వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అరెస్ట్ చేయించాలి

– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
ఎవరైతే చంద్రబాబుని గతంలో అనరాని మాటలన్నాడో, అదేవ్యక్తి నీతినిజాయితీ సంస్కృతి సంప్రదాయాలని మాట్లాడటం రాష్ట్రప్రజల ఖర్మ. ముఖ్యమంత్రికి నిజంగా చిత్తశుధ్ధిఉంటే, వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డిని అరెస్ట్ చేయించాలి. మాజీ ముఖ్యమంత్రిపై బాంబులు వేస్తామన్నచిత్తూరుకి చెందిన రెస్కో ఛైర్మన్ ని కఠినంగా శిక్షించాలి. రాయలసీమనేతలు వైసీపీలోనే ఉన్నారా.. టీడీపీలోని సీమ నేతలేమీ గాజులు వేసుకొని లేరు. రాయలసీమలోని అసలు రెడ్లంతా టీడీపీలోనే ఉన్నారు.కల్తీ రెడ్లే వైసీపీలో ఉన్నారు. పట్టాభిఅరెస్ట్ విషయంలో చూపిన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి తనపార్టీనేతలపై కూడా చూపాలి. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో బూతులు మొదలుపెట్టిందే జగన్మోహన్ రెడ్డి, పట్టాభి మాటలకు చంద్రబాబుకు సంబంధముంటే, మైదుకూరు వైసీపీఎమ్మెల్యే కూడా జగన్మోహన్ రెడ్డి చెబితేనే మాట్లాడాడా ఇతర వైసీపీనేతలు, మంత్రులుకూడా ముఖ్యమంత్రి తిట్టమంటనే చంద్రబాబుని, టీడీపీనేతలను తిడుతున్నారా? ముఖ్యమంత్రి ఇకనుంచి మంచి సంప్రదాయానికి తెర తీస్తే, తాముకూడా ఆయన బాటలోనే నడుస్తాం.