November 21, 2026

రేవంత్ రెడ్డి, ఫయీమ్ ఖురేషి ఆదేశాలమేరకే అక్రమ కేసులు

  • హెచ్.వై.సి సల్మాన్ ప్రాణాలకు ప్రమాదం పొంచి
  • తప్పుడు కేసులు పెట్టిన అధికారులను వదిలిపెట్టం
  • ఎమ్మెల్సి తప్పుచేయకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు సస్పెండ్ చేశారు?
  • చంచల్ గూడ జైలులో ఉన్న సల్మాన్ ఖాన్ ను కలిసిన బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

హైదరాబాద్: హెచ్.వై.సి సల్మాన్ ఖాన్ బాధితులకు న్యాయం చేయాలని అడిగినందుకు తప్పుడు కేసులు పెట్టారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్ పేద మహిళను పేదరికం,బలహీనతను ఆసరా చేసుకొని, ఆమెను లోబరుచుకొని అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి, సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని సల్మాన్ ఖాన్ రాష్ట్ర డిజిపి,పోలీస్ కమీషనర్, మరియు డిసిపి క్రైమ్స్ మరియు శాసన మండలి స్పీకర్ ను కూడా కలిసి ఫిర్యాదు చేశారు.

అంతే కాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్సీ రహమత్ బేగ్ ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. పోలీసులు మాత్రం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరిన సల్మాన్ ఖాన్ మరియు బాధిత మహిళను జైలుకు పంపారు. సల్మాన్ ఖాన్ మీద ఇప్పటికే తెలంగాణ పోలీసులు 36 కేసులు నమోదు చేస్తే, హై కోర్టు మరియు సుప్రీం కోర్టు సుమారు 24 కేసులు కొట్టేసింది. అంటే 24 కేసులు తప్పుడు కేసులని అర్థమైంది.

సల్మాన్ ఖాన్ చేసిన నేరం ఏంటో పోలీసులు చెప్పడం లేదు. సల్మాన్ ఖాన్ మరియు బాధిత మహిళ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. బాధిత మహిళకు సల్మాన్ ఖాన్ ఎవరో కూడా తెలియదు. కానీ పోలీసులు మాత్రం అక్రమ కేసులు పెట్టి, ఎమ్మెల్సీని సల్మాన్ ఖాన్ 5 కోట్లు డిమాండ్ చేశాడని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్,మిర్జా రెహమత్ బేగ్ ఎక్కడ కలిశారో పోలీసులు అధారాలు చూపాలి. సెల్ ఫోన్ టవర్ లొకేషన్ బయట పెట్టాలి.

ఎమ్మెల్సీ రహమత్ బేగ్ మరియు బాధిత మహిళ మధ్య జరిగిన సంభాషణకు సంబంధించి కాల్ డేటా రికార్డు పరిశీలించాలి. ఎమ్మెల్సీతో పాటు నాంపల్లి ఎమ్మెల్యే కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నారు. వారిద్దరి మీద విచారణ జరపాలి. కానీ నేరం చేసిన నిందితులు బయట ఉంటే, నిందితులను శిక్షించాలని కోరిన వ్యక్తులను,బాధిత మహిళను జైలులో పెట్టారు. ఇది ఫయీమ్ ఖురేషి మరియు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగింది.

ఎమ్మెల్సి తప్పుచేయకపోతే అసదుద్దీన్ ఓవైసీ ఎందుకు సస్పెండ్ చేశారు? రేవంత్ రెడ్డి గతంలో బండి సంజయ్ కొడుకును పోక్సో కేసు నుండి కాపాడారు. ఇటీవల బిజెవైఎం నాయకుడిపై రేప్ కేసు అయితే 50 రోజుల నుండి నిందితున్ని కాపాడుతున్నారు. ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్సీ పి ఆరోపణలు వస్తే బాధితులను అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

తప్పుడు కేసులు పెట్టిన పోలీసులను వదిలిపెట్టం. రాబోయే బిఆర్ఎస్ పాలనలో వేధింపులకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకుంటం. రిటైర్ అయిన తర్వాత కూడా వదిలిపెట్టం. చట్టాన్ని అతిక్రమించి తప్పుడు కేసులు పెడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. బిఆర్ఎస్ పార్టీ సల్మాన్ ఖాన్ తరపున నిలబడుతుంది. అక్రమ కేసులు పెట్టి వేధించిన ప్రభుత్వ చర్యలను గుర్తుపెట్టుకుంటం.

రేవంత్ రెడ్డి, ఫయీం ఖురేషి కలిసి సల్మాన్ ఖాన్ ప్రాణాలకు హాని తలపెట్టాలని చూస్తున్నారు. సల్మాన్ ఖాన్ కు ఏం జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. యువ నాయకున్ని తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణం

Total Visitors: 3,498,933