Suryaa.co.in

Andhra Pradesh

దాండియా..దునియాలో డ్యాన్సుల హోరు

– దాండియా డ్యాన్స్ తో అలరించిన తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి
– కంట్రీ క్లబ్ లో మహిళలతో కలిసి డ్యాన్స్ చేసిన ఎమ్మెల్యే శ్రీదేవి
– దసరా సందర్భంగా గుజరాతీయులతో కలిసి డ్యాన్స్ చేయడం ఎంతో సంతోషంగా ఉంది
– తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి
నిత్యం ప్రజలతో, వరుస సమీక్షలతో బిజీగా ఉండే తాడికొండ నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ వుండవల్లి శ్రీదేవి దాండియా డ్యాన్స్ చేసి అలరించారు.దసరా నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ బేగంపేటలోని కంట్రీ క్లబ్‌లో గురువారం నాడు ఏర్పాటు చేసిన దాండియా ఉత్సవానికి ఎమ్మెల్యే డాక్టర్ వుండవల్లి శ్రీదేవి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
దాండియా నృత్యం కోసం గుజరాతి సంప్రదాయం ప్రకారం రంగు


రంగులలో లెహంగా, ఛోళీ, బాందీనీ దుపట్టా గల డ్రెస్‌ను ధరించి..గాయనీగాయకులు, సంగీత వాయిద్యాల మధ్య హిళలతో కలిసి కాసేపు డ్యాన్సులతో హోరు చేశారు.కాసేపు ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి వారి కుమార్తెలతో కలిసి సంప్రదాయ బద్దంగా ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ దాండియా డ్యాన్స్ ఆడటంలో ఎంతో సంతోషంగా ఉందన్నారు. దేవీ శరన్నావరాత్రుల సందర్భంగా గుజరాతీ సంప్రదాయంలో లయబద్దమైన నృత్యాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE