కాంగ్రెస్ కరెంటు కుట్రలను బయటపెడతాం

- పంటలకు కూడా పూర్తి స్థాయిలో పవర్ హాలిడే ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం
- బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముమ్మాటికీ వైఫల్యమే
- మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ
సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద బిఆర్ఎస్ నేతల నిరసన
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ కరెంటు కుట్రలను బయటపెట్టేందుకు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు, మాజీ మంత్రి మరియు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన బిఆర్ఎస్ బృందం గురువారం హైదరాబాద్‌లోని సింగరేణి హెడ్ ఆఫీస్‌ను సందర్శించింది.
ఈ బృందంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, టీజీబీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. సింగరేణి హెడ్ ఆఫీస్ వద్దకు చేరుకున్న బిఆర్ఎస్ నాయకులు, అధికారుల వైఖరికి నిరసనగా కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో కరెంటు కోతలు విధించడంతో ఇళ్లకు విద్యుత్ లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిశ్రమలు, వ్యవసాయంపై ప్రభావం: పరిశ్రమలకు ఇప్పటికే పవర్ హాలిడే ప్రకటించారని, రాబోయే యాసంగి/వేసవి పంటలకు కూడా పూర్తి స్థాయిలో పవర్ హాలిడే ఇచ్చే యోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉందని ఆరోపించారు.
థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు సింగరేణి సంస్థ సరిపడా బొగ్గు సరఫరా చేయకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు దాదాపు ₹52,000 కోట్ల నుండి ₹60,000 కోట్ల వరకు బకాయిలు పడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ముమ్మాటికీ వైఫల్యమే.
కేసీఆర్ పాలనలో 72 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న బొగ్గు ఉత్పత్తి, నేడు కేవలం 58 వేల టన్నులకు పడిపోయింది. గతంలో లభించిన 24 గంటల ఉచిత విద్యుత్ పోయి, నేడు కనీసం 6 గంటలు కూడా కరెంటు రాని దౌర్భాగ్య పరిస్థితి దాపరించింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, విద్యుత్ రంగంలో నెలకొన్న సంక్షోభాన్ని ప్రజలకు విడమరిచి చెప్పడానికే BRS పార్టీ ఆధ్వర్యంలో పవర్ స్టేషన్లు మరియు సింగరేణి భవన్ ల వద్ద ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టినట్లు నేతలు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కి వినతి అందించి విద్యుత్ కోతలపై ప్రశ్నించగా అధికారులు సైతం సరైన సమాధానం చెప్పలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
