వైసీపీఎమ్మెల్యే రఘురామిరెడ్డి, రెస్కో ఛైర్మన్ ను అరెస్ట్ చేయించాలి

– పట్టాభి అరెస్ట్ విషయంలో చూపిన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి, తనపార్టీ వారి విషయంలోకూడా చూపాలి.
– 1988లోనే ఒకకేసులో ఏ1ని, మాకుచేతగాకకాదు.. పెద్దాయన (చంద్రబాబు) చెబుతున్నాడనే ఆలోచిస్తున్నాం : శ్రీనివాసరెడ్డి .
– టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి , టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డివారి శ్రీనివాసులరెడ్డి
చిన్నాపెద్దా తారతమ్యం, గౌరవం మర్యాదలేకుండా హద్దులుమీరి మాట్లాడింది జగన్మోహన్ రెడ్డేనని, 2014 – 2019మధ్యన రాష్ట్రం లో ఆయన మాట్లాడిన మాటలనుఎవరుసమర్థిస్తారో చెప్పాలని, ప్రతిపక్షనేతగా ఉండి, ముఖ్యమంత్రిస్థానంలోఉన్న చంద్రబాబుని ఉద్దేశించి, ఏవ్యక్తీ అనకూడని మాటలుఅన్నాడని, టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆగ్రహంవ్యక్తంచేశారు.శుక్రవారం ఆయన టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు రెడ్డివారి శ్రీనివాసులరెడ్డితో కలిసి మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు వారిరువురి మాటల్లోనే … ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబుని అన్న మాటలు చెప్పడానికే తాము చాలాబాధపడుతున్నాం. బాబుని బంగాళాఖాతంలో కలుపుతామని, చెప్పుతోకొట్టాలని, ఊళ్లల్లో తిరక్కుండా రాళ్లతోకొట్టాలని, అవసరమైతే బాబు కాలర్ పట్టుకుంటానని అన్నాడు. మరి ఇప్పుడు నీతులుచెబుతున్న వ్యక్తి, ఆనాడు సిగ్గులేకుండా ఈవిధంగా ఎలా మాట్లాడాడు? రాష్ట్రంలో బూతులకుపురుడుపోసిన వ్యక్తే, నేడు రాష్ట్ర ప్రజలకు నీతినిజాయితీగురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి మాట్లాడటం నిజంగా రాష్ట్రప్రజల ఖర్మ. పట్టాభిని అరెస్ట్ చేయడంలో ఈ ముఖ్యమంత్రి ఎంతో చిత్తశుద్ధిని చూపించాడు. అదే చిత్తశుద్ధిని తనపార్టీఎమ్మెల్యే అయిన రఘురామిరెడ్డిని, చిత్తూరుకుచెందిన వైసీపీనేత, రెస్కోఛైర్మన్ గా ఉన్నవ్యక్తిని అరెస్ట్ చేయడంలోకూడా చూపాలి.
ముఖ్యమంత్రి నేటినుంచే మంచి రాజకీయాలకు తెరతీస్తే, తాముకూడా వాటినే కొనసాగిస్తాం. అదిఈరోజు నుంచే మొదలుపెట్ల్టాలని మేం కోరుతున్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రే చెప్పారు కదా.. బాధ్యతాయుతమైన పదవుల్లోఉన్నవారిని అంటే చూస్తూఊరుకోమని. మరి ప్రతిపక్షనేతపై బాంబులు వేస్తామని బాహటంగానే బెదిరించిన వారిపై ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఏంచర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం.
రఘురామిరెడ్డి ఒక్కడే రాయలసీమ వాసి కాదు.. మేమూ రాయలసీమ వాసులమే. రాయలసీమలోని అసలైన రెడ్లే టీడీపీలోఉన్నారు. కల్తీరెడ్లు మాత్రమే వైసీపీలో ఉన్నారు. అసలు రెడ్లు ఏకమైతే వైసీపీనేతలెవరూ రాయలసీమ లో తిరగలేరు.
తిరుమలస్వామివారికి సతీసమేతంగా పట్టువస్త్రా లు సమర్పించని వారే కల్తీరెడ్లు. పట్టాభితో చంద్రబాబు మాట్లాడించారని అంటున్నారు… అదే నిజమైతే, ఇప్పుడు వైసీపీఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కుప్పానికి చెందిన వైసీపీనేత మాట్లాడిన మాటలు కూడా జగన్మోహన్ రెడ్డే మాట్లాడించాలని అనుకోవాలా? నిన్నంతా బాగా బాధపడ్డానని ముఖ్యమంత్రిచెప్పాడుకదా.. ఆయన బాధేమిటో నిజంగా ప్రజలకు తెలియాలంటే, తనపార్టీవారిపైనే ఆయన చర్యలు తీసుకోవాలి.