– టీడీపీ నేత పట్టాభి అననిదాన్ని, అన్నట్లుగా ముఖ్యమంత్రే ప్రచారంచేస్తూ కావాలనే – రాష్ట్రంలో రౌడీమూకలు రెచ్చిపోయి విధ్వంసంచేసేలా చేస్తున్నాడు
– జగన్మోహన్ రెడ్డి, ఆయనమంత్రులు, వైసీపీఎమ్మెల్యేలు అన్నమాటలకు టీడీపీ వారి ఇగోలు దెబ్బతినవా.. వారికి తిరగబడటం తెలియదా?
– రాష్ట్ర భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొనే పసుపు సైనికులు సంయమనం పాటిస్తున్నారని ముఖ్యమంత్రి తెలుసుకుంటే మంచిది
– నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జీవీ.ఆంజనేయులు
రాష్ట్రంలో జగన్ రెడ్డి ఆయన గ్యాంగ్ డ్రగ్స్ మాఫియాతో లక్షలకోట్లు దోచుకుంటున్న విషయం బయటకు పొక్కడంతోపాటు, తనపైఉన్న సీబీఐ కేసుల విచారణ, తనబాబాయిహత్యకేసువ్యవహారంతో తనపరువుప్రతిష్టలు మంటగలవడంతోనే జగన్మోహన్ రెడ్డిఇంతలా నిరాశానిస్పృహలతో దారుణంగా ప్రవర్తిస్తున్నాడని నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు, మాజీశాసనసభ్యులు జీ.వీ.ఆంజనేయలు స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
రాబోయే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని తనసొంతసర్వేల్లో తేలింది. జగన్మోహన్ రెడ్డిపై తనసొంతపార్టీలోనే తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దానిఫలితమే వైసీపీనేతలు టీడీపీలో చేరుతున్నారు. టీడీపీనేత పట్టాభి రాష్ట్రయువతను నాశనం చేస్తున్నారన్న బాధతో ఒకమాటంటే , దానికే టీడీపీ కార్యాలయం పై దాడిచేయిస్తారా? కార్యాలయంలోపనిచేసేవారి నెత్తురు కళ్ల చూస్తారా ముఖ్యమంత్రి గారు. పోలీస్ వ్యవస్థను చేతిలోపెట్టుకొని తప్పుడుకేసులు పెట్టిస్తూ, ముఖ్యమంత్రి తననిరాశానిస్పృహలను ప్రతిపక్షంపై చూపుతారా? ఆయన అహంకారం, నిరాశ రాష్ట్రప్రజల ను నాశనంచేయాలా? ఆడవారిమెడల్లోని పుస్తెలను తెంపుతుం దా? ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్రంలో గంజాయి అమ్మకా లు యథేచ్ఛగా సాగుతున్నాయి.
లీటర్ లిక్విడ్ గంజాయి రూ.5వే లకు అమ్ముతున్నారు. రాజశేఖర్ రెడ్డిలా ఏదో మేలుచేస్తారని భావించి ప్రజలు నమ్మి జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే, ఆయన ఈరాష్ట్రాన్ని నట్టేటముంచారు. వైసీపీఎమ్మెల్యేలు, వారి కొడుకులు గంజాయి,ఇతరమాదకద్రవ్యాల వ్యవహారంలో మునిగితేలుతుంటే, దానిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలుతీసుకోవడంలేదు. రాష్ట్రంలో సోదాలు జరుపుతున్నకేంద్రదర్యాప్తుసంస్థలకు కేవలం 2శాతం మాదకద్రవ్యాలుమాత్రమే లభిస్తున్నాయి. మిగిలిన 98శా తాన్ని వైసీపీనేతలు కార్యకర్తలు యథేచ్ఛగా అమ్ముకుంటున్నా రు. ముఖ్యమంత్రికి నిజంగా గంజాయి, ఇతరమాదకద్రవ్యాలను అరికట్టాలని ఉంటే, తక్షణమే ఎక్సైజ్ మంత్రిని, ఆ శాఖ సిబ్బందిని గ్రామాలపైకి పంపాలి.
