October 9, 2026

రేవంత్ దా‘రుణ’ కుంభకోణాలు

రేవంత్ దా‘రుణాలు’ ఎవరి కోసం?

  • తెలంగాణ తాకట్టులో రేవంత్ కనికట్టు
  • అనుముల ఫ్యామిలీ అనకొండ ఫ్యామిలీ గా మారింది
  • 817 ఎకరాల భూములను తాకట్టు పెట్టి 12,818 వేల కోట్లకు పైగా రుణం
  • ఇజ్జత్ నగర్, మొకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పఠాన్ చెరు, గాజుల రామారం, జవహర్ నగర్ ప్రాంతాల్లోని భూముల తాకట్టు
  • రుణం కోసం మార్కెట్ విలువ కేవలం ఎకరాకు 15 కోట్లుగా చూపారు
  • వాస్తవానికి అక్కడ ఎకరం విలువ 150 కోట్ల కు పైనే
  • 40 నుంచి 80 వేల కోట్లు ఉండాల్సిన భూముల విలువ 12 వేల కోట్లు మాత్రమే చూపారు
  • ముంబయికి చెందిన బీకన్ ట్రస్ట్ ను మధ్యవర్తిగా పెట్టి రుణం తీసుకొచ్చారు
  • జవహర్ నగర్ లో తాకట్టు పెట్టిన భూమిని 2008లో జెన్పాక్ట్ సంస్థకు కేటాయించారు
  • ఆ భూమిలో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంటెయినర్లు పెడుతున్నారు
  • తాకట్టు పెట్టిన భూమిలోనే కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా మనుషులు కంటెయినర్లు ఎలా పెడతారు?
  • 817 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా ఎలా తాకట్టు పెడతారు?
  • ఆ భూముల విలువను ఎలా తగ్గించారు?
  • ఆ భూములతో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాకు ఏం సంబంధం?
  • కే టీ ఆర్ వెంట్రుకలు లెక్కబెట్టడానికా పెద్దపల్లి ప్రజలు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కు ఓట్లు వేసింది ?
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: అక్రమ ఆస్తుల పై ఎన్ని ప్రశ్నలు అడిగినా సీఎం రేవంత్ రెడ్డి, వారి అనుచరుల నుంచి ఎలాంటి స్పందన ఉండడం లేదు. ముఖ్యమంత్రి అందరి మీద బురద జల్లుతారు కానీ, ఆయనపై ఆరోపణలు వస్తే మాత్రం కనీసం సమాధానం లేదు. ఆరు గ్యారంటీలు అమలు చేస్తారని ప్రజలు ఆశిస్తే… వీళ్లు మాత్రం డబ్బులు దండుకునే పనిలో పడ్డారు.నేను ఇవాళ మీడియా సమావేశం పెడుతోంటే కాంగ్రెస్ సోషల్ మీడియా మొత్తం నాపై ఏదేదో పెడుతున్నారు, భయపడేది లేదు.

హెచ్ సీయూ విద్యార్థులు వీరోచితంగా పోరాడి కంచె 400 ఎకరాల గచ్చిబౌలి భూములను కాపాడుకున్నారు. కే టీ ఆర్ పోరాటం తో నాడు సుప్రీం కోర్టు కూడా రేవంత్ విధానాలను తప్పు పట్టింది. అపుడు మెత్తబడ్డ రేవంత్ రెడ్డి గుట్టు చప్పుడు కాకుండా తన క్రిమినల్ బ్రెయిన్ తో హైదరాబాద్ నగరం మధ్యలోని 817 ఎకరాల భూములను తాకట్టు పెట్టి 12,818 వేల కోట్లకు పైగా రుణం తీసుకున్నారు.

