ఆంధ్ర హాస్పిటల్స్, మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం

నరసరావుపేట టౌన్: ముందుగా ప్రకటించినట్లుగానే 25 మంది చిన్నపిల్లలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని ఆంధ్ర హాస్పిటల్స్ డాక్టర్ డి. లింగస్వామి తెలియ జేశారు. డాక్టర్ లింగస్వామి మాట్లాడుతూ, పల్నాడు జిల్లా కేంద్రం అయిన నరసరావుపేట పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు, గుండె సంబంధిత సమస్యలు ఉన్న చిన్న పిల్లల తల్లితండ్రులు వారి పిల్లలను ఇలా వైద్యశిబిరం ఏర్పాటు చేసినప్పుడు తీసుకొని వస్తే, వాళ్లను పరీక్షించి అవసరమైన వారికి ఆంధ్రా హాస్పిటల్స్ మరియు హీరో మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఉచితంగా గుండె ఆపరేషన్లు చేస్తామని వెల్లడించారు.
హీరో కృష్ణ -మహేష్ బాబు యువ శక్తి పట్టణ అధ్యక్షులు ఎండి. ఫారూఖ్ బాబు మాట్లాడుతూ ఈ చిన్న పిల్లల వైద్య శిబిరం ప్రతి నెల మూడో శుక్రవారం నాడు నిర్వహిస్తున్నందున మన పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఉన్న పేద మధ్య తరగతి ప్రజలు అవసరమైన వారు ఈ సదవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోవాలని తెలియ జేశారు. ఈ సందర్భంగా పల్నాడుజిల్లా & టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షులు ఎండి.ఫారూఖ్ బాబు ఆధ్వర్యంలో డాక్టర్ లింగస్వామి ని శాలువాలతో ఘనంగా సన్మా నించారు.
నిర్వహించిన కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు అభిమానులు సీహెచ్ .చిన్ని కృష్ణ, ఎస్కె .సుభాని, డి .నాగేశ్వరరావు, జి .కోటేశ్వరరావు, మన్నేపల్లిశ్రీను, ఎస్కె .సుభాని, ఎస్కె .బాజీ,వినుకొండ ఫరీద్ మరియు ఆంధ్రా హాస్పిటల్స్ రిలేషన్ మేనేజర్ ప్రసాద్, అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