గ్రామాల్లో ఏరులై పారుతున్న నాటుసారా, కల్తీ లిక్కర్ అమ్మకాలను కట్టడిచేయాలి. వాటిఅమ్మకాలుసాగిస్తు న్న వైసీపీనేతలు, కార్యకర్తలను తక్షణమే అరెస్ట్ చేయించాలి. రాష్ట్రంలోని గ్రామాల్లో గంజాయి, నాటుసారా, కల్తీసారా అమ్మకాలు సాగుతుంటే, పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి కూడా దానికి వంతపాడుతున్నారు. ఆయన క్రిమినల్ లా, సైకోలా మారబట్టే, ప్రతిపక్షం ఏం మాట్లాడినా ఆయన ఇగో దెబ్బతింటోంది.చంద్రబాబు ని దారుణంగా దూషించినప్పుడు టీడీపీనేతల ఇగోలు దెబ్బతింటా యనిముఖ్యమంత్రికి తెలియదా? పవన్ కల్యాణ్ ఇతరనేతలను వైసీపీనేతలు, కార్యకర్తలు దూషించినప్పుడు బాధితులకు ఇగో ఉండదా? ముఖ్యమంత్రి, ఆయన పార్టీ వారి బూతులు, దూషణల ను టీడీపీ కార్యకర్తలు భరించాలా? టీడీపీ కార్యకర్తలు క్రమశిక్షణ గలసైనికులం కాబట్టే, చంద్రబాబునాయుడిని ప్రతిపక్షనేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఎన్నిమాటలన్నా, అభివృద్ధిని దృష్టిలోపెట్టుకొని మేం సంయమనం పాటించాము.
జగన్మోహన్ రెడ్డిలాగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగంచేయడానికి టీడీపీ ప్రయ త్నించలేదు. పల్నాడుసహా, రాష్ట్రంలోని అనేకప్రాంతాల్లో రౌడీయి జం, ఫ్యాక్షనిజం, గూండాయిజాలను టీడీపీప్రభుత్వం ఉక్కుపాదం తో అణచివేసింది. అసాంఘికశక్తుల మక్కెలు విరగ్గొట్టి, వారిని ఎక్కడ ఉంచాలో అక్కడుంచింది టీడీపీ ప్రభుత్వం. కానీ ఈ జగన్మో హన్ రెడ్డి, ఆయన ప్రభుత్వం వచ్చాక అరాచకశక్తులకుస్వేచ్ఛ లభించింది. ముఖ్యమంత్రి ఇంటిపక్కనే గ్యాంగ్ రేప్ జరిగితే నింది తులను శిక్షించలేకపోయారు. జగన్ గారి పాలనలోరాష్ట్ర భవిష్యత్ అంధకారమైంది. ముఖ్యమంత్రి ఇగో దెబ్బతింటే దానికి ప్రతిపక్షా లు, ప్రజలు బాధితులుగా మిగలాలా?
జగన్ రెడ్డి తల్లిని ఎవరు తిట్టారు…టీడీపీనేతపట్టాభి తిట్టలేదే. తనతల్లినిఎవరూ ఏమీ అనకపోయినా ముఖ్యమంత్రి దాన్ని పదేపదే చెప్పుకుంటూ, తనస్థాయిని తానే దిగజార్చుకున్నాడు. ముఖ్యమంత్రి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చంద్రబాబుని, లోకేశ్ ను,ఇతర టీడీ పీ నేతలనుఅనరాని మాటలు అనొచ్చు. వాళ్లతల్లులను, వారి కుటుంబసభ్యులను నోటికొచ్చినట్లు తిట్టొచ్చు.. పట్టాభిపై కేసులు పెట్టారు, పెట్టండి, ఏంచేస్తారో చేయండి. కానీ ఈ విధంగా రాష్ట్రంలో దాడులు చేయించడం ఏమిటి? దేశంలోనే ఒకప్పుడుఏపీ పోలీస్ వ్యవస్థ నంబర్ 1గా ఉండేది.
అలాంటివ్యవస్థపనితీరుని ఈ డీజీపీ మంటగలిపాడు. టీడీపీ కార్యాలయంపైకి డీఎస్పీ,సీఐ స్థాయి అధికా రులను పంపి, వారితో దాడిచేయించి, చివరకు దగ్గరుండి సాగ నంపుతారా? రాష్ట్ర భవిష్యత్ ను నాశనంచేయడమే డీజీపీ లక్ష్యంగా పెట్టుకున్నారా? ఇలాంటి వెధవ, చేతగాని డీజీపీని ఇంత వరకుచూడలేదు. ఐదుసార్లుకోర్టుల మెట్లుఎక్కినా, న్యాయస్థా నాల్లో చీవాట్లుతిన్నా, పద్ధతి మార్చుకోమనిచెప్పినా డీజీపీ మారలేదు. రక్షించాల్సిన పోలీస్ వ్యవస్థే దగ్గరుండి దాడిచేయించ డంకంటే సిగ్గుచేటు మరోటి లేదు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండవని, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు దానికి పూర్తివిరుద్ధంగాచేస్తు న్నాడు. ఆఖరికి ఎస్సీఎస్టీలకు 200యూనిట్లవరకు ఉచిత విద్యుత్ అని చెప్పి, బకాయిలు కట్టడంలేదని ఆయావర్గాలకు విద్యుత్ కట్ చేయిస్తున్నారు. వినుకొండ సమీపంలోని శావల్యా పురంగ్రామంలో ఎస్సీ,ఎస్టీల విద్యుత్ కనెక్షన్లు దారుణంగా కట్ చేయించారు. ఇది ఆయావర్గాలను మోసగించడంకాదా? పింఛన్ల పెంపు విషయంలో ఈ ముఖ్యమంత్రి అవ్వాతాతలు, వితంతువు లను మోసగించలేదా? అలాచేసినవ్యక్తిని మోసకారి ముఖ్యమంత్రి అనరా? చంద్రబాబు ఏనాడూ వ్యక్తిగతదూషణలు, అరాచకాలకు పాల్పడలేదు.
కేవలం రాష్ట్రాభివృద్ధి గురించే ఆయనఆలోచించారు. తనవాళ్లు రెచ్చిపోతారని ముఖ్యమంత్రి చెప్పడం రాష్ట్రంలో రౌడీయి జం, గూండాయిజం పెంచడం కాదా? ముఖ్యమంత్రి స్థానంలోఉన్న వ్యక్తే గంజాయి, ఇతరమాదకద్రవ్యాలనుపెంచి పోషించడం, రౌడీయిజాన్ని, అరాచకాలను పెంచడం ఏమిటి? ఈ ముఖ్యమంత్రి చేతగాని వాడని ప్రజలకు అర్థమైంది.
లక్షకోట్లుదోచుకున్నా కూడా తన తండ్రిపైఉన్నసానుభూతితో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అధికా రమిచ్చారు. జగన్ రెడ్డి అధికారంశాశ్వతంకాదని గుర్తుంచుకోండి. వచ్చేది టీడీపీప్రభుత్వమే.. అరాచకాలు సృష్టిస్తూ, గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను అమ్ముతూ, రాష్ట్రభవిష్యత్ ను నాశనం చేస్తున్నవారి ఆటకట్టిస్తాం. ప్రజలే ఈ ముఖ్యమంత్రిపై, ప్రభుత్వం పై తిరగబడేరోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి సాగిస్తున్న ఇగోయిస్ట్ శాడిస్ట్ పాలనకు ప్రజలే సమాధికడతారని హెచ్చరిస్తు న్నాం.