November 9, 2026

సాఫ్ట్‌వేర్ కంపెనీ సీఈఓ… ఇప్పుడు ప్రజాసేవకుడు!

శ్రీకాకుళం: హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీని నడిపే స్థాయికి ఎదిగినా, పుట్టిన ఊరిని మరచిపోలేదు కర్రి శశిధర్. శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం మండలం ఎందువ ఎంపీటీసీ స్థానం నుంచి తెదేపా అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
ఎస్‌పీఆర్‌పురం గ్రామానికి చెందిన శశిధర్, హైదరాబాద్‌లోని జాల్‌టిక్స్ టెక్ ల్యాబ్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో సీఈఓగా పనిచేస్తున్నారు. తన సొంత డబ్బుతో గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టి, ప్రజల మనసులు గెలుచుకున్నారు.

కాంగ్రెస్ హయాంలో ఎచ్చెర్ల ఎమ్మెల్యేగా పనిచేసిన మీసాల నీలకంఠంనాయుడు వైకాపాలో చేరి, తన కుమార్తె కందిరమాదేవిని ఎంపీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిపారు. అంతటి రాజకీయ నేపథ్యం ఉన్న అభ్యర్థిపై శశిధర్ గెలిచి, ఆ స్థానాన్ని తెదేపా ఖాతాలో వేశారు. హోదా కాదు, సేవే ప్రజల నమ్మకాన్ని గెలుస్తుందని ఈ విజయం మరోసారి నిరూపించింది! చదువుకున్నవారు, వృత్తిలో ఎదిగినవారు ప్రజాసేవలోకి రావడం ఎంతో శుభపరిణామం. శశిధర్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు!

Total Visitors: 3,286,230