హైటెక్ సిటీ పక్కన ఇజ్జత్ నగర్, మొకిల, మియాపూర్, ఇంజాపూర్, చిలుకూరు, పఠాన్ చెరు, గాజుల రామారం, జవహర్ నగర్ ప్రాంతాల్లోని భూములను తాకట్టు పెట్టారు. రుణం కోసం మార్కెట్ విలువ కేవలం ఎకరాకు 15 కోట్లుగా చూపారు. వాస్తవానికి అక్కడ ఎకరం విలువ 150 కోట్ల కు పైనే ఉంటుంది. 2026 మార్చ్ 31 వరకు హెచ్ఎండీఏ ఖాతాలో 275 కోట్లు ఉంటే, జూన్ నెలాఖరు వరకు 10వేల కోట్లు డిపాజిట్ అయ్యాయి. కనీసం 40 నుంచి 80 వేల కోట్లు ఉండాల్సిన భూముల విలువ 12 వేల కోట్లు మాత్రమే చూపారు. ముంబయికి చెందిన బీకన్ ట్రస్ట్ ను మధ్యవర్తిగా పెట్టి రుణం తీసుకొచ్చారు.

జవహర్ నగర్ లో తాకట్టు పెట్టిన భూమిని 2008లో జెన్పాక్ట్ సంస్థకు కేటాయించారు. ఇవాళ ఆ భూమిలో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంటెయినర్లు పెడుతున్నారు. ఓ వైపు తాకట్టు పెట్టిన భూమిలోనే కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా మనుషులు కంటెయినర్లు ఎలా పెడతారు? మేం వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడడం లేదు. తెలంగాణ సంపద గురించి మాట్లాడుతున్నాం.

కేటీఆర్ జుట్టుకు ఏదో చేసుకున్నారని కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ విడ్డూరంగా మాట్లాడుతున్నారు. కే టీ ఆర్ వెంట్రుకలు లెక్కబెట్టడానికా పెద్దపల్లి ప్రజలు ఆయనకు ఓట్లు వేసింది ? 817 ఎకరాలు గుట్టు చప్పుడు కాకుండా ఎలా తాకట్టు పెడతారు.. ఆ భూముల విలువను ఎలా తగ్గించారు? తాకట్టు పెట్టిన భూముల్లో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రా కంటెయినర్లు ఎలా పెడతారు? ఆ భూములతో కేఎల్ఎస్ఆర్ ఇన్ ఫ్రాకు ఏం సంబంధం? రేవంత్ రెడ్డి జెన్ ఫాక్ట్ నుంచి కే ఎల్ ఎస్ ఆర్ కు భూములు బదిలీ చేశారా ?

రాహుల్ గాంధీని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని ఖండిస్తున్న రేవంత్ రెడ్డి ఇక్కడ ఏం చేస్తున్నారు? అక్రమ దందాలు, అరెస్టులు తప్ప ఇంకేమీ లేదు. ప్రశ్నలు అడిగితే దుర్మార్గంగా దాడి ఎలా చేస్తారు? దోపిడీ, అవినీతి గురించి ఎన్ని సార్లు, ఎంత మంది అడిగినా సమాధానం ఎందుకు చెప్పడం లేదు? సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తున్నారు. బెదిరింపులకు పాల్పడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు.

మొన్నటి ఎపిసోడ్ లో రేవంత్ కుటుంబసభ్యులు 52 వేల కోట్ల అక్రమ ఆస్తులు కూడ బెట్టుకున్నారని ఆధారాలతో చెప్పాం. ఈ రోజు కే ఎల్ ఎస్ ఆర్ ఎపిసోడ్ లో ఆ ఆస్తులు మరింత పెరిగాయ్. అనుముల ఫామిలీ అనకొండ ఫామిలీ గా మారింది. కే టీ ఆర్ ,హరీష్ రావు లు ఓటమి ఎరుగని నేతలు. తమపై వస్తున్న ఆరోపణలకు వాళ్ళే వివరణ ఇస్తున్నప్పుడు, ఏ స్థాయి లేని రేవంత్ కుటుంబ సభ్యులు ఎందుకు మాట్లాడటం లేదు? నా ఆరోపణలకు సమాధానం లేకే కొందరు భౌతిక దాడులు చేస్తామంటున్నారు. వాళ్ళది క్రిమినల్ మనస్తత్వం ..ఏమైనా చేయొచ్చు.అయినా తెలంగాణ సంపద కాపాడటానికి ఎంతకైనా తెగిస్తాం.

Total Visitors: 2,909,618