ఉక్కుమనిషి సర్దారు వల్లభ ఝవేరీ పటేల్ జయంతి దేశంలోని 565 సంస్ధానములను విలీనం చేసిన వీరుడు. విలీనానికి ససేమిరా అన్న సామంతుల మెడలు వంచినధీశాలి మన పటేలుడు.
స్వాతంత్య్ర భారతానికి తొలి ప్రధాని కావలసిన వ్యక్తి అయినా గాంధీ కుట్ర కారణముగా ఒక అయోగ్యడు మన దేశమునకు ప్రధానిగా దాపురించినాడు.
తెలంగాణకి స్వాతంత్రం ప్రసాదించిన ఘనుడు పటేలుడు. ఆయన పదవిలో ఉన్నది 40 నెలలే కానీ నాటి అస్తవ్యస్థ పరిస్థితిని చక్కదిద్దిన దార్శనికుడిగా దేశం ఎప్పటికీ ఆయనను స్మరించుకుంటుంది.వారి గురించి మనపిల్లలకు చెబుదారి.
సర్దార్ పటేల్ మరణించినప్పుడు
పటేల్ మరణించిన గంటకు అప్పటి ప్రధాని నెహ్రూ మరణంతో బాటుగా ఇలా ప్రకటించాడు –
1. పటేల్ కిచ్చిన ప్రభుత్వ కారుని వెంటనే వెనక్కు తీసుకురండి.
2. కేంద్రహోంశాఖ కార్యదర్శులు గానీ , ఇతర అధికారులు గానీ బొంబాయి వెళ్ళదలచుకుంటే వారివారి సొంత ఖర్చులపై వెళ్ళవలసి ఉంటుంది.
అయితే , హోంశాఖ కార్యదర్శి VP Menon మాత్రం నెహ్రూ ఇచ్చిన ఉత్తరాన్ని , తాను ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో బహిర్గతం చేయలేదు. పైగా అధికారులను తన ఖర్చుపై బొంబాయి పంపించాడు.
తరువాత నెహ్రూ అప్పటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ కి పటేల్ అంతిమసంస్కారంలో పాలు పంచు కొనవలదనే కాబినెట్ సిఫార్సుని పంపాడు. కానీ , రాష్ట్రపతిగా ఉన్న రాజేంద్రప్రసాద్ నెహ్రూ ఇచ్చిన ఉచిత సలహాని పక్కనపెట్టి అంత్యక్రియలకు హాజరవ్వడానికే నిర్ణయం తీసుకున్నారు. అది తెలిసిన నెహ్రూ ప్రభుత్వం తరపున రాజగోపాలాచారిని పంపించి , ప్రభుత్వ స్మారక పత్రాన్ని రాష్ట్రపతికి ఈయకుండా రాజగోపాలాచారిచే చదివించాడు.
అనంతరం పటేల్ కి ఒక స్మారకాన్ని నిర్మించాలని కాంగ్రెస్ పార్టీ తీర్మానించింది. ముందు నెహ్రూ విరోధించాడు , తరువాత సరేనని హామీ ఇచ్చాడు. తరువాత పటేల్ ఒక రైతు నాయకుడనీ , కాబట్టి గ్రామగ్రామాల ఆయన పేర నూతులు తవ్వించాలనీ నెహ్రూ తన పార్టీవారిని నమ్మించాడు. ఆ నూతి తవ్వకాలు ఎప్పుడు ప్రారంభమైనాయో , ఎప్పుడు ముగిసాయో నెహ్రూ కే తెలియాలి.
అనంతరం , మునుపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో తనకు పోటీగా పటేల్ పేరుని ప్రతిపాదించిన పురుషోత్తమదాస్ టాండన్ ను పార్టీనుండి బహిష్కరించాడు.
ఇవన్నీ ఎందుకు గుర్తుచేసుకోవడమంటే , కాంగ్రెస్ వారు ఇప్పుడు పటేల్ నామజపం చేస్తున్నారు కనుక. మన హిందూ సంస్కృతి ని , ఆచారాలను నాశనం చేయ కంకణం కట్టుకున్న కాంగ్రెస్ వాళ్ళు… 70 ఏళ్ళుగా గుట్టుచప్పుడు కాకుండా , చాపకిందనీరులా తమ రహస్య ఎజెండా ను అమలు జరుపుతున్నారు.