిళ్లలో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి. (ఘంటసాల గొప్ప భక్తిగానం చేశారు అన్న ‘తెలుగు అజ్ఞానం’ ఇకనైనా ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి భక్తి గానం అన్న వైద్యంతో నయం కావాలి) ప్రవర్తన, మాట, తీరు, నమ్రత, సభ్యత, నిండుతనం, నాణ్యత వంటివి 80% మంది తెలుగు వాళ్లకు తిన్నగా ఉండవు. ఇవి సంపూర్ణంగా సరిగ్గా ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మిలో నెలకొన్నాయి. తెలుగు వాళ్లు ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి జీవితాన్ని కూడా సరిగ్గా తెలుసుకుని తమలో లేనిదేమిటో అర్థం చేసుకోవాలి. సుబ్బులక్ష్మి గానం సరిగ్గా అవగతం అయుంటే ‘ఘంటసాలది సరైన భక్తి గానం కాదు’ అని ఎప్పుడో తెలుగులకు తెలుసుండేది.
ఒక భారతీయ మహిళకు ‘భారతీయత’ ఎంత ఉన్నతిని చేకూరుస్తుంది? తన భారతీయతతో ఎమ్.ఎస్. సుబ్బులక్ష్మి సాధించిన ఉన్నతి ఆ ప్రశ్నకు సరైన సమాధానం. తన సనాతనత్వంతో ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి సాధించిన స్థితిని ఆ సనాతనత్వాన్ని మానసిక రోగాలతో వద్దనుకున్న మరే స్త్రీ కూడా మనదేశంలో సాధించలేదు!
మరో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మనదేశంలో రాలేదు. తెమ్మెర వంటిది ఇంకొకటి ఉండదు; వీచి వెళ్లాక మళ్లీ ఆ తెమ్మెరే రావాలి. మరో ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి మనదేశంలో రాలేదు. తెమ్మెర వంటిది ఇంకొకటి ఉండదు; వీచి వెళ్లాక మళ్లీ ఆ తెమ్మెరే రావాలి. మనలో ఉన్న ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి గానం మనకు అందిన ఒక అపురూపమైన బహుమతి.
ఎమ్. ఎస్. సుబ్బులక్ష్మి స్మరణలో..
- రోచిష్మాన్
9444012279
