November 21, 2026

ఆర్ ఆర్ టాక్స్ లాగే పీ ఆర్ టాక్స్

  • రేవంత్ , ఇంకో మంత్రి అమ్మాయిలు ఇద్దరు కలిసి కార్పోరేట్ స్కూల్ పెడుతున్నారు
  • రేవంత్ కంపెనీ పెట్టారని.. పొంగులేటి తన కొడుకు కోసం డిఫెన్స్ కంపెనీ తెరిచారు
  • పొంగులేటి రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారు
  • నైమిష స్కూల్స్ తీసుకువస్తున్నారు
  • ఇప్పుడు పొంగులేటి బిడ్డ స్వప్ని రెడ్డి స్కూల్ తెరుస్తున్నారు
  • స్కూల్ లు తెరవడం లో రేవంత్ పొంగులేటి పోటీ పడుతున్నారు
  • అమిత్ షా తో ఏం ఒప్పందం చేసుకున్నారు?
  • పొంగులేటి పై ఈ డీ సోదాలు జరిగినప్పుడు ఎందుకు మాట్లాడారు?
  • మెటా పై దాడి చేయడం ఎందుకు?
  • రాహుల్ గాంధీ యూత్ కాంగ్రెస్ దాడిని ఖండించరా ?
  • ఇలా దాడులు చేస్తే ఎవరు పెట్టుబడులు పెడతారు?.
  • కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్

హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో కంపెనీలు రాష్ట్రం నుంచి వెళ్లిపోతున్నాయి. మెటా సంస్థ కార్యాలయం మీద యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు . తెలంగాణ కు ఇది ఓ బ్లాక్ డే. గతంలో కేసీఆర్ పాలనలో పరిశ్రమల స్థాపన కు అన్ని వసతులు కల్పించారు.. టీఎస్ ఐపాస్ తీసుకువచ్చారు. శాంతి భద్రతలకు ప్రాధాన్యత ఇచ్చారు. కేసీఆర్ హయం లో 26 వేల పరిశ్రమలు వచ్చాయి. 18.29 లక్ష ల ఉద్యోగాల కల్పన జరిగింది. రేవంత్ పాలన లో ఐ టీ రంగం లో ఏడు వేల ఉద్యోగాలు పోయాయి.

మెటా అనే సంస్థ పై దాడి చేయడం ఎందుకు? రాహుల్ గాంధీ భారత్ సమిట్ వచ్చి ప్రవచనాలు చెబుతాడు. శాంతి సంయమనం గురించి మాట్లాడతాడు. యూత్ కాంగ్రెస్ దాడిని ఖండించరా ?

రెండవ అతిపెద్ద క్యాంపస్ మేటా పై దాడి పెట్టుబడులపై ప్రభావం చూపదు ? ప్రశ్నిస్తే జర్నలిస్ట్ లను అరెస్ట్ చేస్తారు. ఇద్దరు మహిళా జర్నలిస్టుల పై కేసులు పెట్టారు. రేఖ అనే జర్నలిస్ట్ పై కేసు పెట్టారు. అసలు కాంగ్రెస్ పాలనలో ఏం జరుగుతోంది?

మీకు కేంద్రానికి తేడా ఏంటిది? సోషల్ మీడియా అకౌంట్ బ్లాక్ చేస్తే దాడి చేస్తారా? మెటా పై దాడి చేయడం దేనికి సంకేతం? ఇలా దాడులు చేస్తే ఎవరు పెట్టుబడులు పెడతారు? హైదరాబాద్ గతం లో ఎన్నో కంపెనీలు వచ్చాయి. బ్యాడ్ తెలంగాణ తీసుకువస్తున్నారు. కిటెక్స్ అనే సంస్థ కేటీఆర్ తీసుకొచ్చారు. వరంగల్ లో 20 వేల ఉద్యోగాలు ఇచ్చాయి. ఫాక్స్‌కాన్ లాంటి సంస్థలు ఇక్కడ వచ్చాయి..

