Suryaa.co.in

Andhra Pradesh Telangana

ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

 

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్‌ విడుదలైంది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పుగోదావరి-1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్‌ ప్రకటించారు. నవంబర్‌ 16న నోటిఫికేషన్‌, డిసెంబర్‌ 10న పోలింగ్‌, 14న కౌంటింగ్‌ జరగనుంది. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్‌ను ప్రకటించారు. నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవంబర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న కౌంటింగ్ జరగనుంది.

LEAVE A RESPONSE