22 ఏళ్లకే విజయ వినోదిని… యువశక్తికి ప్రతీక!

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడుకు చెందిన కాకి వినోదిని 22 ఏళ్ల యువతి, ఎంపీటీసీ స్థానం నుంచి 1,081 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. పొలిటికల్ సైన్స్, అర్థశాస్త్రంలో పీజీ పూర్తి చేసిన వినోదిని, పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుస్తకాల్లో నేర్చుకున్న పాఠాలను ప్రజాసేవలో ఆచరణలో పెట్టే అవకాశం ఇప్పుడు ఆమెకు దక్కింది. యువత రాజకీయాల్లోకి రావాలని మాటల్లో కాదు, చేతల్లో చూపిన వినోదిని ఎందరో యువతీయువకులకు స్ఫూర్తి. ఆమె నమ్మకాన్ని ప్రజలు నిలబెట్టారు. ఈ చిన్న వయసులోనే పెద్ద బాధ్యత చేపట్టిన వినోదినికి మనస్ఫూర్తిగా అభినందనలు!