మెటా పై దాడి చేయడం పై సమాధానం రేవంత్ రెడ్డి చెప్పాలి. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని అసహించుకుంటున్నారు. కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్. రాష్ట్రంలో జరిగేది గ్లోబల్ సమిట్ కాదు గోబర్ సమిట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది ఇవాళ.

రాష్ట్రంలో ఆర్ ఆర్ టాక్స్ లాగే పీ ఆర్ టాక్స్ నడుస్తోంది .పొంగులేటి రెడ్డి టాక్స్ వసూలు చేస్తున్నారు. కమిషన్ ల కోసం రాష్టాన్ని దోచుకుంటున్నారు. రాష్ట్రంలో కొత్త స్కూల్ మొదలయ్యింది. నైమిష స్కూల్స్ తీసుకువస్తున్నారు..ఇపుడు పొంగులేటి బిడ్డ స్వప్ని రెడ్డి స్కూల్ తెరుస్తున్నారు. స్కూల్ లు తెరవడం లో రేవంత్ పొంగులేటి పోటీ పడుతున్నారు. గురుకుల స్కూల్స్ లో విద్యార్థులు ఇబ్బందులు ఉంటే ముఖమంత్రి పట్టించుకోరు. విద్యా శాఖ మంత్రి రేవంత్ రెడ్డి, ఇంకో మంత్రి అమ్మాయిలు ఇద్దరు కలిసి కార్పోరేట్ స్కూల్ పెడుతున్నారు.

ఇవాళ సర్కార్ దవాఖానాలు పూర్తి గా నిర్లక్ష్యం అయ్యాయి. వరంగల్ లో ప్రైవేటు సూపర్ స్పెషల్ హాస్పిటల్ ను సీఎం ప్రారంభించారు. టిమ్స్ ను పట్టించుకోరు. ప్రైవేట్ హాస్పిటల్స్ ను పట్టించుకున్నారు. ఈ ప్రభుత్వం వ్యాపారాలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కంపెనీ పెట్టారని పొంగులేటి తన కొడుకు కోసం డిఫెన్స్ కంపెనీ తెరిచారు.

సొంత ఎమ్మెల్యే లు లే విమర్శిస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి కదా తప్పుపట్టారు. కేసీఆర్ కు పొలం ఉంటే తప్పా? కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ పై మాట్లాడే ముందు ఆలోచించాలి. అన్ని ఏజెన్సీ లతో విచారణ చేస్తున్నారు కదా? పొంగులేటి మీద ఎందుకు విచారణ చేయరు? పొంగులేటి పై ఈ డీ సోదాలు జరిగినప్పుడు.. ఎందుకు మాట్లాడారు? అమిత్ షా ఆర్‌ఆర్‌టాక్స్ అంటారు. అమిత్ షా తో ఏం ఒప్పందం చేసుకున్నారు?

గురుకులాలు అన్ని నిర్విర్యం అవుతున్నాయి. తెలంగాణ యూనివర్సిటీ లతో ఒప్పందం ఎందుకు చేసుకోవడం లేదు? వేల కోట్లు ఇంటర్ నేషనల్ స్కూల్ పెడుతున్నారు. వీళ్ల ఆస్తులపై బీజేపీ ఎందుకు దర్యాప్తు చేయదో చెప్పాలి. తెలంగాణ లో గుండాయిజం పై రాహుల్ గాంధీ , రేవంత్ రెడ్డి చెప్పాలి. ఎన్నో డిక్లరేషన్ లు ఇచ్చారు కదా అమలు ఏదీ? దొంగ హామీలతో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. భయపెట్టి రాజకీయం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. సోషల్ మీడియా అకౌంట్ లను ఎందుకు బ్లాక్ చేస్తున్నారు? మాజీ డీజీపీ లను సైతం వదలడం లేదు. భయపెట్టిస్తున్నారు.

Total Visitors: 3,498,927