రేవంత్.. నువ్వో బద్మాష్వి!

- గోడలమీద రాతలు రాసినోడివి
- అద్దె కట్టకపోతే ఓనరు నోటీసిచ్చాడు
- తిరుపతి రెడ్డి కి ఏం పదవి ఉందని కలెక్టర్, ఆర్డీఓ లు రావాలి?
- తెలంగాణకు కరువు తెచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి
- పట్టిసీమ దగ్గర కూడా బరాజ్ లేదు..కానీ నీటి పంపింగ్ అవుతుంది
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే డి .సుధీర్ రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
హైదరాబాద్ : కేసీఆర్‌పై కక్ష సాధింపు కోసం నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణకు కరువు తెచ్చిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్‌ను మొన్న సందర్శించినప్పుడు మేడిగడ్డ దగ్గర దాదాపు 21 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుంది. దాదాపు 2 టీఎంసీల నీళ్లు పోతున్నయి. ఎత్తిపోసుకునే అవకాశముంది.
మేడిగడ్డ బ్యారేజ్‌కు కన్నెపల్లికి దాదాపు 8 కిలోమీటర్ల దూరం ఉంది. కన్నెపల్లి పంప్‌హౌస్ దగ్గర ఎలాంటి ఇబ్బంది లేదు. మేడిగడ్డ దగ్గర క్రాక్ అయింది. కానీ అన్నారం, సుందిళ్ల బాగున్నాయని గతంలో ఎన్డీఎస్ఏ కూడా మాకు సర్టిఫికెట్ ఇచ్చింది. అలాగే సీడబ్ల్యూపీఆర్ఎస్ అనే సంస్థ కూడా వాళ్లకు క్లీన్ చీట్ ఇచ్చిందన్నారు.
ఆ 2 బ్యారేజ్‌లకు అన్నారం, సుందిళ్లకు ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. మీరు ఎత్తిపోసుకోవచ్చని కూడా స్పష్టం చెప్పడం జరిగింది. ఎన్డీఎస్ఏ కూడా కోర్టుకు ఏదైతే అఫిడవిట్ దాఖలు చేశారో స్పష్టంగా ఏం చెప్పారంటే.. మేం టెక్నికల్‌గా రిపోర్ట్ ఇవ్వగలుగుతం. నింపి ఎత్తిపోసుకునేది మీ ఇష్టం అని చెప్పిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు.
మనకు ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ఆగస్టు 1న 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు ఇదే మేడిగడ్డ నుంచి ప్రవాహం చేసి కిందికి పోయి సముద్రగర్భంలో కలిసినయి. పోయిన సంవత్సరం కూడా ఇంచుమించు 10-11 లక్షల క్యూసెక్కులు అదే మేడిగడ్డ 2025., 2026లో బ్యారేజ్ నుంచి పోయాయి.
మరి 10 లక్షల క్యూసెక్కుల నీళ్లు తట్టుకునే కెపాసిటీ మేడిగడ్డ దగ్గరున్నపుడు.. కేవలం ఎన్టీఎస్ఏ చెప్పింది. అక్కడ క్రాక్ వచ్చిందని కారణంగా చూపెట్టి నీళ్లు ఎత్తిపోయకుండా తెలంగాణ రాష్ట్ష్ట్రాన్ని ఎండిపెట్టినవ్. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న వ్యవసాయాన్ని కానీ, తాగునీరు కానీ అందరికీ అందకుండా చేసిన దుర్మార్గుడివి నీవని ఫైర్ అయ్యారు.
ముఖ్యమంత్రి మాట్లాడుతూ కన్నెపల్లి ,మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర పోయిన వాళ్లను తీవ్రమైన పదజాలంతో మాట్లాడాడు. బర్రెలు కాసేవారు చిన్నవారు కాదు.. వాళ్ళు పైసా పైసా కూడబెట్టి మంచి ఉన్నతమైన స్థానం కు ఎదిగారు. నన్ను బర్రెలు కాసేవారు అంటే నేను బాధపడను. నీవు మాత్రం ఎలాంటి కష్టం లేకుండా భూమిపై కన్నువేసి అక్రమంగా సంపాదించినవు.నీ తమ్ముడు 9తరగతి చదివి ఇప్పుడు స్వచ్ఛ బయో కు చైర్మన్ అవుతాడు.
