కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది

- కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్ సమస్యపై రోడ్డెక్కిన కూడా సిగ్గు అనిపిస్తలేదా?
- జల విద్యుత్ కేంద్రాలు కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు
- సింగరేణి తక్కువ నాణ్యత కలిగిన జి-13, జి-14 గ్రేడ్ బొగ్గును సరఫరా ఎందుకు చేస్తుంది?
- సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న 52 వేల కోట్లు ఇస్తేనే సింగరేణి బాగుపడుతుంది
- కాకతీయ థర్మల్ ప్రాజెక్టు వద్ద మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
వరంగల్: కాంగ్రెస్ వచ్చింది.. కరెంట్ పోయింది. అధికారం కాంగ్రెస్‌కు వస్తే, రాష్ట్రం అంధకారంలోకి వెళ్లింది. వ్యవసాయానికి రోజుకు 4-5 గంటలు కూడా కరెంట్ ఇవ్వలేని దుస్థితి వచ్చింది . ఎండిన పంటలను చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. నీళ్లు రాక, కరెంట్ లేక రైతులు సబ్‌స్టేషన్ల వద్ద నిరసనలు, రాస్తారోకోలు చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో అణచివేస్తోంది. కేసీఆర్ పాలనలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తే, నేడు కరెంట్ కోతలు చేస్తున్నారు.
ఆనాడు తెలంగాణ వస్తే కరెంట్ తీగలపై బట్టలు ఆరేసుకోవాలి అన్నట్టుగా ఈ రేవంత్ పాలన నడుస్తుంది. పవర్ ప్లాంట్లకు నాణ్యతలేని బొగ్గు సరఫరా చేస్తున్నారు. భూపాలపల్లి సింగరేణిలో బొగ్టు నిల్వలు తగ్గిపోయాయి.కొత్త మైనింగ్ పర్మిషన్లు తీసుకోవట్లేదు. కార్మికులకు సేఫ్టీ కిట్లు, కనీసం బూట్లు కూడా 3 సంవత్సరాలుగా అందట్లేదు.
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఉండగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో దాన్ని 19,472 మెగావాట్లకు పెంచి ఒక ప్రణాళిక ప్రకారం రూపాకల్పన చేసింది కేసీఆర్ . ఆనాడు కెసిఆర్ హయాంలో 400 కేవీ సబ్‌స్టేషన్లను 6 నుంచి 28కు, 220 కేవీ సబ్‌స్టేషన్లను 51 నుంచి 103కు పెంచి దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించాం.
నాసిరకం బొగ్గు వినియోగంతో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం తగ్గడంతో రూ.2,900 కోట్ల ప్రజాధనం నష్టపోయింది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలోనూ రైతులు విద్యుత్ సమస్యపై రోడ్డెక్కిన కూడా సిగ్గు అనిపిస్తలేదా? ఈ రోజుల్లో కరెంట్ సంక్షోభానికి కారణం ఎవరండి ? జెన్‌కోకు సింగరేణి నాసిరకం బొగ్గు తో రూ.2వేల 900 కోట్ల నష్టం జరిగింది దీనికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వమే.
సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.52 వేల కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి 2023-24లో 70 మిలియన్ టన్నుల నుంచి 2025-26లో 58 మిలియన్ టన్నులకు పడిపోవడానికి కారణం ఎవరు?. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ వ్యవస్థ ఎందుకు ఇలా గాడి తప్పిందో రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న సమయంలో థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొరతతో ఉత్పత్తి పడిపోతున్నదని, మరోవైపు జల విద్యుత్ కేంద్రాలు కూడా నీటి లభ్యత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఈ పరిస్థితులపై వాస్తవాలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు నేడు బీఆర్‌ఎస్ పార్టీ తరుపున రాష్ట్రంలోని థర్మల్ పవర్ ప్లాంట్లు, సింగరేణి ప్రధాన కార్యాలయాలను సందర్శిస్తున్నాం.రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులకు ఆరు గంటలకు మించి కరెంట్ సరఫరా జరగటం లేదు. కానీ సిగ్గులేకుండా ఈ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నారు. అదే నిజం అయితే సబ్‌స్టేషన్ల వద్ద రైతుల ధర్నాలు, రాస్తారోకోలు ఎందుకు జరుగుతున్నాయి.?
జెన్‌కోకు నాణ్యమైన బొగ్గు అందించాల్సిన సింగరేణి.. తక్కువ నాణ్యత కలిగిన జి-13, జి-14 గ్రేడ్ బొగ్గును సరఫరా ఎందుకు చేస్తుంది? రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం, చేతకానితనం, కమిషన్లు, అవినీతి కారణం. కెటిపిపి కి బొగ్గు రాక రెండు యÖనిట్లలో విద్యుత్ ఉత్పత్తి అనుకున్నంత జరగట్లేదు.
కెటిపిపి స్టేజీ1 లో 500 మెగావాట్లు, స్టేజ్ 2 లో 600 మెగావాట్లు ఉత్పత్తి జరగాలి. ఇప్పుడు రోజుకు 600 మెగావాట్లు కూడా జరగట్లేదు. 4 వేలకు పైగా కార్మికులు ఉంటే కనీసం బూట్లు, సాక్స్‌లు, డ్రిల్లింగ్‌కు వాడు బిట్లు కూడా 3 ఏళ్లుగా ప్రభుత్వం ఇవ్వట్లేదు. సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న 52 వేల కోట్లు ఇస్తేనే సింగరేణి బాగుపడుతుంది.
