టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్
అమరావతి ఆంధ్రుల ఆత్మవిశ్వాసానికి, ఆత్మాభిమానానికి ప్రతీకని, అలాంటి రాజధానిని చిన్నాభిన్నం చేసే క్రమంలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలు దారుణంగా ఉన్నాయని, అబద్దాలు ప్లస్ అరాచకం కలిస్తే వైసీపీప్రభుత్వమని టీడీపీనేత, శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరిలో ని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
వైసీపీప్రభుత్వం ఒకచరిత్రను భావితరాలు పూర్తిగా మర్చిపోయే లా, పాఠ్యాంశంగా ఉన్న అమరావతి అంశాన్ని పాఠ్యపుస్తకాల నుంచి తొలగించడం అన్యాయన్నారు. అమరావతికి అనుకూలమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, తీరా ముఖ్యమంత్రయ్యాక రాజధానిని ఒక సామాజిక వర్గానికే పరిమితం చేస్తూ, దుష్ప్రచారానికి తెగబడ్డాడన్నారు. సెల్ఫ్ సస్టెయినబుల్ ప్రాజెక్ట్ అయిన అమరావతి పూర్తైతే రాష్ట్రంతో పాటు, భావితరాలకు కూడా ఎంతో మేలు కలిగిస్తుందని,అలాంటి ప్రాజెక్ట్ ను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేయడం బాధాకరమని సత్యప్రసాద్ వాపోయారు.
దాదాపు 650రోజులకు పైగా అమరావ తి కోసం ఉద్యమిస్తున్న రైతులు, మహిళలనుకూడా ముఖ్యమం త్రి తనసొంత అజెండాతో వేధిస్తున్నాడన్నారు. అమరావతినిర్మాణా నికి శంఖుస్థాపనచేసిన మాజీముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, గతంలోనే దానికి అన్నిప్రాంతాలతో కలిసేలా రోడ్లకనెక్టివిటీని కూడా పూర్తిచేయడం జరిగిందన్నారు. అమరావతిలోనే హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ వాటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారన్నారు. అలాంటి అమరావతికి కేంద్రప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం లభిస్తుందనే నమ్మకం ప్రతిఒక్కరికీ ఉందన్నారు.
అమరావతి అంశాన్నిపాఠ్యాంశంగా తొలగించిన ప్రభుత్వం దాని స్థానంలో బాబాయ్ – గొడ్డలిపోటు, షర్మిలకన్నీటిగాధలు అనే అంశాలను పాఠ్యాంశాలుగా చేరుస్తుందా అని అనగాని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమరావతికోసం 175మంది రైతులు, రైతుకూలీలు ప్రాణాలుకోల్పోయారన్నారు. జగన్ ప్రభుత్వంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాబోయే తరాలపై కూడా ఈ ప్రభుత్వం ఇప్పటికే అప్పులచేసి కూర్చుందన్నారు. అలాంటి రాష్ట్రాన్ని అభివృద్ధిబాటపట్టించాలంటే, అమరావతి నిర్మాణమొక్కటే ప్రత్యామ్నాయమార్గమని టీడీపీ ఎమ్మెల్యే స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం అమరావతి నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, రాజధానికి భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి అంశాన్నిపాఠ్యాంశంగా ఉంచేలా ప్రభుత్వంపై తిరిగి ఒత్తిడితెస్తామన్నారు.