అల్లుడికి మెడికవర్ హాస్పిటల్…ఇంకో తమ్ముడు కు ఇంకో కంపెనీ.నీ మనవడికి ఫుట్ బాల్ ఇస్తామని మెస్సి ఇక్కడకు తెప్పిస్తివి. నీ అన్న తిరుపతి రెడ్డి ఏం పదవి లేకున్న కొడంగల్ లో కలెక్టర్ సైతం సెల్యూట్ చేస్తాడు .జైపాల్ రెడ్డి పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని పేపర్ లో చూస్తున్నాం. జైపాల్ రెడ్డి పేరు తీస్తే ఆయన ఎంత కోపం ఉండేనో అందరికీ తెలుసు. తిరుపతి రెడ్డి ఏం పదవి ఉన్నది అని కలెక్టర్, ఆర్డీఓ లు రావాలి?
దేవాదుల ప్రాజెక్టు దగ్గర బరాజ్ లేదు. మోటర్లతోనే పంపింగ్ చేస్తున్నారు. సీతారామ దగ్గర కూడా బారజ్ లేదు. .పట్టిసీమ దగ్గర కూడా బరాజ్ లేదు. కానీ నీటి పంపింగ్ అవుతుంది.బ్యారేజ్ ఎప్పుడూ అవసరం నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు ఎండాకాలంలో అవసరం అవుతుంది.మేము పోయి నిలదీసిన తర్వాత దేవాదుల ప్రాజెక్టు మోటర్లు ఆన్ చేసి ఒక్క రోజు రెండు రోజు నడిపించి ఆఫ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకుండా తమాషా చేస్తోంది. రిటైర్డ్ ఇంజనీర్ లను అవమానకరమైన మాటలు మాట్లాడుతాడు.. రానున్న రోజుల్లో హైద్రాబాద్ లో త్రాగు నీటి సమస్య వస్తె ప్రజలే నిన్ను నీవు కోరుకున్న ట్రీట్మెంట్ ఇస్తారు.
బ్రోకర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు: మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.
దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇస్తే పాలకుర్తి నీ ఎందుకు కరువు మండలంగా ప్రకటించావు?
ఇక్కడ కాదు మాట్లాడాల్సింది. ఊర్లోకి వెళ్ళి పోలీసులు లేకుండా రా పోదాం. ప్రజలను అడుగుదాం. నేను రాజకీయంగా ఎప్పటి నుండో ఉన్నా. మా నాన్న రాజకీయ నాయకుడు. నీవు ఏంటి? ప్రింటింగ్ ప్రెస్ నడిపించే వాడివి? గోడల మీద రాసేవాడివి. అది కూడా రెంట్ కట్టకపోతే ఓనర్ నోటీస్ ఇచ్చాడు. బ్రోకర్ మాటలు నమ్మి ప్రజలు మోసపోయారు. ఇంకా మోసపోరు.
మా నాయకులను అనడం ఏంటి? నేను 7సార్లు గెలిచాను. నువ్వేంటి? గడుపు వస్తే గెలుస్తావు. నీ గురించి అంత తెల్సు.
డబ్బు అంత కొడంగల్ లో పెడుతున్నావ్. అక్కడ కూడా నిన్ను ఛీ కొడుతున్నారు. నేను రైతు కుటుంబంలో పుట్టాను…వరంగల్ జిల్లా ప్రజలు నన్ను ఆదరిస్తారు. నీవు బద్మాష్ వి ….దొంగ సర్టిఫికెట్ లు.. దొంగ పనులు. గడ్డం గురించి మాట్లాడతారా? ఎవరికి నష్టం వచ్చినప్పుడు వాళ్ళు పెంచుతారు. తీసేస్తారు. నేను కూడా ముప్పై ఏండ్లు పెంచాను. మొన్న ఆరు ఏండ్లు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ పెంచుతున్నాను.
