-ఎన్టీఆర్ సాంప్రదాయాలకు తిలోదకాలు
ప్రతి ఏటా దశరా శరన్నవరాత్రులు చివరిరోజూ శ్రీ గంగా పార్వతీదేవి సమేత దుర్గా మల్లేశ్వరస్వామి కృష్ణా నదిలో జల విహారం చేస్తారు.ఇది 1985 నుంచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సూచనమేరకు ఎంతో చర్చించి,ఆగమ సలహా మండలి సూచన మేరకు నిర్వహిస్తూ వస్తున్నారు.గత రెండేళ్లుగా స్వామి వారి తెప్పోత్సవం ఎదో వంకతో నిలిపి వేస్తున్నారు. చివరకు ఈ ఏడాది కూడా కృష్ణానది వరద పోటు తీవ్రంగా ఉందనే సాకు చూపి తెప్పోత్సవం నిర్వహించడం లేదు. ప్రస్తుతం కృష్ణానదికి వరద ఉధృతి కన్నా ఎక్కువ వరద వచ్చినప్పుడు కూడా ఇరిగేషన్ అధికారుల సమన్వయంతో తెప్పోత్సవం నిర్వహిస్తున్నారు.కానీ వరద వంకతో రెండేళ్లుగా 35 ఏళ్లుగా వస్తున్న తెప్పోత్సవం సాంప్రదాయాన్ని నిలిపి వేయడం వెనుక కుట్ర ఉన్నట్టు స్పష్టం అవుతుంది.
నాలుగేళ్లు గా దసరా పండుగ రోజు కృష్ణానది నీటి మట్టం వివరాలు పరిశీలిద్దాం:
2018 అక్టోబర్ 19:11 వేల 865 క్యూసెక్
2019 అక్టోబర్ 08:19 వేల764 క్యూసెక్
2020 అక్టోబర్ 25:2 లక్షల 60 వేల 813 క్యూసెక్
2021అక్టోబర్ 15:15 వేల 949 క్యూసెక్ లు
వరద నీరు వచ్చింది.నాలుగేళ్లలో ఒక్క 2020 మినహా ప్రతి ఏటా వరద సాధారణంగానే ఉందని ఇరిగేషన్ రికార్డులు చెపుతున్నాయి.2018,19 సంవత్సరాల్లో జరిగిన తెప్పోత్సవం రెండేళ్లలో జరగక పోవడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో తెలియకుండా ఉంది.ఒక్క 2020 లోనే వరద ఉధృతి ఎక్కువగా వున్న నేపద్యంలోనూ,ఒకవేళ కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నది కనుక తెప్పోత్సవం చేయలేదు అనుకోవచ్చు.
కానీ ఈ ఏడాది బ్యారేజ్ కు 15 వేల 499 క్యూసెక్ ల వరద నీరే వస్తున్నప్పటికీఈ సాంప్రదాయం ను బ్రేక్ చేసే అధికారం ప్రభుత్వానికి ఎవ్వరు ఇచ్చారు అనే ప్రశ్న తలెత్తుతుంది. ఇంతకన్నా వరద ఉధృతి ఉన్నా రెండు మూడు రోజులు పులిచింతల్లో వరద నీరు నిలిపివేసి కృష్ణానదిలో దుర్గమ్మ జలవిహారం నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి.అయినా వాటి అన్నిటికీ తిలోదకాలు ఇచ్చి దుర్గగుడి దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో జరిగే సాంప్రదాయాలను జరగకుండా నిలివేయడం పట్ల ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
ప్రజలను,భక్తులను తప్పుదోవ పట్టించే విధంగా కృష్ణా నదికి వరద ఉధృతి ఎక్కువగా ఉంది ఆ కారణంగా తెప్పోత్సవం లేకుండా హంస వాహనంలో పూజలు నిర్వహించి మమ అనిపించేస్తున్నారు.ఇరిగేషన్ రికార్డులు ప్రకారం చూస్తే హంసవాహనం జల విహారం చేసే అవకాశం ఉంది.అయినా దేవాదాయశాఖ,ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం లోని ఎవ్వరో ఒత్తిడితోనే తెప్పోత్సవం రద్దు చేసి హిందూ సాంప్రదాయాలను మంట గలుపుతున్నారని స్పష్టం అవుతోంది.
– సాయిరాంప్రసాద్