– నిన్ను గద్దె దించే వరకు వదిలిపెట్టం
– చెత్త సీఎం గా నంబర్ 1 నువ్వు
– విజయశాంతి
హుజూరాబాద్ పట్టణం బృందావన్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన విజయశాంతి తెలంగాణ సీఎం కేసీఆర్పై విరుచుకుపడ్డారు. దళితబంధు పచ్చిమోసమంటూ ధ్వజమెత్తారు.
విజయశాంతి ఏమన్నారంటే.. బీజేపీ నాయకుల కంటే ఎక్కువ ప్రజలే భుజాన వేసుకొని ఈటల రాజేందర్ గెలవాలని చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో రాజేందర్ అయి పని చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈటల రాజేందర్ పేరే వినిపిస్తుంది. మా బిడ్డను మేమే గెలిపించుకుంటామని అంటున్నారు.
కెసిఆర్ ఎన్ని ఇచ్చిన తీసుకుంటాం కానీ ఓటు మాత్రం ఈటల రాజేందర్ గారికే అంటున్నారు.
6 సార్లు గెలిచారు అంటే ఆయనకు చిత్తశుద్ది ఉంది.పని చేసే నాయకులను ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కెసిఆర్ అబద్ధాలు అన్నీ ప్రజలకు అర్థం అయ్యింది. ఉద్యమ కారులను కెసిఆర్ అవహేళన చేశారు. తడిగుడ్డతో గొంతు కోశారు.అయన పార్టీకి అవసరం ఉన్నంతవరకు నాయకులను వాడుకొని వదిలివేశారు.
టైగర్ నరేంద్ర, విజయశాంతి ఈటెలరాజేందర్… బలవంతంగా నా పార్టీని విలీనం చేయించాడు. తెలంగాణ అనౌన్స్ చేసే ముందు రోజు నన్ను సస్పెండ్ చేసి ఆడదాన్ని అర్ధరాత్రి నడి రోడ్డు మీద నిలబెట్టారు కెసిఆర్.
ఈటలరాజేందర్.. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలిపెట్టి తిరిగారు. కరోనా సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి పని చేశారు. కెసిఆర్ కానీ వారి కుటుంబం వారు ఎవరు కూడా బయటికి రాలేదు. వారి ప్రాణం వారు చూసుకున్నారు. 20 ఏళ్లు పార్టీకోసం పనిచేసిన వాడిని, 7 ఏళ్లు మంత్రిగా పని చేసిన వారిని 7 నిమిషాల్లో తీసివేశారు.
తెలంగాణ ద్రోహులను నెత్తిన పెట్టుకున్నావు. తెలంగాణ ఉద్యమ కారులను నడిరోడ్డు మీద నిలబెడితే మమ్మల్ని బీజేపీ అక్కున చేర్చుకుంది. బడుగు బలహీనర్గాలకు పార్టీ బీజేపీ.
అసలు దోపిడీదారులు కెసిఆర్.సిట్టింగ్ జడ్జతో విచారణ జరపాలని తప్పు చేసి ఉంటే ఇప్పటికే శిక్ష వేయాలి అని ఈటల రాజేందర్ అడుగుతున్నారు. ఎందుకు వెయ్యలేదు? ఎదుగుతున్న లీడర్ అనే కదా ఆయన్ని బయటికి పంపించారు. మాలో చిత్తశుద్ది ఉంది.
నువ్వు కాదు మీ తాత కూడా మమ్మల్ని ఏం చెయ్యలేరు.
కెసిఆర్ నిన్ను గద్దె దించే వరకు వదిలిపెట్టం.నీకు యముడు బీజేపీ. గుణపాఠం చెప్పేది బీజేపీ. కెసిఆర్ ఏం చెప్తే కాంగ్రెస్ అది చేస్తుంది. ప్రజలు ఇంకా మోసపోవద్దు. దళిత బందు కెసిఆర్ మాయ. ఓట్లు గుంజెందుకు ఇది. 60 రోజుల టైం లో ఎందుకు ఇవ్వలేదు. బ్యాంక్ ఫ్రీజ్ ఎందుకు చేసావు. నీకు ఇవ్వడం ఇష్టం లేకనే కదా. GHMC ఎన్నికలో కూడా ఇలానే మోసం చేసావు కదా కెసిఆర్. ప్రజలకు మేలు చేయడు, దోచుకుంటాడు.
రేపటి నుండి తెరాసా నేతల ఇళ్ళముందు ధర్నా చేయండి. దళిత బంధు ఇవ్వమని.
భూములు స్వాధీనం చేసుకొని అయన బినామీలు అపజెప్తున్నరు. కెసిఆర్నీ భయం వెంటాడుతుంది. అందుకే ఈ నియోజకవర్గంలో మీటింగ్.
చెత్త సీఎం గా నంబర్ 1 నువ్వు. తెలంగాణ పరువు తీశాడు. మాట నిలబెట్టుకొలేని సీఎం మనకు అవసరమా? రావణ రాజ్యం పోవాలి. రాముడు రాజ్యం రావాలి. ఉద్యమకారున్ని నడిరోడ్డు మీద అమ్మిన వారు అవుతున్నారు. దుర్మార్గుడు కెసిఆర్ ఓడిపోవాలి.
బిచ్చగాళ్ల కావద్దు. తీర్పు మీరే రాయాలి. దళితున్ని సీఎం చేస్తానని చేయకపోవడం మొదటి మోసం.